India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ప్రభుత్వం అమలు చేయాల్సిన దీపం పథకంపై సీఎం చంద్రబాబుకు EESL సీఈవో విశాల్ కపూర్ కీలక సూచనలు చేశారు. ‘ఈ స్కీమ్ కింద GOVT ఇచ్చే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు బదులు ఒక ఇండక్షన్ స్టౌ, రెండు సిలిండర్లను అందించండి. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,261 కోట్లు మిగులుతుంది. గ్యాస్ వినియోగం తగ్గి లబ్ధిదారులకు ఏటా రూ.2,433 కోట్లు ఆదా అవుతుంది’ అని పేర్కొన్నారు.
TG: HYDRA పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, నిబంధనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. అమల్లోకి వచ్చాక త్వరలోనే హైడ్రా పేరిట స్వయంగా నోటీసులు ఇస్తామన్నారు. హైడ్రా పేరుతో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, వీటిలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు తమ విచారణలో తేలిన అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
TG: హైదరాబాద్‌లో చెరువులను ఆక్రమించిన వారి గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA)ని రాష్ట్ర ప్రభుత్వం జులై 19న ఏర్పాటు చేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటివి హైడ్రా బాధ్యతలు. చెరువుల FTLలో, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా కూల్చేస్తోంది.
హీరో కళ్యాణ్ రామ్ వరుసగా కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్‌లో మూవీ చేస్తుండగా, ఆ వెంటనే బింబిసార-2 సెట్స్‌పైకి వెళ్లనుంది. తాజాగా కుమారి 21F ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో మరో చిత్రానికి హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథపై చర్చలు పూర్తయ్యాయని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై దీన్ని తెరకెక్కిస్తారని సమాచారం.
AP: డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు రాయితీపై ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించే ఆలోచన చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్(EESL) ప్రతినిధులతో సమీక్షలో ఆయన మాట్లాడారు. ‘PMAY ఇళ్లకు ఇంధన సామర్థ్య విద్యుత్ పరికరాలను రాయితీపై అందిస్తాం. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్ వినియోగిస్తాం. ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకూ ఎలక్ట్రిక్ వస్తువులపై సబ్సిడీ ఇస్తాం’ అని చెప్పారు.
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి 12 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. 3న బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. 4న గాయత్రీదేవి, 5న అన్నపూర్ణ, 6న లలితా త్రిపుర సుందరీదేవి, 7న మహాచండీ, 8న మహాలక్ష్మీ దేవి, 9న సరస్వతి, 10న దుర్గాదేవి, 11న మహిషాసురమర్దిని, 12న రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు EO రామారావు తెలిపారు.
AP: శ్రీకాకుళంలో భూప్రకంపనలు అలజడి రేపాయి. ఇచ్ఛాపురం పరిసరాల్లో తెల్లవారుజామున 3.40 గంటలకు ఒకసారి, 4.03 గంటలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. 3 సెకన్ల పాటు భూమి కంపించినట్లు సమాచారం. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బీసీసీఐ కార్యదర్శి రేసులో తాను లేనని ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ చెప్పారు. తాను BCCI స్థాయిలో ఎలాంటి పదవులు చేపట్టబోనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన దృష్టంతా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌పైనే ఉందని చెప్పారు. కాగా జైషా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి స్థానం ఖాళీ అవనుంది. రోహన్ బీజేపీ దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడు కావడం గమనార్హం.
AP: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో TDP MP మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో మాగుంటకు కవితతో దాదాపు సమానపాత్ర ఉందని పేర్కొంది. ‘కేసు ఫైళ్లను చూస్తే నిర్ణయాలన్నీ MP ఇంట్లోనే జరిగినట్లు తెలుస్తోంది. అయినా ఆయనను నిందితుడిగా చేర్చలేదు. ఇష్టం ఉంటే వదిలేసి, ఇష్టం లేకపోతే నిందితులుగా చేర్చుతారా’ అని ED తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇ-క్యాబినెట్ భేటీ జరగనుంది. ఇకపై ప్రతి మంత్రివర్గ సమావేశం ఇలాగే నిర్వహిస్తారు. ఎజెండా, నోట్స్.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఇవాళ్టి భేటీలో రివర్స్ టెండరింగ్ రద్దు చేసి పాత టెండర్ల విధానం, సాగునీటి సంఘాలకు ఎన్నికలు, ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ఎడమ కాలువకు టెండర్లు తదితర అంశాలపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.
Sorry, no posts matched your criteria.