News November 2, 2024

IPL-2025కు స్టార్ క్రికెటర్ దూరం!

image

IPL-2025కు దూరంగా ఉండాలని ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. IPL-2023లో చెన్నై తరఫున ఆడిన స్టోక్స్.. 2024లో గాయాల కారణంగా దూరంగా ఉన్నారు.

News November 2, 2024

తగ్గేదే లే.. జాబ్ కొట్టాల్సిందే

image

AP: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో గ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో కొద్ది నెలల్లో డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటితో పాటు SSC, బ్యాంకులు, ఆర్ఆర్‌బీకి సంబంధించిన పరీక్షలకు తేదీలు విడుదలయ్యాయి. వచ్చే మూడు నెలల పాటు ఇవి జరగనున్నాయి. దీంతో ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

News November 2, 2024

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

image

అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. స్థానికంగా వీరి క‌ద‌లిక‌ల‌పై స‌మాచారం అందుకున్న బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఒక విదేశీ ఉగ్ర‌వాది స‌హా మ‌రొక‌రు మృతి చెందారు. శ్రీనగర్ ఖాన్యార్‌లో ఎదురు కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన కొద్దిసేప‌టికే ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శుక్ర‌వారం నుంచి వ్యాలీలో నాలుగు ఉగ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి.

News November 2, 2024

సిమెంట్ నేర్పే జీవిత పాఠం!

image

ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటుంటారు. తాజాగా నిర్మాణాలకు వినియోగించే సిమెంట్‌ కూడా జీవిత పాఠాన్ని బోధిస్తుందని ఆయన తెలిపారు. ‘ఏదైనా సృష్టించడానికి మీరు మృదువుగా, సరళంగా ఉండాలి. అయితే దీనిని నిలబెట్టుకోడానికి మీరు దృఢంగా మారాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్?

News November 2, 2024

బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా: CBN

image

AP: ఇసుక, మద్యం విషయంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా వ్యాపారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ పెడతామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యంపై ఇష్టానుసారం రేట్లు పెంచితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.

News November 2, 2024

చరిత్ర సృష్టించిన బైకర్ గర్ల్

image

ఝార్ఖండ్‌కు చెందిన ‘బైకర్ గర్ల్’ కంచన్ ఉగుర్సాండి ఇండియా-చైనా సరిహద్దుకు చేరుకొని చరిత్ర సృష్టించారు. 17,500 అడుగుల ఎత్తులో ఉన్న లిపులేఖ్ పాస్‌ను చేరుకున్న మొదటి మోటార్‌సైకిలిస్ట్‌గా ఆమె నిలిచారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కైలాస మానసరోవర్ రహదారిలో డ్రైవ్ చేస్తూ అక్కడికి చేరుకున్నారు. 32 ఏళ్ల ఈ గిరిజనురాలు ఢిల్లీ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ గుండా ప్రయాణించారు.

News November 2, 2024

విశాఖ TO అమరావతి 2 గంటల్లో వెళ్లేలా..: CM

image

AP: విశాఖ నుంచి అమరావతికి 2 గంటల్లో వెళ్లేలా రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేషనల్ హైవేలపై ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నామని, సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. నక్కపల్లి వద్ద రూ.70వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు.

News November 2, 2024

భారత్ ఆలౌట్.. 28 పరుగుల ఆధిక్యం

image

NZతో జరుగుతోన్న చివరి టెస్టులో భారత్ స్వల్ప ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్సులో కివీస్ 235 రన్స్ చేయగా టీమ్ ఇండియా 263 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేనకు 28 పరుగుల ఆధిక్యం లభించింది. గిల్ 90, పంత్ 60 రన్స్ చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో సత్తా చాటారు.

News November 2, 2024

రేషన్‌లో బియ్యం, పంచదార, కందిపప్పు, జొన్నలు

image

AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్‌లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చు. గరిష్ఠంగా 3KGల వరకు ఇస్తారు. ఇటు పంచదార, కందిపప్పుని సబ్సిడీపై అందిస్తున్నారు. ఈ నెల నుంచి 100% రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా చర్యలు తీసుకున్నారు. రూ.67కి కందిపప్పు, అరకేజీ పంచదార రూ.17కు ఇస్తున్నారు.

News November 2, 2024

‘రాజాసాబ్’లో ప్రభాస్ షర్టుపై ట్రోల్స్.. ఎందుకంటే?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తోన్న ‘రాజాసాబ్’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. అందులో చెక్స్ షర్టులో ఆయన కనిపించారు. అయితే, ఇదే షర్టును ‘విశ్వం’ సినిమాలో గోపీచంద్ ధరించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రెండు సినిమాల ‘బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కావడంతో ‘భారీ బడ్జెట్ అని చెప్పి ఇలా ఒకే షర్ట్‌తో మేనేజ్ చేస్తున్నారా?’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.