News November 2, 2024

రోడ్లు బాగుంటే పరిశ్రమలు వస్తాయి: సీఎం

image

AP: గుంతలు లేని రోడ్లే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్లపై గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని, ఈ దుస్థితికి గత పాలకుడే కారణమని విమర్శించారు. రోడ్లపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. రహదారులు బాగుంటే పరిశ్రమలు వస్తాయని చెప్పారు. సంక్రాంతిలోపు రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండొద్దని ఆదేశించారు.

News November 2, 2024

RECORD: ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన పంత్

image

భారత బ్యాటింగ్ సెన్సేషన్ పంత్ అరుదైన రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 36 బంతుల్లోనే 50 రన్స్ కొట్టారు. దీంతో NZపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్‌గా నిలిచారు. దీంతో జైస్వాల్(పుణేలో 41బంతుల్లో) రికార్డు బ్రేకయ్యింది. కాగా ఆ తర్వాత నెమ్మదించిన పంత్ 59 బంతుల్లో 60 రన్స్ చేసి ఔటయ్యారు. అందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.

News November 2, 2024

WhatsAppలో కొత్త ఫీచర్.. ట్రై చేశారా?

image

వాట్సాప్‌లో కొత్తగా ‘యాడ్ మెన్షన్’ అనే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. స్టేటస్ అప్‌డేట్ చేసేటప్పుడు కింది భాగంలో కుడివైపున ‘@’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మన కాంటాక్ట్ లిస్టులో నచ్చినవారిని మెన్షన్ చేయొచ్చు. ఆ వెంటనే మెన్షన్ చేసిన వ్యక్తికి మనం స్టేటస్ అప్‌డేట్ చేసినట్లు నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ తరహాలో ట్యాగ్ చేసిన వ్యక్తి పేరు అందరికీ కనిపించదు.

News November 2, 2024

మా పాలనలో తెలంగాణ సూర్యుడిలా ఉదయిస్తోంది: రేవంత్

image

TG: కాంగ్రెస్ హామీలు అమలు చేయట్లేదన్న ప్రధాని మోదీ <<14506698>>ట్వీట్‌కు<<>> సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్‌పై సబ్సిడీ, ఉచిత కరెంట్ అందిస్తున్నాం. రూ.18వేల కోట్ల రుణమాఫీ చేశాం. స్కిల్స్, స్పోర్ట్స్ వర్సిటీలు నిర్మిస్తున్నాం. పోటీ పరీక్షలను విజయంతంగా నిర్వహించాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాధించలేని రికార్డులివి. BRS చీకటి పాలన పోయి తెలంగాణ సూర్యుడిలా ఉదయిస్తోంది.’ అని ట్వీట్ చేశారు.

News November 2, 2024

ఇంకెంత మంది బాలికలు బలవ్వాలి పవన్?: వైసీపీ

image

AP: పవన్ కళ్యాణ్ కక్ష సాధింపులపై కాకుండా శాంతిభద్రతలపై దృష్టి పెట్టాలని వైసీపీ ట్వీట్ చేసింది. తిరుపతి జిల్లాలో మూడున్నరేళ్ల బాలికపై <<14509648>>హత్యాచార<<>> ఘటనను మెన్షన్ చేస్తూ విమర్శలు గుప్పించింది. ‘మీ చేతగానితనంతో ఇంకెంత మంది బాలికలు ఇలా బలి అవ్వాలి పవన్ కళ్యాణ్?’ అని ప్రశ్నించింది.

News November 2, 2024

తన డీప్‌ఫేక్ ఫొటోపై స్పందించిన మృణాల్

image

సినీ ఇండస్ట్రీని డీప్‌ఫేక్ వెంటాడుతూనే ఉంది. తాజాగా నటి మృణాల్ ఠాకూర్‌తో దీపావళి టపాసులు కాల్చినట్లు ఓ వ్యక్తి ఫొటో ఎడిట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇది వైరలవడంతో దీనిపై మృణాల్ స్పందించారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మీరెందుకు ఇలా తప్పుగా ఫొటోలు ఎడిట్ చేస్తున్నారు? ఈ పని బాగుంది అనుకుంటున్నారా? అస్సలు బాలేదు’ అని కామెంట్ చేశారు. గతంలోనూ అసభ్యకర వీడియోకు రష్మికతో డీప్‌ఫేక్ చేశారు.

News November 2, 2024

నేను బతికే ఉన్నా.. మార్చురీకి తీసుకెళ్తుండగా లేచిన యువకుడు

image

UPలోని మీరట్ మెడికల్ కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన షగుణ్ శర్మ అనే యువకుడిని అక్కడికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం చేసేందుకు మార్చురీకి తీసుకెళ్తుండగా అతనిలో కదలిక వచ్చింది. తాను బతికే ఉన్నానంటూ చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. వెంటనే ICUకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.

News November 2, 2024

మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై రేప్ కేసు

image

AP: బాపట్ల జిల్లా YCP నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం, మోసం కేసులు నమోదయ్యాయి. కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగం ఇప్పిస్తానని మేరుగు నాగార్జున తన నుంచి డబ్బు తీసుకుని తిరిగివ్వలేదని విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తనను బలవంతంగా శారీరకంగా అనుభవించారని ఆమె పేర్కొంది. ఇటు మేరుగు నాగార్జున పీఏపైనా పోలీసులు బెదిరింపుల కేసు నమోదు చేశారు.

News November 2, 2024

‘పుష్ప2’లో శ్రీలీల ఐటమ్ సాంగ్?

image

‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇందులో ఐటమ్ సాంగ్‌లో శ్రీలీల స్టెప్పులేయనున్నట్లు టాక్. దీని కోసం తొలుత బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ని సంప్రదించగా అది వర్కౌట్ కాలేదని, షూట్ దగ్గర పడుతుండటంతో శ్రీలీలను ఓకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే సాంగ్‌లో శ్రీలీలతో పాటు సమంత కూడా పుష్పరాజ్‌తో కలిసి సందడి చేయనున్నట్లు సమాచారం.

News November 2, 2024

చిన్నారి హత్యాచారం ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

image

AP: తిరుపతి జిల్లాలో చిన్నారిపై <<14509648>>హత్యాచారం<<>> ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. హోంమంత్రి అనిత రేపు బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు.