India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని TTD ఛైర్మన్ BR.నాయుడు అనడంపై MIM MP అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘TTDలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఛైర్మన్ అంటున్నారు. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులు ఉండటాన్ని తప్పనిసరి చేయాలనుకుంటోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. హిందువులను, ముస్లింలను ఒకేలా చూడాలని అభిప్రాయపడ్డారు.
TG: కులగణనతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ, హైకోర్టు ఉత్తర్వుల మేరకే కులగణన చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థలు, ఇతర రంగాల రిజర్వేషన్లపై ఆలోచన చేస్తున్నామని, DECలో సర్వే నివేదికను ప్రభుత్వం ముందు ఉంచుతామని తెలిపారు. కులగణనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
TG: నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇందుకోసం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరు. సర్వే టైంలో కుటుంబ యజమాని ఒకరు ఉంటే సరిపోతుంది.
ఐపీఎల్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్‌ను కొనుగోలు చేయాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 38 ఏళ్ల ఆల్‌రౌండర్ 2008 నుంచి 2015 వరకు చెన్నై తరఫున ఆడారు. ఆ తర్వాత వేరే ఫ్రాంచైజీలకు వెళ్లారు. రాజస్థాన్ రిటైన్ చేసుకోకపోవడంతో అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని CSK యోచిస్తోందని TOI తెలిపింది. మరోవైపు ఓపెనర్ డెవాన్ కాన్వేను RTM ద్వారా సొంతం చేసుకోవాలని చెన్నై ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది.
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. నగరంలోని 69% కుటుంబాల్లోని ఎవరో ఒకరు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పొల్యూషన్ సర్వేలో తేలింది. కాలుష్య స్థాయులు పెరగడం వల్ల కళ్లలో మంట, శ్వాసలో ఇబ్బందులు వస్తున్నట్లు వెల్లడైంది. దీపావళి రోజు రాత్రి ఢిల్లీతో పాటు NCRలోని పలు ప్రాంతాల్లో AQI 999కి చేరుకుంది. అటు యమునా నదిలో సైతం కాలుష్యం వల్ల భారీ స్థాయిలో నురగలు ఏర్పడ్డాయి.
జాతీయ స్థాయిలో ఏఐసీటీఈ అందించే ప్రగతి స్కాలర్‌షిప్స్‌కు గడువును ఈ నెల 15 వరకు కేంద్రం పొడిగించింది. scholarships.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా ఫస్ట్ ఇయర్ బాలికలు దీనికి అర్హులు. సాంకేతిక విద్యను అభ్యసించడానికి ప్రతిభావంతులైన 5వేల మంది విద్యార్థినులకు ఏడాదికి రూ.50 వేల చొప్పున అందిస్తారు. విద్యార్థినులు తప్పనిసరిగా AICTE ఆమోదించిన కాలేజీలో చదువుతూ ఉండాలి.
సాధారణంగా నవంబర్ రాగానే చలి గాలులతో ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్‌లో సాధారణం కంటే 1.23 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. నవంబర్‌లోనూ ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపించడం లేదని పేర్కొంది. నవంబర్‌లో చలికి వాయవ్య భారతదేశం నుంచి వీచే గాలులే కారణం కాగా ఈసారి అక్కడ గాలులు వీచకపోవడంతో చలి ఎక్కువగా ఉండే అవకాశం లేదంది.
వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. 86/4 స్కోర్‌తో తొలి రోజు ఆట ముగించిన భారత్ ఇంకా 149 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో గిల్(31), పంత్(1) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ స్కోర్‌ను సమం చేసి, లీడ్ సాధించాలంటే భారీ భాగస్వామ్యం అవసరం.
AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో పూర్తిగా అన్‌రిజర్వుడు బోగీలు ఉంటాయి. నవంబర్ 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో వీటిని నడపనున్నారు. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరంలో హాల్టింగ్ ఉంటుంది.
AP: నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెంకటాచలం మండల టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కాకాణిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.
Sorry, no posts matched your criteria.