India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రం నుంచి అవసరమైన సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

<<15299236>>తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.<<>> ఆంధ్రప్రదేశ్‌లో ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానాలకు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ ఉపాధ్యాయ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ స్థానాలకు, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. TGలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనుండగా ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతాయి. ఎన్నికలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 11న నామినేషన్ల పరిశీలన, 13 తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు పూర్తి కానున్నాయి.

మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగి పలువురు మృతిచెందిన నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తారని, త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని కుంభమేళా DIG వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలోనే అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఘాట్‌ల వద్ద రాత్రంతా నిద్రపోవద్దని హెచ్చరించారు. ఈ మాటలు వినకపోవడం, రద్దీ ఊహించని విధంగా పెరగడంతో ఘటన జరిగినట్లు సమాచారం.

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీభూముల <<15298493>>ఆక్రమణల<<>> ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. CM చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్, SP, IFS అధికారి యశోదాను కమిటీలో సభ్యులుగా నియమించారు. జాయింట్ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అటు, పెద్దిరెడ్డి భూఆక్రమణలపై విచారణకు Dy.CM పవన్ ఆదేశించిన విషయం తెలిసిందే.

పని మనుషులు తప్పనిసరి శ్రామికవర్గమని సుప్రీంకోర్టు తెలిపింది. వారి హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్తంగా చట్టాలేమీ లేవంది. కొందరు యజమానులు, ఏజెన్సీలు వారిని దూషిస్తూ, దోపిడీ చేయడంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని పేర్కొంది. వారి రక్షణకు చట్టం చేసేలా సలహాల స్వీకరణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. 6 నెలల్లోగా వారు రిపోర్టు ఇవ్వాలని, దాని ఆధారంగా చట్టం చేయాలని సూచించింది.

గాజాకు కండోమ్స్ సరఫరా కోసం బైడెన్ యంత్రాంగం కేటాయించిన 50 మిలియన్ డాలర్లను ట్రంప్ నిలిపేశారని US అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం సమర్థంగా పనిచేసేందుకు ఉద్దేశించిన డోజ్ మంత్రిత్వ శాఖ ఆ నిధుల విషయాన్ని గుర్తించినట్లు శ్వేతసౌధ కార్యదర్శి కరోలిన్ పేర్కొన్నారు. గాజాలో హమాస్ ఉగ్రవాదులు కండోమ్‌లను బుడగల్లా చేసి వాటిలో ప్రమాదకర వాయువుల్ని నింపి ఇజ్రాయెల్‌వైపు వదులుతున్నారన్న ఆరోపణలున్నాయి.

తనపై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ <<15297213>>కేసు<<>> గెలిచిందన్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ‘సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూస్తుంటే జాలేస్తుంది. యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు. అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చాక నిజం అందరికీ తెలుస్తుంది’ అని ట్వీట్ చేశారు.

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగారు. తొలి ఓవర్‌లోనే 3 ఫోర్లు బాది లంక బౌలర్లకు హెచ్చరికలు పంపారు. ఎడాపెడా బౌండరీలు బాది 40 బంతుల్లోనే 57(10 ఫోర్లు, ఒక సిక్స్) రన్స్ చేసి ఔట్ అయ్యారు. దీంతో వన్డే, టీ20, టెస్ట్.. ఇలా ఫార్మాట్ ఏదైనా హెడ్ తగ్గడని క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అటు ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 145 రన్స్.

AP: మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలపై Dy.CM పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవులను ధ్వంసం చేసి భూములు ఆక్రమించారని పెద్దిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారించి నివేదిక సమర్పించాలని అధికారులకు పవన్ సూచించారు.
Sorry, no posts matched your criteria.