News June 6, 2024

‘క్లీంకార’ పుట్టిన వేళా విశేషం..!

image

మెగా ప్రిన్సెస్ కొణిదెల క్లీంకార జన్మించాక మెగాస్టార్ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. అమ్మవారి పేరుతో మెగా ఇంట అడుగుపెట్టిన క్లీంకార.. కుంభవృష్టిగా వరాలనిస్తోందని ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ స్టేజీపై తండ్రిని నిలబెట్టిందని, తాతయ్య చిరుకి పద్మ విభూషణ్ అవార్డును తెచ్చిపెట్టిందంటున్నారు. ఇప్పుడు చిన్న తాత పవన్‌ని మంత్రిని చేస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News June 6, 2024

అందరికీ థాంక్స్.. చిత్తశుద్ధితో అడుగు ముందుకేస్తా: పవన్

image

AP: ఎన్నికల్లో జనసేన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ Xలో ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు తమ అందరిపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని హామీ ఇచ్చారు.

News June 6, 2024

వరల్డ్ కప్‌లోనూ మ్యాక్స్‌వెల్‌ది అదే కథ!

image

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ టీ20 వరల్డ్ కప్‌లో విఫలమవుతున్నారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే క్యాచ్ ఔటై గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరారు. గత 10 టీ20ల్లో ఆయనకిది ఐదో డకౌట్ కావడం విశేషం. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా మ్యాక్సీ ఘోరంగా విఫలమయ్యారు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 52 పరుగులే చేశారు. ఇందులో నాలుగు డకౌట్లు కూడా ఉన్నాయి.

News June 6, 2024

మీరు సెక్యులర్ అనే నమ్ముతున్నా: ప్రకాశ్ రాజ్

image

ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు నటుడు ప్రకాశ్ రాజ్ అభినందనలు తెలిపారు. ‘మీతో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఎన్డీఏలో ఉన్నా మోదీలా కాకుండా సెక్యులర్ నాయకులగానే ఉంటారని నమ్ముతున్నా. జాతీయ రాజకీయాల్లో మీకొచ్చిన అవకాశంతో ఏపీకి న్యాయం జరిగేలా చూడాలి. అలాగే దేశంలో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

News June 6, 2024

రైతులను కంగనా ఏమన్నారంటే?

image

ఎంపీ కంగనా రనౌత్‌ను చెంప <<13392690>>దెబ్బ<<>> కొట్టిన ఘటనకు గతంలో రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. CAA బిల్లుతో పౌరసత్వం పోతుందని రక్తపాతం సృష్టించేందుకు టెర్రరిస్టులు రైతులుగా చెలామణి అవుతున్నారని గతంలో ఆమె ట్వీట్ చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించేది వారేనని ఆరోపించారు. ఆ తర్వాత తాను రైతులను టెర్రరిస్టులు అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

News June 6, 2024

ఓటమి భయంతోనే అధికారులపై ఆరోపణలు: తీన్మార్ మల్లన్న

image

TG: బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఓటమిని ఒప్పుకున్నట్లు తెలుస్తోందని కాంగ్రెస్ <<13392485>>ఎమ్మెల్సీ<<>> అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నేతలు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో మాదిరి గోల్‌మాల్ చేసి గెలవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు.

News June 6, 2024

ఎంపీకి నెల జీతం ఎంత?

image

ప్రతీ ఎంపీ నెలకు రూ.1 లక్ష జీతం పొందుతారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరైతే రోజుకు రూ.2 వేల చొప్పున అలవెన్స్ అందుతుంది. అలాగే రూ.70 వేల నియోజకవర్గ అలవెన్సు, మరో రూ.60 వేలు ఆఫీసు ఖర్చుల కింద నెలనెలా చెల్లిస్తారు. దీంతో ప్రతీ ఎంపీకి నెలకు రూ.2.30 లక్షల మేర లభిస్తుంది. ఢిల్లీలో ఉచిత వసతి కల్పిస్తారు. ఎంపీ, ఆయన భార్యకు ఏటా 34సార్లు ఉచిత విమాన ప్రయాణం, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఫ్రీ జర్నీ ఉంటుంది.

News June 6, 2024

అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణమేంటి?(2/2)

image

అయోధ్యలో ఓటమికి BJP చేసిన తప్పులు కూడా ఓ కారణం. టెంపుల్ సిటీ అభివృద్ధి కోసమని స్థలాలను తీసుకున్న ప్రభుత్వం నష్టపోయినవారికి పరిహారం ఇవ్వలేదు. రామ మందిర నిర్మాణం వల్ల వ్యాపారవేత్తలు, స్థానికేతరులే లాభపడ్డారని కోపంగా ఉన్న లోకల్స్ ఓటు రూపంలో నిరసన తెలిపారు. ఆ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని 5 అసెంబ్లీ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి. సిట్టింగ్ MP లల్లూ సింగ్‌పై వ్యతిరేకత, INC ఓటు బ్యాంకు కూడా SPకి కలిసొచ్చింది.

News June 6, 2024

అయోధ్యలో బీజేపీ ఓటమికి కారణమేంటి?(1/2)

image

రామమందిర నిర్మాణంతో అయోధ్య దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఆ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్‌ పార్లమెంట్ స్థానంలో బీజేపీ ఓటమి చర్చనీయాంశమైంది. ఇక్కడ తమ అభ్యర్థి <<13388012>>అవధేష్<<>> గెలుపు కోసం SP అధినేత అఖిలేశ్ యాదవ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. 22 శాతం OBC(యాదవులు, కుర్మీలు)లు, దళితులు(21%), ముస్లిం(18%)లను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండవనే అంశాన్ని బలంగా తీసుకెళ్లారు.

News June 6, 2024

గెలిచిన అభ్యర్థుల జాబితాతో EC గెజిట్ నోటిఫికేషన్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నియోజకవర్గం, విజయం సాధించిన అభ్యర్థి, పార్టీ వివరాలను అందులో పొందుపర్చింది. కాగా సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం తర్వాత నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.