News June 6, 2024

ఎన్నికల నుంచి 6 జీవిత పాఠాలు: IFS అధికారి

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచి ఆరు జీవిత పాఠాలు నేర్చుకోవచ్చని IFS అధికారి హిమాన్షు త్యాగీ ట్వీట్ చేశారు.
1.మీరు అత్యుత్తమంగా ఉన్నా నిరంతరం మెరుగుపరచుకోవాలి. 2.నియంత్రణలోని లేని అంశాలు ఉంటాయి. ఏం చేసినా కాలగమనాన్ని మార్చలేరు. 3.ఓడిపోయామని ప్రయత్నాన్ని వదలొద్దు. 4.కొన్ని సార్లు అకారణంగా, అనూహ్యంగా ఓటమి రావొచ్చు. 5.కఠిన సమయాల్లో ఇతరుల సాయంతో పోరాడాలి. 6.కాలానికి తగినట్లుగా మీ వ్యూహాలను మార్చుకోవాలి.

News June 6, 2024

షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారు: సుంకర పద్మశ్రీ

image

AP: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భ్రష్టు పట్టించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ ఆరోపించారు. ‘పార్టీ నుంచి వచ్చిన ఫండ్స్ దాచుకున్నారు. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. కార్యకర్తలను, నేతలను ఆమె గాలికొదిలేశారు. రాహుల్ గాంధీని చూసి ఆమెను ఏమనలేకపోయాం. కక్షపూరిత చర్యల కోసమే ఆమె రాష్ట్రానికి వచ్చినట్లు కనిపిస్తోంది’ అని మండిపడ్డారు.

News June 6, 2024

అప్పుడు ఆమంచి.. ఇప్పుడు కరణం

image

AP: చీరాలలో 2019లో జరిగిన సీన్ 2024లో రిపీట్ అయింది. ఇద్దరు నేతలు పార్టీ మారి ఓడిపోయారు. 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచిన ఆమంచి కృష్ణమోహన్ ఆ తర్వాత TDPలో చేరిపోయారు. 2019 నాటికి TDPపై తీవ్ర విమర్శలు చేస్తూ YCP గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో ఆమంచి ఓడిపోగా.. TDP నేత కరణం బలరాం గెలిచారు. ఆ తర్వాత తొలి నుంచి TDPకి అండగా ఉన్న బలరాం కూడా YCPకి మారారు. ఇప్పుడు ఆయన కుమారుడు వెంకటేశ్‌కూ చీరాలలో ఓటమి తప్పలేదు.

News June 6, 2024

ఛత్రపతి శివాజీ పట్టాభిషేకానికి 350 ఏళ్లు

image

ఛత్రపతిగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లేకి 1674 జూన్ 6న రాయగఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా మరాఠా సామ్రాజ్యానికి రాజుగా శివాజీ పట్టాభిషేకం జరిగింది ఈరోజేనంటూ ఆయన ఫాలోవర్స్ Xలో పోస్టులు పెడుతున్నారు. శివాజీ లౌకిక పాలకుడని, అన్ని మతాలకు అనుకూలంగా ఉండి, ప్రజలందరినీ సమానంగా చూసుకునేవారని గుర్తుచేసుకుంటున్నారు.

News June 6, 2024

ప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో విహరించొద్దు: చంద్రబాబు

image

AP: రాష్ట్ర ప్రయోజనాలే అందరి ప్రథమ కర్తవ్యం కావాలని కొత్తగా ఎన్నికైన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో విహరించొద్దని, పదవులు శాశ్వతమని ఎవరూ అనుకోవద్దని చెప్పారు. వైసీపీ ఎంపీలు గతంలో జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని ఆరోపించారు. టీడీపీ నేతలు ఈ విజయాన్ని సమాజసేవకు వినియోగించాలని స్పష్టం చేశారు.

News June 6, 2024

అకీరాను మోదీకి పరిచయం చేసిన పవన్

image

ఢిల్లీలో నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశానికి జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరైన విషయం తెలిసిందే. అనంతరం కుటుంబసమేతంగా నరేంద్ర మోదీని కలిశారు. భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరాను పవన్ ఆయనకు పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను జనసైనికులు నెట్టింట షేర్ చేస్తున్నారు.

News June 6, 2024

చంద్రబాబుకు CM రేవంత్ రెడ్డి ఫోన్

image

ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తుండటంపై అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల విభజన హామీలు, సమస్యలు పరిష్కరించుకుందామని CBNను కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. కాగా, ప్రమాణస్వీకారానికి చంద్రబాబు పిలిస్తే వెళ్తానని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

News June 6, 2024

పార్లమెంట్‌కి బాలయోగి తనయుడు

image

AP: అమలాపురం మాజీ MP, తొలి దళిత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ పార్లమెంట్ గడప తొక్కనున్నారు. అమలాపురం నుంచి ఆయన భారీ మెజార్టీతో నెగ్గారు. తన ప్రత్యర్థి రాపాక వరప్రసాద్‌(YCP)పై 3,42,196 ఓట్ల మెజార్టీ సాధించి విజయ దుందుభి మోగించారు. గత ఎన్నికల్లో ఆయన TDP తరఫున ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. బాలయోగి మరణానంతరం 2002లో జరిగిన ఉప ఎన్నికలో హరీశ్ తల్లి విజయకుమారి అమలాపురం MPగా గెలిచారు.

News June 6, 2024

TDP, JDU డిమాండ్ చేస్తున్న మంత్రిత్వ శాఖలివే: NDTV

image

NDA కూటమిలో భాగమైన టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నట్లు NDTV తెలిపింది. దాంతో పాటు స్పీకర్ పదవి, రెండు కేబినెట్ బెర్తులు అడుగుతోందని పేర్కొంది. అటు జేడీయూ రైల్వేతో పాటు వ్యవసాయశాఖను కోరుతోందట. ఇక హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల లాంటి కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీనే అట్టిపెట్టుకుంటుందని NDTV వివరించింది.

News June 6, 2024

నాలుగైదు రోజులపాటు ఆ షాక్ నుంచి తేరుకోలేదు: రోహిత్

image

వన్డే WC ఫైనల్లో ఓటమి తర్వాత నాలుగైదు రోజుల పాటు షాక్ నుంచి తేరుకోలేకపోయానని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ఫైనల్ జరిగిన తర్వాత రోజు నిద్ర లేచా. ఆ రాత్రి మనం ఓడిపోయినట్లు కల వచ్చింది. మరుసటి రోజు ఫైనల్ అనుకొని నిజంగా ఇలాగే జరుగుతుందా అని నా భార్య రితికాను అడిగా. కాసేపటికే తేరుకొని మనం ఓడిపోయామని గ్రహించా’ అని వెల్లడించారు.