India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి మొత్తంగా 55.28శాతం ఓట్లు సాధించగా, YCP 39.37శాతానికే పరిమితమైంది. విడివిడిగా చూస్తే టీడీపీకి 1,53,84,576(45.60%) ఓట్లు రాగా, YCPకి 1,32,84,134(39.37%), జనసేనకు 6.85శాతం ఓట్లు పోలయ్యాయి. YCP కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా రాగా.. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య 21,00,442 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8, YCP 11 స్థానాల్లో గెలిచాయి.
AP: ఐపీఎస్ అధికారులు బిందుమాధవ్, అమిత్ బర్దార్‌లపై సస్పెన్షన్‌ను ఎన్నికల సంఘం ఎత్తివేసింది. పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోవడంలో వీరు విఫలమయ్యారని వీరిపై ఈసీ వేటు వేసింది. మే 16న సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొంది.
ఈ ఎన్నికల్లో <<13383445>>జైలు<<>> నుంచి పోటీ చేసిన అమృత్‌పాల్ సింగ్, ఇంజినీర్ రషీద్ MPలుగా గెలిచారు. అయితే వారు జైలు నుంచి MPగా లోక్‌సభకు వెళ్లొచ్చా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. జైల్లో ఉన్నవారు సభకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అయినప్పటికీ వారు తాము సభకు హాజరుకాలేకపోతున్నామని స్పీకర్‌కు లేఖ పంపాలి. స్పీకర్ వారి అభ్యర్థనలను హౌస్ కమిటీకి పంపుతారు. ఆ తర్వాత కమిటీ చేసిన సిఫార్సుపై సభలో ఓటింగ్ ఉంటుంది.
AP: ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తన మావయ్య, టీడీపీ చీఫ్ చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ Xలో విషెస్ తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందించారు. ‘థాంక్యూ వెరీ మచ్ అమ్మ’ అంటూ జూ.ఎన్టీఆర్‌కు బదులిచ్చారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన రామ్‌చరణ్, మహేశ్ బాబు, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు.
AP: CBN కేబినెట్‌లో TDP నుంచి ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. అచ్చెన్నాయుడు, కూన రవి, కోండ్రు మురళి, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాస్, అయ్యన్న, పల్లా శ్రీనివాస్, యనమల, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పితాని, RRR, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల, సోమిరెడ్డి, ఆనం, పరిటాల సునీత, అఖిలప్రియ, గౌరు చరిత సహా పలువురు రేసులో ఉన్నారు.
AP: తాజా ఎన్నికల్లో శ్రీనివాస్ పేరుతో NDA కూటమిలో మొత్తం 13 మంది గెలిచారు. వీరిలో అసెంబ్లీకి 11 మంది, లోక్‌సభకు ఇద్దరు వెళ్లనున్నారు. టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి ముగ్గురు, BJP నుంచి ఒకరు MLAలుగా ఎన్నికయ్యారు. బీజేపీ, జనసేన నుంచి ఒకరు చొప్పున MPలుగా గెలిచారు. 13 మందిలో కొందరి పేర్లు శ్రీనివాస్ కాగా, మరికొందరి పేర్లు శ్రీనివాసరావుగా ఉండటం గమనార్హం.
AP EAPCET ఫలితాల విడుదలలో జాప్యం కొనసాగుతోంది. వైసీపీ ఓడిపోవడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పదవికి హేమచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఉన్నత విద్యాశాఖ ఈ రాజీనామాపై అభ్యంతరం చెప్పడంతో ఆయన మెడికల్ లీవ్ పెట్టారు. దీంతో వైస్ ఛైర్మన్ రామమోహన్ రావుకు ఇన్‌ఛార్జ్ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో EAPCET ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఏపీలోనూ త్వరగా విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
APలో TDP, JSP, BJP కూటమి ఘన విజయంపై ఎన్నో అనుమానాలున్నాయని ప్రకాశం(D) యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి పోలీస్ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపై అవిశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థులు గెలవబోతున్నట్లు వారు నడుచుకున్నారని విమర్శించారు. అటు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలు, టికెట్ ఇచ్చిన జగన్‌కు రుణపడి ఉంటానని చంద్రశేఖర్ అన్నారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఈరోజు మూడు మ్యాచ్‌లు క్రికెట్ ప్రియులను అలరించనున్నాయి. ఇప్పటికే పపువా న్యూగినియా, ఉగాండా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఉ.6గంటలకు ఆస్ట్రేలియా, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రా.9గంటలకు పాకిస్థాన్‌ను అమెరికా ఢీకొంటుంది. దీంతో పాటు రా.12.30గంటలకు నమీబియా, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.
వివిధ మిషన్లలో భాగంగా అంతరిక్షంలో వెయ్యి రోజులు గడిపిన తొలి వ్యోమగామిగా రష్యాకు చెందిన ఒలెగ్ కొనొనెంకో (59) నిలిచారు. 2008 నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన అనుభవం ఒలెగ్‌కు ఉంది. కాగా ప్రస్తుత మిషన్ 2023 సెప్టెంబరు 15న ప్రారంభం కాగా ఈ ఏడాది SEP 23 వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మంగళవారం ఆయన ఈ రికార్డ్ చేరుకున్నట్లు రష్యా స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.