India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శతాబ్ధం చివరినాటికి భూగర్భ జలాలు 2-3.5డిగ్రీల వరకు వేడెక్కుతాయని ఓ పరిశోధన తెలిపింది. దీనివల్ల నీటినాణ్యత, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. జర్మనీలోని కార్ల్స్‌రుహ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం భూగర్భ జలాలపై ఎలా ఉంటుందో వివరించింది.
ఈ నెల 9న కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొత్త మంత్రివర్గంతో ప్రమాణం చేయించనున్నారు. బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని పలు పార్టీల ఎంపీలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. తొలుత ఈ నెల 9నే ప్రమాణం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అటు ఈ నెల 9న ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది.
విరాట్ కోహ్లీ 2026 T20 WCలో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ‘విరాట్ ఫిట్‌నెస్ బాగుంది. అతనికి ఇదే లాస్ట్ ఛాన్స్ కాదు. 2026 WCలోనూ ఆడగలడు. ఆ టోర్నీ ఇండియాలో జరగనుంది. కాబట్టి స్వదేశంలో ఆడేందుకు ఏ ఆటగాడైనా ఆసక్తి చూపుతారు. కోహ్లీ ఖాతాలో ఇప్పటివరకు T20 WC లేదు. ఈసారి ఎలాగైనా గెలవాలని రోహిత్‌తో పాటు అతను కూడా కసిగా ఉన్నారు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్: రోహిత్ (C), కోహ్లీ, పంత్, సూర్య, శివమ్ దూబే, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బుమ్రా, అర్ష్‌దీప్.
ఐర్లాండ్: ఆండీ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (C), టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, మెక్‌కార్తీ, బెన్ వైట్, జోష్ లిటిల్.
ఎల్లుండి మరోసారి భేటీ కావాలని ఎన్డీయే కూటమి నేతలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కూటమిలోని అన్ని పార్టీల ఎంపీలు హాజరుకానున్నారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత ఈ మీటింగ్ ఉండనుంది. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎన్డీయే నేతలు ఎల్లుండి రాష్ట్రపతిని కోరనున్నారు. ఈ నెల 8 లేదా 9న ప్రధాని ప్రమాణస్వీకారం, 10 లేదా 11న చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉండే అవకాశం ఉంది.
AP: కూటమి ప్రభంజనంలోనూ కొందరిని దురదృష్టం వెంటాడింది. ఇంతటి వేవ్‌లోనూ వారు YCP అభ్యర్థులపై ఓటమి చవిచూశారు. వారిలో ఎరిక్షన్ బాబు (Y.పాలెం), గొట్టిపాటి లక్ష్మీ (దర్శి), బీటెక్ రవి (పులివెందుల), రామచంద్రారెడ్డి (పుంగనూరు), జయచంద్రారెడ్డి (తంబళ్లపల్లి), బాలసుబ్రమణ్యం (రాజంపేట), బొజ్జ రోషన్న (బద్వేలు), వీరభద్రగౌడ్ (ఆలూరు), రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), రాజారావు (అరకు), గిడ్డి ఈశ్వరి (పాడేరు ) ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లో కలిపి 64 సీట్లకు గాను రెండే గెలిచింది. TG(8), కర్ణాటక(9)లో మరిన్ని సీట్లు గెలిచే ఆస్కారమున్నా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేదు. ఒకవేళ ఈ 5 రాష్ట్రాల్లో మరిన్ని సీట్లు గెలిచుంటే ఆ పార్టీకి మొత్తం 120-130 సీట్లు వచ్చేవని, నాన్ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
జనసేనానికి హోం శాఖ వస్తుందని క్యాడర్ భావిస్తున్న వేళ పవన్ తన ఆసక్తిని వెల్లడించారు. తనకు పర్యావరణ కాలుష్య నివారణపై పని చేయాలని ఉందని ఇండియా టుడేతో చెప్పారు. అటు వ్యవసాయం, రైతులకు సహకరించే ఇరిగేషన్ వంటివి ఇంట్రస్ట్ అని వెల్లడించారు. మరి కేబినెట్ కూర్పులో సారథికి ఏ పదవి దక్కుతుందో. మీరు పిఠాపురం ఎమ్మెల్యేను ఏ మంత్రిగా చూడాలి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.
AP: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఓటర్లు విలక్షణ తీర్పునిస్తున్నారు. 1999 నుంచి 2024 వరకు ఆరు ఎన్నికలు జరగగా 6 పార్టీలను ఎన్నుకున్నారు. 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన పార్టీలను ఇక్కడ గెలిపించారు. తాజాగా ఇక్కడి నుంచి జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ 62,492 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు.
Sorry, no posts matched your criteria.