India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేమని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా కొందరు చేస్తున్న ప్రచారం అవాస్తవమని ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించింది. ‘దేశంలోని 18 పెద్ద రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర ఎకానమీపై సీఎం మాట్లాడారు. అంతేగానీ పథకాలు అమలు చేయలేమని ఆయన ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు’ అని ట్వీట్ చేసింది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. అంతకుముందు తనపై నమోదైన FIRను కొట్టేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వచ్చే నెల 5 వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది.

ENGతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న 3వ టీ20లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గాయం నుంచి కోలుకున్న షమీ రీఎంట్రీ ఇచ్చారు. ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ను అనూహ్యంగా పక్కనబెట్టి షమీకి చోటు కల్పించారు.
భారత జట్టు: శాంసన్, అభిషేక్ శర్మ, SKY(c), తిలక్ వర్మ, హార్దిక్, జురెల్, సుందర్, అక్షర్, రవి బిష్ణోయ్, షమీ, వరుణ్ చక్రవర్తి

AP: 2024 ఆగస్టు-సెప్టెంబర్‌లో వరదలకు దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో రూ.10వేల పరిహారం ఇవ్వగా, రూ.20,000కు పెంచుతూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు పక్కనపెట్టి ఉదారంగా పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

AP: ప్రముఖ ఆర్చర్ జ్యోతి సురేఖకు ఖేల్‌రత్న ఇవ్వాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధిక పాయింట్లు ఉన్నా తనను ఖేల్‌రత్నకు ఎంపిక చేయలేదని 2023లో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపి న్యాయస్థానం తీర్పు ఇస్తూ ఇవాళ ఉత్తర్వుల కాపీ విడుదల చేసింది. ఎన్నో అవార్డులు పొందినా తనకు ఖేల్‌రత్న ఇవ్వకపోవడంపై ఆమె కోర్టును ఆశ్రయించారు.

భారత స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపికయ్యారు. సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డును బుమ్రా గెలుచుకున్నట్లు ICC పేర్కొంది. ఈ అవార్డుకు ఎంపికైన ఐదో భారత ప్లేయర్‌గా ఆయన నిలిచారు. అంతకుముందు ద్రవిడ్, సచిన్, అశ్విన్, కోహ్లీ ఉన్నారు. బుమ్రా గతేడాది టీ20 WCలో 15 వికెట్లు, టెస్టుల్లో 71 వికెట్లు తీశారు. ప్రస్తుతం టెస్టుల్లో నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.

మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌పై టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ‘గవాస్కర్ చేసిన విమర్శలు తనపై ఒత్తిడి పెంచాయని రోహిత్ బోర్డు పెద్దల వద్ద అన్నారు. ఆ స్థాయిలో తనపై విరుచుకుపడాల్సిన అవసరంలేదని రోహిత్ భావించారు’ అని క్రిక్‌బ్లాగర్ పేర్కొంది. రోహిత్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని గవాస్కర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

TG: మీర్‌పేట్ హత్య కేసులో రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. ఆర్మీలో పనిచేసిన గురుమూర్తి స్వతహాగానే క్రూరుడని పేర్కొన్నారు. పిల్లలు అమ్మ ఏదని అడిగితే గొడవపడి ఎక్కడికో వెళ్లిందని చెప్పినట్లు తెలిపారు. ఎక్కడా ఆధారాలు దొరకకుండా ప్లాన్ చేశాడని, సిబ్బంది కష్టపడి సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 1న అక్కడి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

TG: దావోస్ పెట్టుబడులపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పెట్టుబడులు స్వాగతించకపోయినా అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. తాము వెళ్లింది పెట్టుబడుల కోసమేనని పేర్కొన్నారు. ఒప్పందాలకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అసూయ ఎందుకని ప్రశ్నించారు. తాము విఫలమైతే కొందరు పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.