India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హుస్సేన్ సాగర్‌లో ఇటీవల బోటులో జరిగిన <<15275981>>అగ్నిప్రమాద ఘటనలో<<>> ఓ వ్యక్తి మరణించాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన గణపతి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. గల్లంతైన అజయ్ అనే యువకుడి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ‘భారతమాతకు మహా హారతి’ కార్యక్రమంలో బాణసంచా కారణంగా అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

బడికెళ్లి చదువుకోవాల్సిన బాలిక లారీ చక్రాల కింద నలిగిపోయింది. శరీరం రెండు ముక్కలవడంతో ప్రాణాలు విడిచింది. ఈ ఘటన HYDలోని ఫిల్మ్ నగర్ షేక్‌పేటలో జరిగింది. 5th చదువుతున్న అథర్వినిని ఆమె తండ్రి బైక్‌పై స్కూలుకు తీసుకెళ్తున్నాడు. టేక్ ఓవర్ చేసే ప్రయత్నంలో ఓ లారీ వారి బైకును ఢీకొట్టింది. బాలిక లారీ కింద పడటంతో తీవ్ర గాయాలై మృతిచెందింది. పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

భారత్-USA మధ్య ఉన్న బంధానికి తానో ప్రొడక్ట్‌నని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా సీటెల్‌లో భారత కాన్సులేట్ జనరల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘భారత, అమెరికా మధ్య ఉన్న బంధం మరింత పెరగడం చాలా సంతోషాన్నిస్తోంది. ఇరు దేశాల విలువలు రాజ్యాంగపరమైన ప్రజాస్వామిక వ్యవస్థల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అవే ఈ బంధాన్ని బలపరుస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

AP: ఈ ఏడాది వేసవి కాలం అత్యంత వేడిగా ఉంటుందనే వాతావరణ శాఖ అంచనాల మేరకు విద్యుత్ వినియోగం కూడా తీవ్రస్థాయిలో ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరెంట్ ఉత్పత్తిని పెంచాలని జెన్‌కోను ఆదేశించింది. ఈసారి పీక్ డిమాండ్ 13,700 మిలియన్ యూనిట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఈ నేపథ్యంలో దానికి తగ్గట్టుగా విద్యుదుత్పత్తి కోసం ముందే సన్నద్ధమవ్వాలని విద్యుత్ శాఖకు ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్‌లో రేపు వందో ప్రయోగం చేపట్టనుంది. ఉ.6.23 గంటలకు GSLV-F15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. 2,250KGల బరువున్న ఈ శాటిలైట్‌ను 36,000KM దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఇది దేశ నావిగేషన్ సిస్టం కోసం పనిచేయనుంది. ప్రయోగాన్ని ఇస్రో యూట్యూబ్ ఛానల్‌లో ఉ.5.50 నుంచి ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.

సెపక్ తక్రా U-14 జాతీయ టోర్నీలో బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ విజేతగా నిలిచింది. విజయవాడలో జరిగిన ఫైనల్‌లో మణిపుర్‌పై గెలిచింది. బాలుర విభాగంలో మణిపుర్ విన్నర్‌గా నిలిచింది. ఈ ఆటను కిక్ వాలీబాల్/ఫుట్ వాలీబాల్ అని కూడా పిలుస్తారు. బ్యాడ్మింటన్ తరహా కోర్టులో దీనిని ఆడతారు. బాల్‌ను కిక్ చేసేందుకు పాదాలు, మోకాళ్లు, భుజాలు, ఛాతీ, తలను ఉపయోగిస్తారు. ఒక్కో జట్టులో ఇద్దరు లేదా నలుగురు ప్లేయర్లుంటారు.

TG: మీర్‌పేట్‌లో భార్యను ముక్కలుగా నరికిన గురుమూర్తి గురించి అతడి సహోద్యోగులు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. నిందితుడు పనిచేసే డీఆర్‌డీఓలో పోలీసులు విచారించారు. ‘గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడు. ఎవరైనా సాయం అడిగితే కాదనడు. ఆయనది మెతక వైఖరి. ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు ఇష్టపడడు. కాఫీ, భోజనానికి కూడా స్టీల్ పాత్రలు ఉపయోగించేవాడు. ఇరుగుపొరుగుతో ఎక్కువగా మాట్లాడడు’ అని సహోద్యోగులు తెలిపారు.

స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,894 (+67), సెన్సెక్స్ 75,696 (+329) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ షేర్లకు డిమాండ్ ఉంది. ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. INFY, శ్రీరామ్ ఫిన్, యాక్సిస్ BANK, ICICI BANK, HDFC BANK టాప్ గెయినర్స్. సన్ ఫార్మా, NTPC, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా టాప్ లూజర్స్.

మహా కుంభమేళా జరుగుతున్న వేళ ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’పై మళ్లీ చర్చ మొదలైంది. నిన్న ప్రయాగ్‌రాజ్‌లో నాగ, వివిధ అఖాడాల సాధువులతో HM అమిత్‌షా సుదీర్ఘంగా చర్చించారు. వారు సనాతన్ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిసింది. అలాగే ఆలయాలు, దేవుడి మాన్యాలు, ఆస్తులను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని కోరారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం ఇదే డిమాండ్ చేశారు. మరి కేంద్రం ఈ మొర ఆలకించేనా? మీ కామెంట్.

తెలంగాణలో వచ్చే వారం రోజులపాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉదయం పొగమంచు తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు, రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తీవ్రత తగ్గిందని వివరించింది. అటు ఏపీలో మన్యం సహా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది.
Sorry, no posts matched your criteria.