News April 24, 2024

130 సార్లు బటన్ నొక్కాం: జగన్

image

AP: 58 నెలల తన పరిపాలనలో 130 సార్లు బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల నగదు జమ చేశామని CM జగన్ తెలిపారు. విజయనగరం(D) చెల్లూరు సభలో మాట్లాడిన ఆయన.. ‘జగన్ ఒక్కడే ఒకవైపు. తోడేళ్లన్నీ మరోవైపు. మోసాల బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలి. ప్రజల డ్రీమ్స్‌ను నా స్కీమ్స్‌గా అమలు చేస్తున్నా. పేదలను దోచుకునేందుకు, వాళ్ల రక్తం తాగేందుకు చంద్రముఖి ముఠా మళ్లీ వస్తోంది’ అని విమర్శించారు.

News April 24, 2024

APని జగన్ ముంచేశారు: చంద్రబాబు

image

APలో ఎక్కడ చూసినా విధ్వంసమే కనిపిస్తోందని TDP అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పాతపట్నంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘ప్రజలకు సేవ చేసేందుకు జగన్‌కు అధికారం ఇస్తే.. అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని ముంచేశారు. YCP పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి భూములు కొల్లగొట్టేందుకు కుట్ర చేస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం నష్టపోయింది. ప్రజలూ నష్టపోయారు’ అని ఆరోపించారు.

News April 24, 2024

ఒత్తిడి వలన గర్భస్థ శిశువు ముఖంలో మార్పు

image

గర్భంపై పడే ఒత్తిడి కూడా శిశువు రూపురేఖల్ని నిర్ణయిస్తుందని లండన్‌లోని యూసీఎల్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఆ వివరాలను ‘నేచర్ సెల్ బయాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు. దాని ప్రకారం.. చిట్టెలుక, కప్పల అండాలపై వారు పరిశోధనలు చేశారు. గర్భసంచిలో ఒత్తిడి ఉంటే అతి సున్నితంగా ఉండే గర్భస్థ శిశువు రూపురేఖలు మారిపోతాయి. ఒత్తిడి మరీ ఎక్కువైతే వైకల్యం కూడా రావొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

News April 24, 2024

రౌడీ బాయ్‌తో ప్రశాంత్ నీల్ మూవీ?

image

దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజీ హీరోతో సినిమాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లిన ప్రశాంత్ నీల్ ఆయన మేనేజర్‌తో సమావేశమయ్యారు. దీంతో రౌడీ బాయ్‌తో నీల్ సినిమా తీస్తారని చర్చ నడుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా అర్జున్ రెడ్డిని మించి ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 24, 2024

మాపై బలవంతంగా భారత రాజ్యాంగాన్ని రుద్దుతున్నారు: కాంగ్రెస్ నేత

image

కాంగ్రెస్ సౌత్ గోవా MP అభ్యర్థి కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘1961లో పోర్చుగీస్ నుంచి స్వతంత్రం రాగానే GOA ప్రజలపై బలవంతంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసి డ్యుయల్ సిటిజన్‌షిప్‌ను చిక్కుల్లో పెట్టారు. ఈ విషయాన్ని రాహుల్‌తో చెప్తే రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లను పరిగణించమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక గోవాకు ఫ్రీడం వచ్చినందున ఇది మాకు వర్తించదన్నాను’ అని తెలిపారు.

News April 24, 2024

రుణమాఫీపై బ్యాంకు అధికారులకు సీఎం కీలక విజ్ఞప్తి

image

TG: రుణాలు చెల్లించాలని రైతుల వెంట పడుతున్న బ్యాంకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 15లోగా వడ్డీతో రుణాలను తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది పెట్టొద్దని కోరారు. రుణాల చెల్లింపు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.

News April 24, 2024

పవన్ కళ్యాణ్ ఆస్తులు రూ.163 కోట్లు

image

AP: తన కుటుంబానికి రూ.163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అందులో రూ.46 కోట్లు చరాస్తులు కాగా రూ.118 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఇక అతడి వద్ద రూ.14 కోట్ల విలువైన కార్లు, బైక్‌లు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. పవన్‌కు రూ.65 కోట్ల అప్పులు ఉన్నాయి. వదిన సురేఖ నుంచి రూ.2 కోట్లు అప్పు తీసుకున్నారు. పదవ తరగతి వరకు చదివారు. ఆయనపై 8 క్రిమినల్ కేసులున్నాయి.

News April 24, 2024

నామినేషన్ వేసిన పరిపూర్ణానంద

image

AP: హిందూపురం నుంచి ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి టీడీపీ నుంచి బరిలో దిగనున్నారు.

News April 24, 2024

చాహల్‌ను అందుకే రిటైన్ చేసుకోలేదు: మైక్

image

IPL-2022 సీజన్‌లో ముగ్గురినే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో యుజ్వేంద్ర చాహల్‌ను రిటైన్ చేసుకోలేకపోయామని RCB మాజీ డైరెక్టర్ మైక్ హసన్ తెలిపారు. ‘వేలంలో చాహల్ పేరు ఆలస్యంగా రావడంతో అక్కడ కూడా ఆయనను దక్కించుకోలేకపోయాం. ఆయన వేలంలోకి రాకముందే హసరంగను తీసుకున్నాం. చాహల్‌తోపాటు హర్షల్‌ను కూడా దక్కించుకోలేకపోయాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా IPLలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ చరిత్ర సృష్టించారు.

News April 24, 2024

నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: మంత్రి కోమటిరెడ్డి

image

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 13-14 MP సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కేసీఆర్ వల్లే నల్గొండలో కరవు వచ్చిందని దుయ్యబట్టారు. బస్సు యాత్ర చేయడానికి బీఆర్ఎస్ చీఫ్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.