News June 4, 2024

ఈ రాష్ట్రాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్!

image

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్(29), ఢిల్లీ(7), ఉత్తరాఖండ్(5), హిమాచల్ ప్రదేశ్(4), అరుణాచల్ ప్రదేశ్(2), త్రిపుర(2), అండమాన్ నికోబార్(1)లో ఇప్పటికే కొన్ని స్థానాలు గెలుచుకుంది. మిగతా స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతూ క్లీన్‌స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.

News June 4, 2024

నెల్లూరులో గెలిచింది వీరే!

image

AP: నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 10 స్థానాలను ఆ పార్టీనే కైవసం చేసుకుంది. ఆత్మకూరు- ఆనం రామనారాయణరెడ్డి, గూడూరు- పాశం సునీల్, కావలి-కావ్య కృష్ణారెడ్డి, కోవూరు-వేమిరెడ్డి ప్రశాంతి, నెల్లూరు రూరల్-కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు సిటీ-నారాయణ, సర్వేపల్లి-సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సూళ్లూరుపేట-నెలవల విజయశ్రీ, ఉదయగిరి-కాకర్ల సురేశ్, వెంకటగిరి-కురుగొండ్ల రామకృష్ణ.

News June 4, 2024

అక్కడా.. ఇక్కడా 8 సీట్లే

image

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రఫ్ఫాడించింది. తెలంగాణలో ఇప్పటికే 8 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన బీజేపీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 8 అసెంబ్లీ స్థానాల్లో జెండా పాతింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి NO. 8 బాగా కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో ఈ పార్టీ 4 స్థానాల్లోనే గెలిచింది.

News June 4, 2024

పొత్తుల చుట్టూనే రాజకీయాలు

image

లోక్‌సభ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో పొత్తుల వైపు దృష్టి సారించాయి. ఇప్పటికే తమతో పొత్తు ఉన్న పార్టీలను కాపాడుకోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీలను ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టాయి. ఓ వైపు ఇండియా కూటమి BJD, జేడీ(యూ), టీడీపీతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ NDAలోని పార్టీలతో ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు చేసి పదవులు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.

News June 4, 2024

కర్ణాటకలో బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం

image

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇప్పటివరకు బీజేపీ 16, కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించాయి. జేడీ(ఎస్) 2 చోట్ల గెలుపొందింది. బీజేపీ, కాంగ్రెస్ చెరో స్థానంలో లీడింగ్‌లో ఉన్నాయి. అటు తమిళనాడులో కాంగ్రెస్ ఒక చోట గెలిచి, 8 స్థానాల్లో ముందంజలో ఉంది. సీపీఎం ఒక చోట గెలిచి, మరో స్థానంలో లీడింగ్‌లో కొనసాగుతోంది. డీఎంకే 22, VCK 2, సీపీఐ 2 చోట్ల గెలవగా, MDMK, IUML తలో చోట ఆధిక్యంలో ఉన్నాయి.

News June 4, 2024

CM పదవికి రాజీనామా చేసిన జగన్

image

AP: వైఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. విజయవాడ రాజ్‌భవన్‌లోని గవర్నర్ నజీర్‌కు రాజీనామా లేఖను పంపారు. కాగా 175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. ఇప్పటివరకు 9 సీట్లలోనే విజయం సాధించింది.

News June 4, 2024

జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు: పవన్

image

AP: ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.

News June 4, 2024

ప్ర‌ధాని అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ!

image

కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు పెర‌గ‌డం వెన‌క పార్టీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కృషి ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. భార‌త్ జోడో యాత్ర‌, న్యాయ యాత్ర ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బ‌ల‌ప‌ర‌చ‌డంలో రాహుల్ స‌క్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు ఇండియా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌పోయినా వచ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీ త‌ర‌ఫున‌ రాహుల్ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా బ‌రిలో నిలుస్తార‌ని అభిప్రాయపడుతున్నారు.

News June 4, 2024

కాంగ్రెస్ నేతల విక్టరీ పోజు

image

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేసి అధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేతలు హర్షం వ్యక్తం చేశారు. ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ విక్టరీ సింబల్ చూపిస్తూ ఫొటోకు పోజిచ్చారు. కాగా ప్రస్తుతం ఎన్డీఏ 293, ఇండియా కూటమి 232 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు కలిసొస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News June 4, 2024

కంగ్రాట్స్ చంద్రబాబు: కమల్ హాసన్

image

నాలుగోసారి ముఖ్యమంత్రి కాబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ అభినందనలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. మీ నాయకత్వం, దార్శనికత చాలా కాలంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు స్ఫూర్తిదాయకం. భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు మీపై ఆధారపడి ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు.