News April 20, 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి

image

సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో విషాదం చోటు చేసుకుంది. మొరాదాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కున్వార్ సర్వేశ్ కుమార్ మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితమే కన్నుమూసినట్లు యూపీ బీజేపీ చీఫ్ భూపేంద్ర చౌధరి తెలిపారు.

News April 20, 2024

ఎక్స్‌పైరీ చాక్లెట్లు తిని రక్తం కక్కుకున్న చిన్నారి

image

ఇటీవల పంజాబ్‌లోని పటియాలలో బర్త్‌డే కేక్ తిని బాలిక మరణించిన ఘటన మరవకముందే మరో ఘటన వెలుగుచూసింది. లుధియానాకు చెందిన ఏడాదిన్నర చిన్నారికి పటియాలాలోని బంధువులు చాక్లెట్లతో కూడిన గిఫ్ట్ బాక్స్ ఇచ్చారు. తిరిగి ఇంటికి వచ్చాక బాలిక వాటిని తిన్నది. కాసేపటికే ఆమె బ్లడ్ వామిటింగ్ చేసుకోవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గడువు తీరిన చాక్లెట్లు తినడం వల్లే ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.

News April 20, 2024

‘కల్కి’ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి అమితాబ్ బచ్చన్ లుక్ రివీల్ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే పోస్టర్‌లో రేపు రాత్రి 7.15 గంటలకు బిగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News April 20, 2024

హెడ్ వీరవిహారం.. 32 బంతుల్లో 89 రన్స్

image

ఢిల్లీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ విజృంభించి ఆడారు. 32 బంతుల్లో 89 రన్స్‌తో వీరవిహారం చేసి ఔటయ్యారు. అతడి ఇన్నింగ్సులో 6 సిక్సులు, 11 ఫోర్లున్నాయి. హెడ్‌ విధ్వంసం ముందు ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. కాగా ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో హెడ్ 39 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. మరోవైపు ధాటిగా ఆడిన హెడ్, అభిషేక్‌ను కుల్దీప్ వెనక్కి పంపారు. 10 ఓవర్లకు SRH స్కోర్ 158/4.

News April 20, 2024

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరం లేదు: జైలు అధికారులు

image

కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అవసరమని డాక్టర్లు సూచించలేదని తిహార్ జైలు అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్య స్థితిపై LGకి రిపోర్ట్ అందించారు. అరెస్ట్ సమయంలో ఆయన కేవలం మెట్‌ఫార్మిన్ టాబ్లెట్ మాత్రమే తీసుకుంటున్నారని వెల్లడించారు. డాక్టర్ సూచనతో కొన్ని నెలల క్రితం తాను ఇన్సులిన్ తీసుకోవడం మానేసినట్లు జైల్లో వైద్యులతో ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా లేవన్నారు.

News April 20, 2024

ప్చ్.. జస్ట్ మిస్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ 12 బంతుల్లోనే 46 రన్స్ చేసి ఔటయ్యారు. 6 సిక్సులు, 2 ఫోర్లతో చెలరేగారు. అతను అవుట్ అయిన బంతికి ఫోర్ వెళ్లి ఉంటే ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ అయ్యుండేది. కానీ త్రుటిలో అతను ఆ అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ 50 రికార్డు RR ప్లేయర్ జైస్వాల్ (13 బంతులు) పేరిట ఉంది.

News April 20, 2024

విధ్వంసం.. ఒకే ఓవర్‌లో 4,4,4,4,0,6

image

ఢిల్లీతో మ్యాచ్‌లో SRH ఓపెనర్లు బీభత్సం సృష్టించారు. ముకేశ్ కుమార్ వేసిన 6వ ఓవర్‌లో హెడ్ వరుసగా 4,4,4,4,0,6 రన్స్ చేసి.. ఆ ఓవర్‌లో ఏకంగా 22 రన్స్ రాబట్టారు. SRH ఓపెనర్ల ఊచకోతకు ఢిల్లీ ప్లేయర్లకు నేలచూపులు తప్ప ఇంకేం మిగల్లేదు. ప్రస్తుతం SRH స్కోరు 6 ఓవర్లకు 125/0గా ఉంది. హెడ్(84*), అభిషేక్ శర్మ(40*) క్రీజులో ఉన్నారు.

News April 20, 2024

BREAKING: చరిత్ర సృష్టించిన SRH

image

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీ20లో చరిత్ర సృష్టించింది. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా నిలిచింది. 6 ఓవర్లలో ఏకంగా 125 రన్స్ చేసింది. ఢిల్లీతో మ్యాచులో హైదరాబాద్ ఓపెనర్లు హెడ్(84*), అభిషేక్(40*) ఈ ఘనత సాధించారు. గతంలో ఈ రికార్డు KKR పేరిట ఉంది. 2017లో ఆ టీమ్ RCBపై 105 రన్స్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డును SRH బద్దలుకొట్టింది.

News April 20, 2024

కడప ఎంపీ అభ్యర్థిగా వివేకా హత్య కేసు నిందితుడు నామినేషన్

image

AP: కడప లోక్‌సభలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. కడప లోక్‌సభ స్థానానికి ఇండిపెండెంట్‌‌గా నామినేషన్ దాఖలు చేశారు. శివశంకర్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాగా ఇదే కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి జైభీమ్ పార్టీ తరఫున పులివెందుల బరిలో నిలిచారు.

News April 20, 2024

ఎన్నికల అఫిడవిట్‌‌: నేతల ఆస్తులు ఎంతంటే!

image

AP: నెల్లూరు MP అభ్యర్థి వేమిరెడ్డి, ఆయన భార్య కోవూరు TDP అభ్యర్థి ప్రశాంతిల ఆస్తులు రూ.715 కోట్లు
➥ పారిశ్రామిక వేత్త, ఒంగోలు TDP MP అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి చరాస్తులు రూ.4,58,40,319, స్థిరాస్తులు రూ.1.09 కోట్లు. చేతిలో ఉన్న నగదు రూ.18529.. భార్య పేరుతో చరాస్తులు రూ.17,96,70,139, స్థిరాస్తులు రూ.30,04,44,600.
➥కావలి TDP అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి ఆస్తి రూ.153.27 కోట్లు. కారు లేదు.