India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. శవాన్ని ఎలా ముక్కలు చేసి, మాయం చేయాలి? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి OTTలోని ఓ క్రైమ్ వెబ్‌సిరీస్‌లో చూసినట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్ వీడియోస్ చూశాడట. సెన్సార్ కట్‌లు లేకుండా OTTలో ఏదైనా చూపించడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మీరేమంటారు?

దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డా. నాగేశ్వర్‌రెడ్డి నిలిచారు. 2002లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ ప్రకటించింది. వైజాగ్‌లో జన్మించిన ఆయన కర్నూలులో MBBS, మద్రాస్‌లో MD, చండీగఢ్‌లో DM పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదిగి HYDలో AIG ఆస్పత్రిని స్థాపించారు. రూ.కోట్ల జీతం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలను అందిస్తున్నారు.

AP: బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు కేంద్రం ‘పద్మశ్రీ’ పురస్కారం ప్రకటించింది. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించారు. నిన్న ఆయన పెద్ద కర్మ జరుగుతుండగానే అవార్డు ప్రకటన వచ్చింది. కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన అప్పారావు చిన్నప్పటి నుంచే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. సింగపూర్, కువైట్‌లో కూడా ఆయన గాత్రం వినిపించారు. అప్పారావు దాదాపు 5వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చారు.

పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికవడం గౌరవంగా భావిస్తున్నట్లు తమిళ హీరో అజిత్ తెలిపారు. రాష్ట్రపతి, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ రోజు నా తండ్రి జీవించే ఉంటే బాగుండేది. ఆయన నన్ను చూసి గర్వపడేవారు. నా తల్లి ప్రేమకు, త్యాగాలకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. నాకు ఈ గుర్తింపు కేవలం వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదని, అనేక మంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నా’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మలయాళ డైరెక్టర్ షఫీ(56) కన్నుమూశారు. ఈనెల 16న గుండెపోటుకు గురైన ఆయన కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మరణించారు. కామెడీ చిత్రాలతో పాపులర్ అయిన షఫీ సుమారు 50కి పైగా సినిమాలను డైరెక్ట్ చేశారు. ‘వన్ మ్యాన్ షో’ ఆయన తొలిచిత్రం. కళ్యాణరామన్, పులివల్ కళ్యాణం, తొమ్మనమ్ మక్కలుమ్, టూ కంట్రీస్, చిల్డ్రన్ పార్క్, షెర్‌లాక్ టోమ్స్ తదితర మూవీలు తీశారు. 2022లో వచ్చిన ఆనందం పరమానందం షఫీ చివరి మూవీ.

1965లో ఉమ్మడి వరంగల్(D) న్యూశాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలోనే కులవివక్షపై పోరాడారు. కొంతకాలం పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. తర్వాత బయటికొచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. SC వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈక్రమంలోనే నిన్న ఆయనకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(UPS)ను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్‌కు ముందు 12 నెలల్లో పొందిన బేసిక్ పే సగటులో 50 శాతాన్ని పింఛనుగా పొందేందుకు ఇది వీలు కల్పిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) కింద ఉంటూ, కనీసం 25 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని UPSను ఎంచుకున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది.

లెఫ్టినెంట్ జనరల్ సాధన S.నాయర్, స్క్వాడ్రన్ లీడర్ తరుణ్ నాయర్ రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు. ఒకే ఏడాది తల్లీ కొడుకులు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. సాధనను అతి విశిష్ట్ సేవా మెడల్, తరుణ్‌ను వాయు సేన మెడల్(గ్యాలంట్రీ) అవార్డు వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 93 మంది సైనికులకు పురస్కారాలను ప్రకటించారు.

టూత్ బ్రష్‌కు కూడా లైఫ్ టైమ్ ఉంటుందని, అంతకుమించి వాడితే ఆరోగ్యానికి హానికరమని దంతవైద్యులు చెబుతున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్రష్ మార్చాలి. రోజుకు 2 నిమిషాలపాటు పళ్లు తోముకోవాలి. ఫ్యామిలీ మొత్తం బ్రష్‌లు ఒకే చోట ఉంచినప్పుడు వాటి హెడ్స్ తగలకుండా ఉంచాలి. లేదంటే బ్యాక్టీరియా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్, పంటి చికిత్స తర్వాత బ్రష్‌లు మార్చాలి.

హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజా 60 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. నగరాన్ని పునర్నిర్మించాలంటే కొన్ని బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది. ప్రతి మూడు భవనాలకు రెండు బిల్డింగులు ధ్వంసమయ్యాయని, 42 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు 21 ఏళ్లు పడుతుందని లెక్కగట్టింది. ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపింది. 20 లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారని వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.