News January 26, 2025

విదేశీయులకు పద్మాలు.. అమెరికాకే అత్యధికం

image

కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకీ(వ్యాపారం-జపాన్)కి పద్మవిభూషణ్, వినోద్ ధామ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్-USA)కు పద్మభూషణ్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి ఒక్కరి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా USA నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి.

News January 25, 2025

‘పద్మ’ అవార్డులు ఈ రాష్ట్రానికే అత్యధికం

image

కేంద్రంలో ప్రకటించిన 139 ‘పద్మ’ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.

News January 25, 2025

PHOTO: రిహార్సల్స్ మొదలుపెట్టిన మహేశ్ బాబు

image

రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైందని నిన్న జక్కన్న హింట్ ఇచ్చారు. తాజాగా మహేశ్ ఫొటో వైరలవుతోంది. ఆయన స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైనర్‌తో పాటు ఉన్న ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిహార్సల్స్ మొదలయ్యాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

News January 25, 2025

RCBకి పెద్ద దెబ్బ.. స్టార్ ఆల్ రౌండర్ దూరం

image

WPL-2025కి RCB ఆల్ రౌండర్ సోఫీ డివైన్ దూరమయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ప్రొఫెషనల్ అడ్వైజ్ మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు NZ పేర్కొంది. WPLలో RCB తరఫున 18 మ్యాచులాడిన సోఫీ 402 రన్స్, 9 వికెట్లు తీశారు. టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు(99*) ఆమె పేరిటే ఉంది. ఓపెనర్‌గా మెరుపులు మెరిపించే ఈ ప్లేయర్ లేకపోవడం RCB పెద్ద లోటే.

News January 25, 2025

పద్మవిభూషణులు వీరే

image

1. దువ్వూరు నాగేశ్వర రెడ్డి(వైద్యం)- తెలంగాణ
2. జగదీశ్ సింగ్ ఖేహర్ (ప్రజా వ్యవహారాలు)- చండీగఢ్
3. కుముదిని రజనీకాంత్ లఖియా (కళలు)- గుజరాత్
4. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం (కళలు)- కర్ణాటక
5. ఎం.టీ. వాసుదేవన్ నాయర్ (లేటు) (సాహిత్యం) – కేరళ
6. ఒసాము సుజుకీ (లేటు) (వాణిజ్యం) – జపాన్
7. శారదా సిన్హా (లేటు) (కళలు)- బిహార్

News January 25, 2025

బాలకృష్ణకు సీఎం చంద్రబాబు అభినందనలు

image

AP: పద్మభూషణ్ పురస్కారం పొందిన నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు అభినందించారు. లెజండరీ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెడుతూ సినిమా, రాజకీయాలు, సేవా రంగాల్లో రాణిస్తున్నారని కితాబిచ్చారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా అంకితభావంతో చేసిన సేవ వేల మంది జీవితాలను తాకిందని, లక్షలాది మందికి స్ఫూర్తిని ఇచ్చిందని మెచ్చుకున్నారు. ఇది నిజమైన ఐకాన్, దయగల నాయకుడికి తగిన గౌరవం అని సీఎం పేర్కొన్నారు.

News January 25, 2025

బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు

image

నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. ‘పద్మ భూషణ్ పురస్కారం లభించినందుకు కంగ్రాట్స్ బాలా బాబాయ్. సినీ పరిశ్రమకు, ప్రజా సేవకు మీరు చేసిన అసమానమైన సేవలకు నిదర్శనంగా ఈ గుర్తింపు దక్కింది’ అని తారక్ కొనియాడారు.

News January 25, 2025

శ్రీజేశ్‌కు పద్మభూషణ్.. అశ్విన్‌కు పద్మశ్రీ

image

క్రీడా విభాగంలో పలువురు ప్లేయర్లకు పద్మ అవార్డులు వరించాయి. హాకీ మాజీ గోల్ కీపర్ శ్రీజేశ్‌కు కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్పిన్నర్ అశ్విన్‌కు, హర్వీందర్ సింగ్(పారా అథ్లెట్-హరియాణా), మణి విజయన్(ఫుట్ బాల్-కేరళ), సత్యపాల్ సింగ్(కోచ్- యూపీ) పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

News January 25, 2025

గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన రాష్ట్రపతి

image

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సాయుధ బలగాల్లో 93 మందికి గ్యాలంటరీ పురస్కారాలు ప్రకటించారు. 11 మందిని మరణానంతరం గ్యాలంటరీ అవార్డులకు ఎంపిక చేశారు. ఇద్దరికి కీర్తి చక్ర, 14 మందికి శౌర్యచక్ర, 66 మందికి సేనా మెడల్స్ ప్రకటించారు.

News January 25, 2025

139 మందికి పద్మ పురస్కారాలు

image

2025 ఏడాదికి గానూ కేంద్రం మొత్తం 139 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మంది పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీకి సెలక్ట్ చేసింది. వీరిలో 23 మంది మహిళలు కాగా, 10 మంది NRIలు, ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. పద్మ పురస్కారాల పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.