News January 25, 2025

గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన రాష్ట్రపతి

image

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సాయుధ బలగాల్లో 93 మందికి గ్యాలంటరీ పురస్కారాలు ప్రకటించారు. 11 మందిని మరణానంతరం గ్యాలంటరీ అవార్డులకు ఎంపిక చేశారు. ఇద్దరికి కీర్తి చక్ర, 14 మందికి శౌర్యచక్ర, 66 మందికి సేనా మెడల్స్ ప్రకటించారు.

News January 25, 2025

139 మందికి పద్మ పురస్కారాలు

image

2025 ఏడాదికి గానూ కేంద్రం మొత్తం 139 మందిని పద్మ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మంది పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీకి సెలక్ట్ చేసింది. వీరిలో 23 మంది మహిళలు కాగా, 10 మంది NRIలు, ఇతర దేశాలకు చెందిన వారు ఉన్నారు. పద్మ పురస్కారాల పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 25, 2025

పద్మ పురస్కారాలు పొందిన తెలుగు వారు

image

– దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి (వైద్యం): పద్మ విభూషణ్- తెలంగాణ
– మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు): పద్మ శ్రీ – తెలంగాణ
– నందమూరి బాలకృష్ణ (కళలు): పద్మభూషణ్
– KL కృష్ణ (సాహిత్యం): పద్మశ్రీ- ఏపీ
– మాడుగుల నాగఫణి శర్మ (కళలు): పద్మశ్రీ- ఏపీ
– మిర్యాల అప్పారావ్ (కళలు): పద్మ శ్రీ- ఏపీ
– వద్దిరాజు రాఘవేంద్రాచార్య (సాహిత్యం): పద్మశ్రీ- ఏపీ

News January 25, 2025

BREAKING: బాలకృష్ణకు పద్మభూషణ్

image

సినీ నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కేంద్రం పద్మ అవార్డుతో సత్కరించింది. ఏపీ నుంచి కళల విభాగంలో పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది. మొత్తం 19 మందికి పద్మభూషణ్ అవార్డులు వరించాయి. ఈ విభాగంలో అజిత్, శేఖర్ కపూర్, శోభన, అనంత్ నాగ్, గోస్వామి, పంకజ్ ఉద్ధాస్‌ ఉన్నారు.
పద్మ అవార్డుల పూర్తి జాబితా కోసం: <>క్లిక్ చేయండి<<>>

News January 25, 2025

బండిపై జగ్గారెడ్డి ఫైర్

image

TG: ‘ఇందిరమ్మ ఇళ్లు’ అనే పేరు ఉంటే <<15254662>>తెలంగాణకు <<>>కేంద్రం నుంచి సాయం ఉండదంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. వ్యవస్థపై సంజయ్‌కు అవగాహన లేదని విమర్శించారు. కేంద్రానికి రాష్ట్రం నుంచే డబ్బులు వెళ్తాయని, పైసలు ఇవ్వనని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా? అని మండిపడ్డారు. మోదీకి గులాం చేస్తేనే తెలంగాణకు నిధులు ఇస్తారా? అని ప్రశ్నించారు.

News January 25, 2025

భారత్ టార్గెట్ ఎంతంటే?

image

చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచులో ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. కెప్టెన్ బట్లర్(45), కార్స్(31) మినహా ఇతర ENG ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో వరుణ్, అక్షర్ చెరో 2, అర్ష్‌దీప్, సుందర్, అభిషేక్, పాండ్య తలో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 166.

News January 25, 2025

ఆ విషయానికి వస్తే అంతా ఒక్కటే

image

రాజకీయ పార్టీల మధ్య ఎన్ని సిద్ధాంత భేదాలున్నా, అన్నింటికీ సక్సెస్ మంత్ర మాత్రం ఉచితాలే. ఢిల్లీ ఎన్నికలే చూస్తే.. అవినీతిని ఊడ్చేస్తామనే ఆప్, ఫ్రీబీస్ ప్రమాదకరమన్న BJP సహా అన్నీ ఫ్రీ హామీలు ఇవ్వడంలో తగ్గడం లేదు. ప్రజల జీవితాలు మారుతాయో లేదో తెలియదు కానీ ప్రతిసారి హామీలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంతా అదే తారకమంత్రం అని జపిస్తుంటే ప్రజల జీవితాలు వికసించేదెప్పుడు? దేశం అభివృద్ధి చెందేది ఎప్పుడు?

News January 25, 2025

APPLY NOW: భారీ జీతంతో ఉద్యోగాలు

image

ESICలో 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. MBBS పూర్తి చేసి, యూపీఎస్సీ నిర్వహించిన CMSE-2022&2023 ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News January 25, 2025

ఫల‘సాయం’తో వీరికి పద్మశ్రీ

image

హరిమాన్ శర్మ(హిమాచల్‌), హంగ్‌థింగ్‌(నాగాలాండ్‌)కు ‘పద్మశ్రీ’లు లభించాయి. ఇద్దరూ పళ్ల రైతులే. రోగనిరోధకతతో, చల్లదనం తక్కువగా ఉన్నా పెరిగే ‘HRMN 99’ యాపిల్‌ రకాన్ని శర్మ అభివృద్ధి చేశారు. దేశవిదేశాల్లో ఈ రకానికి చెందిన 14 లక్షల మొక్కల్ని లక్షమందికి పైగా రైతులు పెంచుతున్నారు. ఇక తమ ప్రాంతానికి చెందని పళ్లు, కూరగాయల్ని ఎలా పండించాలన్నదానిపై 40 గ్రామాల్లోని 200మంది రైతులకు హంగ్‌థింగ్ శిక్షణనిచ్చారు.

News January 25, 2025

ఇది దేశం గర్వించదగిన సందర్భం: రాష్ట్రపతి

image

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో ఈ గణతంత్ర దినోత్సవం ప్రత్యేకమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇది యావత్ దేశం గర్వించదగిన సందర్భమన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ చాలా ఎదిగిందని వివరించారు. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని అందరూ స్మరించుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అణుగుణంగా కొత్త చట్టాలను రూపొందించి అమల్లోకి తెచ్చామని ఆమె గుర్తుచేశారు.