India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మాస్ మహారాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి రేపు ఉ.11.07 గంటలకు గ్లింప్స్ రిలీజ్ కానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఆయన స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బాను బోగవరపు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. నాగవంశీ, సౌజన్య నిర్మిస్తున్నారు.

AP: గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత <<15250698>>హరీశ్ రావు<<>> చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ‘బనకచర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు. వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేం అభ్యంతరం చెప్పలేదు’ అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ఆ దేశంతో భారత దౌత్యబంధం మొదలై 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి ప్రబోవోను భారత సర్కారు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు చేరుకున్న ఆయన, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు.

హిందీ చిత్ర పరిశ్రమలో ఐక్యత లోపించిందని నటుడు అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘నాకే అవకాశం దక్కితే పరిశ్రమలో ఐక్యత తీసుకురావడమే మొదటి లక్ష్యంగా పెట్టుకుంటా. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకునేలా అందరూ కలిసి పనిచేయాలి. సమస్యలకు ఉమ్మడిగా పరిష్కారాన్ని కనుగొనాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగితే ఇతర పరిశ్రమలపైనా అది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

మెన్స్ టీ20 టీమ్-2024ను ఐసీసీ ప్రకటించింది. రోహిత్ శర్మను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి రోహిత్‌తో పాటు హార్దిక్, బుమ్రా, అర్ష్‌దీప్‌కు చోటు దక్కింది. 2024 టీ20 WCలో 378 రన్స్ చేసిన రోహిత్, టోర్నీ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీమ్: రోహిత్(C), హెడ్, సాల్ట్, బాబర్ ఆజమ్, పూరన్(WK), సికందర్ రజా, హార్దిక్, రషీద్ ఖాన్, హసరంగ, బుమ్రా, అర్ష్‌దీప్.

మహారాష్ట్రలో RTC బస్సు ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధరపై 14.95% పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి. అటు ఆటో, ట్యాక్సీ ఛార్జీల పెంపు ప్రతిపాదనకు కూడా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో ఆటో ఛార్జీ రూ.23 నుంచి రూ.26కి, టాక్సీ ఛార్జీ రూ.28 నుంచి రూ.31కి చేరింది. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా RTC ఛార్జీలను పెంచింది.

AP: విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నకు సీఎం చంద్రబాబు స్పందించారు. అది వైసీపీ అంతర్గత వ్యవహారమని చెప్పారు. నాయకుడిపై నమ్మకం ఉంటే నేతలు ఉంటారని, లేదంటే ఎవరి మార్గం వాళ్లు చూసుకుంటారని పేర్కొన్నారు. అటు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖను ఆమోదించారని విజయసాయి చెప్పారు.

ఎయిర్‌టెల్ 2 ప్లాన్ల ధరలను తగ్గించింది. రూ.499గా ఉన్న రీఛార్జీపై రూ.30 తగ్గించి రూ.469 చేసింది. దీని వ్యాలిడిటీ 84 రోజులు కాగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలు వస్తాయి. రూ.1,959తో ఉన్న ప్లాన్ ధరను రూ.1,849కి మార్చింది. 365 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3600 SMSలు లభిస్తాయి. వాయిస్, SMSల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలు తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించిన విషయం తెలిసిందే.

టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. బంతిని ఇరువైపులా స్వింగ్ చేయడం అతని ప్రత్యేకత అని చెప్పారు. బౌలింగ్‌లో వేరియేషన్లు చూపించడం అతనికే సాధ్యమన్నారు. ఈ తరం లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ, మిచెల్ స్టార్క్‌తో పోలిస్తే టీ20ల్లో అత్యుత్తమ బౌలర్ అర్ష్‌దీప్ అని కొనియాడారు.

TG: ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టంచేశారు. కాగా రాష్ట్రానికి 20లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని CM రేవంత్ కోరారు.
Sorry, no posts matched your criteria.