News April 18, 2024

కేసు పెట్టకుండా ఉండేందుకు ఎస్సై లంచం

image

TG: భద్రాచలం ఎస్సై, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. కేసు పెట్టకుండా ఉండేందుకు రూ.20వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు దొంగతనం చేసినట్లు కానిస్టేబుల్ శంకర్ గుర్తించారు. వారిపై క్రిమినల్ కేసు లేకుండా చేయడానికి శంకర్ లంచం అడిగారు. సదరు వ్యక్తి ఫిర్యాదుతో ఎస్సై శ్రీనివాసరావు, కానిస్టేబుల్ శంకర్, సీసీ కెమెరా ఆపరేటర్ నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

News April 18, 2024

23న పవన్ కళ్యాణ్ నామినేషన్

image

AP: ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నామినేషన్ల పర్వం మొదలైంది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తోన్న పవన్ కళ్యాణ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జనసేన Xలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారని తెలిపింది.

News April 18, 2024

ఎన్నికల గుర్తుల చరిత్ర ఇదీ!

image

దేశంలో తొలి ఎన్నికల సమయానికి అక్షరాస్యత 16 శాతమే. దీంతో పార్టీలను సులభంగా గుర్తించడానికి వీలుగా సింబల్స్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ గుర్తులకు రూపమివ్వడానికి చిత్రకారుడు MS సేథిని 1950లో ఎన్నికల కమిటీ నియమించింది. ఆయన 1992 వరకు పెన్సిల్‌తో ఎన్నో వేల గుర్తులను గీశారు. ఇప్పటికీ ఆయన చిత్రాలే కాస్త ఆధునికత సంతరించుకుని ఎన్నికల గుర్తులుగా ఉన్నాయి. కాగా 2000 సంవత్సరంలో సేథి కన్నుమూశారు.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

చిరంజీవిని కలిసిన మాస్కో సాంస్కృతిక శాఖ బృందం

image

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధి బృందం సమావేశమైంది. రష్యాలో తెలుగు సినిమాల షూటింగ్‌లు జరుపుకునేందుకు సపోర్ట్ చేయనున్నట్లు బృందం సభ్యులు చిరంజీవికి తెలిపారు. రెండు ఇండస్ట్రీలు కలిసి పనిచేయడంతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు.

News April 18, 2024

ఫైనల్‌లో నేను చివరి వరకు ఉంటే బాగుండేది: రాహుల్

image

వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో తాను ఇంకా మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిందని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డారు. సమయం వెనక్కి వెళ్లగలిగితే మీరు ఏ నిర్ణయాన్ని సరిచేసుకుంటారని అశ్విన్ అడిగిన ప్రశ్నకు రాహుల్ జవాబిచ్చారు. ‘ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై నేను చివరి వరకు బ్యాటింగ్ చేసి ఉంటే బాగుండేది. దీని వల్ల 30-40 రన్స్ ఎక్కువ వచ్చేవి. ప్రపంచకప్ మా చేతుల్లో ఉండేది. దానికి నేను చింతిస్తున్నా’ అని పేర్కొన్నారు.

News April 18, 2024

ఎన్నికల గుర్తులు ఎలా కేటాయిస్తారు?

image

పార్టీలు, ఇండిపెండెంట్లకు గుర్తులను EC కేటాయిస్తుంది. రిజర్వుడ్ సింబల్స్, ఫ్రీ సింబల్స్ అని 2 రకాలుంటాయి. EC గుర్తింపు పొందిన పార్టీల(EX: BJP, INC, YCP, TDP, BRS)కు రిజర్వుడ్ గుర్తులుంటాయి. వీటిని ఇతరులకు కేటాయించరు. కొత్త పార్టీలు, స్వతంత్రులు, గుర్తింపులేని రిజిస్టర్డ్ పార్టీల(EX: JSP, లోక్‌సత్తా)కు ఫ్రీసింబల్స్‌ను కేటాయిస్తుంది. ఆ పార్టీలు గుర్తింపు పొందే వరకు గుర్తుల కోసం అప్లై చేసుకోవాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

ప్రేమించట్లేదని యువతిని దారుణంగా చంపిన సీనియర్

image

కర్ణాటక హుబ్బళ్లిలో దారుణం జరిగింది. ప్రేమను నిరాకరించినందుకు ఓ యువకుడు యువతిని కిరాతకంగా చంపేశాడు. కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహ (24) BVB కాలేజీలో చదువుతోంది. కాలేజీలో సీనియర్ అయిన ఫయాజ్ కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతున్నాడు. నేహ నిరాకరించడంతో కోపం పెంచుకున్న అతడు యువతి మెడపై విచక్షణారహితంగా 9 సార్లు కత్తితో పొడిచి, చంపేశాడు. లవ్ జిహాద్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 18, 2024

INC, BJP ఎన్నికల గుర్తులు ఇలా మారాయి!

image

దేశంలోని 2 ప్రధాన జాతీయ పార్టీలైన INC, BJP 1951 నుంచి ఇప్పటి వరకు 3సార్లు గుర్తులను మార్చుకున్నాయి. కాంగ్రెస్ 1951-1969 వరకు జోడెద్దులు, 1971-77 వరకు ఆవుదూడ(ఇందిరా కాంగ్రెస్-R), 1977 నుంచి హస్తం గుర్తును ఉపయోగిస్తోంది. ఇక భారతీయ జన సంఘ్ 1951-1977 వరకు దీపం, ఆ పార్టీని జనతా పార్టీలో విలీనం చేసిన తర్వాత నాగలి ఎత్తుకున్న రైతు, 1980లో బీజేపీని ఏర్పాటు చేశాక కమలం గుర్తును ఎంచుకుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 18, 2024

రేపు OTTలోకి ‘ఆర్టికల్ 370’

image

నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య సుహాస్ డైరెక్షన్‌లో ప్రియమణి, యామీ గౌతమ్ నటించిన ‘ఆర్టికల్ 370’ సినిమా రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ₹20 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ₹100 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. 2019 FEB 14న పుల్వామా దాడి, ఆ తర్వాత జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని ర‌ద్దు చేసే క్ర‌మంలో ఎదురైన సంఘటనలపై మూవీ రూపొందింది.

News April 18, 2024

ఎంపీగా విజయం సాధిస్తా: RSP

image

TG: నాగర్ కర్నూల్ ఎంపీగా తాను చరిత్రాత్మక విజయం సాధిస్తానని BRS అభ్యర్థి RS.ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా KCR నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచి నాగర్ కర్నూల్ ప్రజలకు విశ్వసనీయ సేవకుడిగా ఉంటానని చెప్పారు.