News January 24, 2025

విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టులో VSR పిటిషన్

image

AP: విదేశీ పర్యటనకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును రాజ్యసభ ఎంపీ విజయ‌సాయి రెడ్డి అనుమతి కోరారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు నార్వే, ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలకు సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు ఈ నెల 27కి విచారణను వాయిదా వేసింది. కాగా రాజకీయాలు వీడుతున్నట్లు VSR ప్రకటించిన సంగతి తెలిసిందే.

News January 24, 2025

వీటిని రాత్రి నానబెట్టి తింటే..

image

అంజీర్ పండ్లను రాత్రి నానబెట్టి ఉదయం తింటే అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. తేనెతో కలిపి పరగడుపున తింటే జీర్ణశక్తి మెరుగవుతుంది. ఇందులోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ సమస్యలను తగ్గిస్తాయి. రక్త సరఫరా పెరుగుతుంది. గుండెపోటు రాకుండా ఉండేందుకు ఇందులోని పోషకాలు సహాయపడతాయి.

News January 24, 2025

చిరంజీవితో అనిల్ రావిపూడి మరో బ్లాక్‌బస్టర్ తీస్తారు: నిర్మాత

image

విజయ పరంపర కొనసాగిస్తున్న అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. ‘లైలా’ చిత్రం ఈవెంట్‌లో దీనిపై నిర్మాత సాహు గారపాటి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘చిరంజీవితో అనిల్ తీయబోయే సినిమా బ్లాక్ బస్టర్ ఖాయం. ఇది ఎమోషన్స్‌తో కూడిన కథ. ఈ మూవీ విజయంతో అనిల్ రావిపూడి కెరీర్‌లో ట్రిపుల్ హ్యాట్రిక్ ఖాయం’ అని తెలిపారు.

News January 24, 2025

USలోకి అక్రమంగా ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు: ట్రంప్

image

US నుంచి అక్రమ వలసదారులను పంపించేస్తున్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్‌లో వారిని ఎక్కిస్తున్న ఫొటోలను వైట్ హౌస్ విడుదల చేసింది. ‘అక్రమ వలసదారులను తరలించే ఫ్లైట్స్ మొదలయ్యాయి. చట్టవిరుద్ధంగా USలోకి ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇదే ప్రపంచానికి ప్రెసిడెంట్ ఇచ్చే స్పష్టమైన మెసేజ్’ అని పేర్కొంది. అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News January 24, 2025

పెళ్లి చేసుకున్న ఇద్దరు మహిళలు.. ట్విస్ట్ ఏంటంటే?

image

UPలో కవిత, గుంజా అనే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. భర్తలు పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక వారి నుంచి విడిపోయి ఇలా ఒక్కటయ్యారు. గోరఖ్‌పూర్ జిల్లాకు చెందిన వీరిద్దరికి 4ఏళ్ల క్రితం ఇన్‌స్టాలో పరిచయమైంది. కొన్ని నెలలుగా ఒకే గదిలో ఉంటున్నారు. ఒకరిని వదిలి మరొకరు ఉండలేమని తెలుసుకుని తాజాగా ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. గుంజా తన పేరును బబ్లూగా మార్చుకుని తనకు భర్తగా ఉంటుందని కవిత తెలిపింది.

News January 24, 2025

తీవ్ర నిరాశలో వైసీపీ శ్రేణులు

image

YCP అధినేత జగన్ వ్యూహాల వెనుక విజయసాయిరెడ్డిది కీలకపాత్ర. 2004 నుంచి జగన్ వెంట నడుస్తున్నారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్‌తో పాటు జైలు జీవితం గడిపారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి తెర వెనుక వ్యూహరచన, తెర ముందు రాజకీయ విమర్శలతో పెద్దదిక్కుగా మారారు. 2019లో అధికారంలోకి వచ్చాక ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు నడిపారు. రేపు VSR రాజీనామా చేయనుండటంతో జగన్ ఒంటరవుతారని YCP ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.

News January 24, 2025

దోచుకున్న సొమ్ము బయటపెట్టు: సోమిరెడ్డి

image

AP: విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు <<15247358>>రాజకీయాల<<>> నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి అన్నారు. ‘2004-09 వరకు జగన్‌ను ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి. అప్పుడు దోచుకున్న రూ.43వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్‌తో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అని ట్వీట్ చేశారు.

News January 24, 2025

ఏపీలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్.. ఎక్కడంటే?

image

ఏపీలోని భీమవరంలో ఈనెల 26న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బ్లాక్ బస్టర్ సంబరాలను నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. SRKR ఇంజినీరింగ్ కాలేజీలో ఈ ఈవెంట్ జరగనుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాకు ఇప్పటివరకు రూ.230కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేశ్ హీరోగా నటించగా, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

News January 24, 2025

రాజ్యసభలో వైసీపీకి బిగ్ షాక్

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీల సంఖ్య భారీగా తగ్గుతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది ఎగువసభ సభ్యులు ఉండేవారు. కొద్ది రోజుల క్రితం బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. రేపు రిజైన్ చేస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి సైతం రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది.

News January 24, 2025

వైసీపీ చేసిన మంచిని ప్రజలకు బలంగా చెప్పాలి: సజ్జల

image

AP: వైసీపీ చేసిన మంచిని ప్రజలకు ఇంకా బలంగా చెప్పాలని ఆపార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ నేతలతో నిర్వహించిన వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు. మీడియా అండతోనే అధికారంలోకి వస్తామనేది కేవలం అపోహ అని చెప్పారు. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిసైల్స్‌లా దూసుకెళ్లాలన్నారు. టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు.