News April 18, 2024

మైదా ఎలా తయారవుతుంది? మంచిది కాదా?

image

గోధుమల్లో ఊక(పైపొట్టు), బ్రాన్(పైపొరతో), పాలిష్డ్ అని 3 దశలుంటాయి. పైపొర తీసేసి గోధుమలను మెత్తగా చేస్తే దాన్ని మైదా అంటారు. అయితే గోధుమ రవ్వకు, మైదాకు పెద్ద తేడా లేదని పీడియాట్రీషియన్స్, న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. మైదా ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటూనే.. ఇంటర్నెట్లో చూపించేంత భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారు, అధిక బరువున్న మహిళలు తినకూడదట.

News April 18, 2024

KCR అన్న కొడుకుపై మరో కేసు నమోదు

image

TG: BRS అధినేత KCR అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావుపై బంజారాహిల్స్ PSలో మరో కేసు నమోదైంది. ఓ సమస్య పరిష్కారం కోసం కలిస్తే తనను గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి డబ్బులు వసూలు చేశారని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. నందిని అనే మహిళతో కలిసి రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారం దోచుకున్నాడని బాధితుడు విజయవర్ధన్ పేర్కొన్నారు. కాగా మన్నెగూడ భూవివాదం కేసులో ఇప్పటికే కన్నారావు అరెస్టైన సంగతి తెలిసిందే.

News April 18, 2024

ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన తోషిబా

image

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తోషిబా ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. జపాన్‌లోని తమ సంస్థలో సుమారు 5వేల మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా కంపెనీలో డిజిటల్ టెక్నాలజీ, ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టనుంది. అందుకు కంపెనీపై 650 మిలియన్ డాలర్ల ఖర్చు కానుంది. జపాన్‌లో అత్యధిక ఉద్యోగులు కలిగిన కంపెనీల్లో ఒకటైన తోషిబా.. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

News April 18, 2024

ఇజ్రాయెల్‌: చిన్న దేశానికి ఆయుధాలెక్కడివి?

image

గత OCT నుంచి హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. చిన్న దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్‌కు ప్రధాన సరఫరాదారైన అమెరికా ఏటా $3.8 బిలియన్ల సైనిక సాయం చేస్తోంది. జర్మనీ, ఇటలీ, బ్రిటన్ దేశాలు సైతం ఇజ్రాయెల్‌కు ఈ పరంగా సాయం చేస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్ సొంతంగా రక్షణ పరిశ్రమను అభివృద్ధి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో 9వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది.

News April 18, 2024

తగ్గిన బంగారం ధరలు

image

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.330 తగ్గింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ.73,800కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 దిగి రూ.67,650గా నమోదైంది. అటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.90,000 పలుకుతోంది.

News April 18, 2024

రక్తం రుచి మరిగిన బ్యాక్టీరియా

image

రక్తానికి సంబంధించి అంటువ్యాధులకు కారణమయ్యే సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు హ్యూమన్ బ్లడ్‌లోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. రక్తంలోని సీరంలో ఉండే సెరైన్ అనే అమైనో యాసిడ్‌‌కు బ్యాక్టీరియాలు ఆకర్షితమై నిమిషాల్లో రక్తంలో చేరుతున్నాయని వెల్లడించారు. బ్యాక్టీరియాల్లో ఆ సామర్థ్యం ఎలా ఉందో గుర్తిస్తే నియంత్రించేందుకు కొత్త ఔషధాలు సృష్టించవచ్చని చెప్పారు.

News April 18, 2024

Nestle ప్రొడక్టుల్లో 3గ్రాముల అదనపు షుగర్!

image

ప్రముఖ బేబీ ఫుడ్ ప్రొడక్టుల కంపెనీ Nestle భారతదేశంలో విక్రయించే ప్రతి సెరెలాక్‌లో 3గ్రాముల చక్కెర అదనంగా వాడుతున్నట్లు తేలింది. అభివృద్ధి చెందిన UK, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో షుగర్ ఫ్రీగా తయారు చేస్తూ.. మిగతా దేశాల్లో పిల్లలకు అందించే పాలు, తృణధాన్యాల ఉత్పత్తుల్లో అదనంగా షుగర్, తేనె జోడిస్తున్నట్లు publiceye పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

News April 18, 2024

డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్

image

TG: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న DSC పరీక్ష కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్లు టీశాట్ ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రత్యక్షప్రసారాలు ఉంటాయంది. గణితం, సైన్స్, బయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ తదితర సబ్జెక్టులపై టెలికాస్ట్ అయ్యే లైవ్ ప్రోగ్రామ్స్.. మరుసటి రోజు విద్య ఛానల్‌లో సాయంత్రం 6 గంటలకు రీటెలికాస్ట్ అవుతాయని వెల్లడించింది.

News April 18, 2024

తండ్రీకుమారులకు సవాలుగా మారిన ‘చింద్వారా’

image

మధ్యప్రదేశ్‌లో చింద్వారా లోక్‌సభ స్థానాన్ని BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ Ex CM కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్ పోటీ చేస్తున్నారు. 2019లో ఆయన 37,356 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నకుల్‌ను ఈసారి ఓడించి గిరిజన జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన చింద్వారాను కైవసం చేసుకోవాలని BJP వ్యూహాలు పన్నుతోంది. ఈ సీటును ఎలాగైనా నిలబెట్టుకోవాలని నాథ్‌లు తీవ్రంగా యత్నిస్తున్నారు.

News April 18, 2024

T20 WC: దూబేపై ‘ఇంపాక్ట్’ దెబ్బ!

image

CSK ఆల్‌రౌండర్ శివమ్ దూబే T20 WC ఆడే భారత జట్టులో ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడిని ‘ఇంపాక్ట్’ రోల్ కలవరపెడుతోంది. 6మ్యాచుల్లో 242రన్స్‌తో CSK టాప్ స్కోరర్‌గా ఉన్న దూబే పేస్ బౌలింగ్ చేయగలరు. అయితే.. అతడిని ఇంపాక్ట్ ప్లేయర్‌ కింద పంపిస్తూ కేవలం బ్యాటింగ్‌‌కే పరిమితం చేస్తున్నారు. దీంతో ఆల్‌రౌండర్ల కోటాలో T20WC ఆడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు.