News January 23, 2025

టెన్త్ విద్యార్థులకు అలర్ట్

image

TG: పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మార్చి 6 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. రోజూ మ.1.15 గం. నుంచి సా.4.15 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి.
*మార్చి 6- ఫస్ట్ లాంగ్వేజ్ *7- సెకండ్ లాంగ్వేజ్ *10- థర్డ్ లాంగ్వేజ్ *11- మ్యాథ్స్ *12- ఫిజికల్ సైన్స్ *13- బయోలాజికల్ సైన్స్ *15- సోషల్ స్టడీస్
>>ఇక టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు.

News January 23, 2025

ఆరు నెలల వరకు బంగారం కొనలేమా…

image

ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో 6 నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. ఓపెన్ మార్కెట్లో 24k గోల్డ్ 10gr ధర రూ.82వేలు దాటేసింది. ఇండియన్ బులియన్, జువెలరీ అసోసియేషన్ (IBJA) ప్రకారం తొలిసారి రూ.80,194 దాటింది. 2024, OCT 30నాటి రూ.79,681ని దాటేసింది.

News January 23, 2025

ట్రంప్ తగ్గేదే లే

image

అధికారంలోకి వచ్చిన తొలిరోజే US దక్షిణ సరిహద్దుల్లో ఎమర్జెన్సీ విధించిన ట్రంప్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ వలసదారులు స్కూళ్లు, చర్చిలు, ఆస్పత్రులు, పెళ్లిళ్లు, దహన సంస్కారాలు లాంటి సున్నిత ప్రాంతాల్లో ఉన్నా అరెస్టు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు 2011లోని నిబంధనను ఆ దేశ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎత్తివేసింది. క్రిమినల్స్ ఎక్కడ దాక్కున్నా వదలబోమంది.

News January 23, 2025

ముగిసిన సీఎం రేవంత్ దావోస్ పర్యటన

image

TG: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు దావోస్ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో పలు సంస్థలతో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో సుమారు 49,550 వేల ఉద్యోగాల కల్పనకు అవకాశముంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల్లో ఇదే రికార్డు కాగా గత ఏడాదితో పోలిస్తే నాలుగు రెట్లు మించాయి. కాగా రేపు ఉదయం సీఎం రేవంత్ బృందం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనుంది.

News January 23, 2025

కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని ఇవాళ రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు. రేపు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి తదితరులను కలుస్తారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశమవుతారు. సాయంత్రానికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.

News January 23, 2025

రికార్డు సృష్టించిన చైనా కృత్రిమ సూర్యుడు

image

చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్ కండక్టింగ్ టొకమాక్ (ఈస్ట్) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ సరికొత్త రికార్డు సృష్టించింది. 1,000 సెకన్ల(16 నిమిషాలు)పాటు 100 మిలియన్ డిగ్రీల ఉష్ణోగ్రతను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును 2006 నుంచి చేపడుతున్నారు. ఇందులో భారత్‌తోపాటు అమెరికా, రష్యా, జపాన్, సౌత్ కొరియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి.

News January 23, 2025

12 ఏళ్ల తర్వాత రిలీజై.. రూ.100 కోట్లే లక్ష్యంగా!

image

తమిళ నటుడు విశాల్ హీరోగా సుందర్ తెరకెక్కించిన ‘మద గజ రాజా’ చిత్రం 12 ఏళ్ల తర్వాత విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలై ఇప్పటికే రూ.50 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ & ఓవర్సీస్‌లో విడుదలై రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.

News January 23, 2025

పబ్లిసిటీ కోసమే బాబు దావోస్ పర్యటన: గుడివాడ అమర్నాథ్

image

AP: CM చంద్రబాబు దావోస్ పర్యటన నుంచి ఒట్టి చేతులతో వస్తున్నారని YCP నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు మాత్రం రూ.వేల కోట్ల పెట్టుబడులు రాబట్టాయని చెప్పారు. ‘దావోస్ పర్యటన పబ్లిసిటీ కోసం తప్పా ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్క కంపెనీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. పెట్టుబడులు రాబట్టడంలో CM అట్టర్ ఫ్లాప్. ఈ పర్యటన కోసం సర్కార్ రూ.3 కోట్ల ప్రజాధనం వృథా చేసింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News January 23, 2025

రంజీలోనూ ఫ్లాప్ షో

image

రంజీ క్రికెట్ ఆడుతోన్న భారత బ్యాటర్లు అందులోనూ ఘోరంగా విఫలమయ్యారు. ఇవాళ రోహిత్ (3), జైస్వాల్ (4), గిల్ (4), రహానే (12), శ్రేయస్ అయ్యర్ (11), రుతురాజ్ గైక్వాడ్ (10), రజత్ పాటీదార్ (0), రిషభ్ పంత్ (1), పుజారా (6) అట్టర్ ఫ్లాప్ అయ్యారు.

News January 23, 2025

కానిస్టేబుల్ ఫిజికల్ టెస్టులో అపశ్రుతి.. అభ్యర్థి మృతి

image

AP: విశాఖపట్నంలో కానిస్టేబుల్ అభ్యర్థుల ఫిజికల్ టెస్టులో అపశ్రుతి చోటు చేసుకుంది. 1600 మీటర్ల రన్నింగ్ సమయంలో అభ్యర్థి శ్రావణ్ కుమార్ కుప్పకూలాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మరణించాడు. పోలీసు అవుతాడనుకున్న కొడుకు పుట్టినరోజునే మృతి చెందటంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.