News January 23, 2025

పవన్‌తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హైకమిషనర్

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీ దిగి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘విజయవాడలో పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా స్వాగతించినందుకు ధన్యవాదాలు. సింగపూర్- ఆంధ్రప్రదేశ్ చిరకాల స్నేహాన్ని కలిగి ఉన్నాయి. AP-SG సహకారాన్ని బలోపేతం చేయడంపై జరిగిన చర్చను అభినందించాల్సిందే’ అని ట్వీట్ చేశారు.

News January 23, 2025

టీడీపీలో CBN తర్వాత స్థానం లోకేశ్‌దే: అచ్చెన్నాయుడు

image

AP: ఎవ్వరు ఏమనుకున్నా టీడీపీలో చంద్రబాబు తర్వాతి స్థానం లోకేశ్‌దేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదన్నారు. కూటమికి 164 సీట్లు రావడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే అంశం ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదని చెప్పారు. పదవులైనా, నిర్ణయాలైనా కూటమి ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు.

News January 23, 2025

శ్రీలంకపై భారత్ విజయం

image

అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో 60 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. త్రిష(49) రాణించడంతో 118 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 58 పరుగులే చేసింది. భారత బౌలర్లలో షబ్నాం, జోషిత, పరుణిక చెరో రెండు, ఆయూషి, వైష్ణవి తలో వికెట్ తీశారు.

News January 23, 2025

₹2లక్షల కోట్లు.. కేంద్రానికి త్వరలో RBI బొనాంజా!

image

కేంద్ర ప్రభుత్వానికి RBI బంపర్ బొనాంజా ఇవ్వనుంది. అతి త్వరలోనే రూ.1.5-2 లక్షల కోట్ల వరకు బదిలీ చేయనుందని తెలిసింది. డాలర్ల విక్రయం, పెట్టుబడులు, కరెన్సీ ప్రింటింగ్‌ ఫీజు రూపంలో వచ్చిన ఆదాయాన్ని సంస్థ ఏటా కేంద్రానికి డివిడెండ్ రూపంలో చెల్లిస్తుంది. క్రితంసారి రూ.2.10లక్షల కోట్లు ఇచ్చింది. ఈసారి అంతకన్నా ఎక్కువే ఇవ్వొచ్చని సమాచారం. డాలర్ల విక్రయంతో RBIకి రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు అంచనా.

News January 23, 2025

మహా కుంభమేళా.. 10 కోట్ల మంది పుణ్యస్నానాలు

image

ప్రయాగ్‌రాజ్ (UP) మహా కుంభమేళా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మొత్తం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.

News January 23, 2025

సీనియర్ ప్లేయర్లకు చుక్కలు చూపించిన జమ్మూ పేసర్

image

ముంబైతో జరిగిన రంజీ మ్యాచులో జమ్మూ కశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ సీనియర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. రోహిత్ శర్మ(3), అజింక్య రహానే(12), శివమ్ దూబే(3), హార్దిక్ తామూర్(7)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపారు. వారు క్రీజులో ఏమాత్రం కుదురుకోకుండా నిప్పులు చెరిగే బంతులతో చెలరేగారు. కాగా పుల్వామాకు చెందిన 31 ఏళ్ల ఉమర్ 2013 నుంచి క్రికెట్ ఆడుతున్నారు. గతంలో ఇండియా-సి జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు.

News January 23, 2025

‘ఏమైనా సరే.. FEB 20లోపు డెలివరీ చేయండి’

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన <<15211801>>కొత్త రూల్‌<<>>తో అక్కడి ఇండోఅమెరికన్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 20లోపు జన్మించే పిల్లలకు మాత్రమే అక్కడి పౌరసత్వం లభించనుంది. దీంతో ఇప్పటికే గర్భంతో ఉన్నవారు ఫిబ్రవరి 20లోపు డెలివరీ జరిగేలా వైద్యులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. నెలలు నిండకుండానే సి-సెక్షన్లు చేయాల్సిందిగా వైద్యులకు రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

News January 23, 2025

పెట్టుబడులు మూడింతలు.. 46 వేల ఉద్యోగాలు!

image

దావోస్ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంతో పలు సంస్థలు భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తాజాగా అమెజాన్‌తో కలుపుకొని పెట్టుబడులు మొత్తం రూ.1.32 లక్షల కోట్లు దాటాయి. వీటితో 46 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే <<15233398>>పెట్టుబడులు దాదాపు మూడింతలు<<>> మించిపోయాయి.

News January 23, 2025

జైలు శిక్షపై స్పందించిన RGV

image

చెక్ బౌన్స్ కేసులో దర్శకుడు RGVకి 3 నెలలు<<15232059>> జైలు శిక్ష <<>>పడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై RGV స్పందించారు. ‘అంధేరీ కోర్టు శిక్ష విధించిన వార్తల గురించి స్పష్టం చేయాలి అనుకుంటున్నా. ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన 7ఏళ్ల క్రితం నాటి రూ.2.38లక్షల చెక్ బౌన్స్ కేసు. దీనిపై నా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను’ అని తెలిపారు.

News January 23, 2025

వచ్చే నెల 6న ఏపీ మంత్రివర్గ భేటీ

image

AP: ఫిబ్రవరి 6న ఏపీ క్యాబినెట్ సమావేశం కానుంది. సీఎం అధ్యక్షతన దావోస్ పర్యటన, అమరావతి, పోలవరం పనులు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించనుంది. వాట్సాప్ గవర్నెన్స్‌ వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనుంది.