News April 17, 2024

IPL: 3 రోజుల్లో 4 సెంచరీలు

image

ఐపీఎల్‌లో సెంచరీల మోత మోగుతోంది. ఇప్పటివరకు 6 శతకాలు నమోదయ్యాయి. కోహ్లీ(RCB) సీజన్‌లో తొలి సెంచరీ బాదారు. తర్వాత జోష్ బట్లర్(RR) రెండో శతకం సాధించారు. ఏప్రిల్ 14న రోహిత్ శర్మ(MI) చెన్నైపై శతక్కొట్టగా.. తర్వాతి రోజు ట్రావిస్ హెడ్(SRH) బెంగళూరుపై సెంచరీ కొట్టారు. నిన్న జరిగిన KKR, RR మ్యాచులో సునీల్ నరైన్, జోష్ బట్లర్ సెంచరీలతో చెలరేగారు. దీంతో గత 3 రోజుల్లో ఏకంగా 4 సెంచరీలు నమోదయ్యాయి.

News April 17, 2024

ఐర్లాండ్‌లో భారత రాయబారిని తొలగించాలి: కాంగ్రెస్

image

ఐర్లాండ్‌లో భారత రాయబారి అఖిలేశ్ మిశ్రాను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆయన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండీ తమపై ఓ సంపాదకీయంలో రాజకీయ విమర్శలు చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. ‘భారత ప్రభుత్వాన్ని ఆయన సమర్థించడం వరకూ సరే. కానీ రాయబారిగా ఉంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. సర్వీసు నియమాలను ఉల్లంఘించారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News April 17, 2024

యువత కోహ్లీలా ఆలోచిస్తున్నారు: రాజన్

image

భారత యువ వ్యాపారవేత్తలు సింగపూర్, సిలికాన్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టడంపై RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో యువత కోహ్లీ మెంటాలిటీ కలిగి ఉంది. తామెవరికంటే తక్కువ కాదనే మనస్తత్వంతో ఉంది. ప్రపంచ మార్కెట్లో రాణించాలనే ఆలోచనతో యువ వ్యాపారవేత్తలు విదేశాలకు వెళ్లి అక్కడ బిజినెస్ పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వారు ఇండియాలో సంతోషంగా లేరు’ అని రాజన్ చెప్పుకొచ్చారు.

News April 17, 2024

వైసీపీవి నీచమైన డ్రామాలు: చంద్రబాబు

image

AP: YCP నీచమైన డ్రామాలు ఆడుతోందని TDP చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ‘సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. టీడీపీ నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అధికారులు వైసీపీ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఒక వేళ వారికి లొంగి తప్పుడు కేసులు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాం’ అని ఆయన హెచ్చరించారు.

News April 17, 2024

అభ్యర్థులకు బీ-ఫారాలు ఇచ్చిన పవన్

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులకు జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి ఆఫీస్‌లో బీ-ఫారాలు అందజేశారు. 20 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులకు పవన్ వీటిని అందించగా.. పాలకొండ అభ్యర్థి రావడం ఆలస్యం కావడంతో తర్వాత ఇవ్వనున్నారు. నాదెండ్ల మనోహర్‌కు పవన్ తొలి బీ-ఫారాన్ని అందించారు.

News April 17, 2024

KKR కెప్టెన్‌కు జరిమానా

image

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై BCCI వేటు వేసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షలు జరిమానా విధించింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా సారథి శ్రేయస్ తమ బౌలర్లతో నిర్ణీత సమయంలో బౌలింగ్ పూర్తి చేయించలేకపోయారు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన KKR.. నరైన్(109) సెంచరీ చేయడంతో 223 రన్స్ చేసింది. అయితే.. ఛేదనలో బట్లర్(107) మెరుపులతో చివరి బంతికి రాజస్థాన్ గెలిచింది.

News April 17, 2024

బీసీ బిడ్డను ఇరికించేందుకు జగన్ కుట్ర: అచ్చెనాయుడు

image

AP: సీఎం జగన్‌పై దాడి ఘటనలో బీసీ బిడ్డ సతీశ్‌ను ఇరికించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెనాయుడు దుయ్యబట్టారు. ‘కత్తి డ్రామాలో ఎస్సీ బిడ్డను ఐదేళ్లు జైలు పాలు చేశారు. జగన్‌పై దాడికి టీడీపీకి సంబంధమేమిటి? కత్తి డ్రామా సమయంలో అధికారంలో ఉన్నవారే బాధ్యత వహించాలన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న మీరే బాధ్యత వహించాలి’ అని డిమాండ్ చేశారు.

News April 17, 2024

నా ఫోన్ కూడా ట్యాప్ అయింది: తమిళిసై

image

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనం సృష్టిస్తుండగా మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని ఆరోపించారు. ‘ఫోన్ ట్యాపింగ్ అంశంపై 2022 నవంబర్‌లోనే నేను స్పందించా. రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నానంటూ గత ప్రభుత్వం నా ప్రకటనలను తోసిపుచ్చింది. గతంలో నేను చెప్పిందే ఇప్పుడు నిజమవుతోంది’ అని తమిళిసై ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News April 17, 2024

కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దృశ్యాలు చూడలేదు: హరీశ్

image

TG: కాంగ్రెస్ పాలనలో మళ్లీ నీటి కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘రాష్ట్రం గొంతెండిపోతుంది. నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దృశ్యాలు ఎప్పుడూ చూడలేదు. బీఆర్ఎస్ హయాంలో తండాల్లోనూ మిషన్ భగీరథ నీరు వచ్చేది. కాంగ్రెస్ పాలనలో పంటలకు ఎలాగూ నీరు ఇవ్వలేదు. కనీసం ప్రజలకు మంచినీళ్లైనా ఇవ్వండి’ అని కోరారు.

News April 17, 2024

ఇది ఎంతో భావోద్వేగమైన క్షణం: మోదీ

image

అయోధ్యలో బాలరాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడిన క్షణం కోట్లాదిమంది భారతీయులతోపాటు తనకెంతో భావోద్వేగమైనది PM మోదీ అన్నారు. అస్సాం నల్బరిలో ర్యాలీ అనంతరం ఆయన ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ ట్యాబ్‌లో ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించి, బాలరాముడిని దర్శించుకున్నారు. ‘అయోధ్యలో రామనవమి ఘనంగా జరగడం చరిత్రాత్మకం. ఈ సూర్యతిలకం మన జీవితాలకు శక్తిని, దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరేలా స్ఫూర్తినిస్తుంది’ అని PM తెలిపారు.