News January 23, 2025

అనిల్ రావిపూడి @100% స్ట్రైక్ రేట్‌

image

డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నట్లు SVC ట్వీట్ చేసింది. ‘దశాబ్దకాలంగా బ్లాక్ బస్టర్స్ అందిస్తూ, ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తోన్న హిట్ మెషీన్ అనిల్‌కు అభినందనలు. డబుల్ హ్యాట్రిక్ సాధించడంలో మీతో భాగమైనందుకు గర్విస్తున్నాం’ అని తెలిపింది. అనిల్ తన కెరీర్‌లో పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీశారు.

News January 23, 2025

మెట్రోలో ఇన్ని వస్తువులు మర్చిపోయారా?

image

అసాంఘిక కార్యకలాపాలతో వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రో రైలులో గతేడాది కోట్ల రూపాయల వస్తువులను విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు. రైలులో & స్టేషన్ ఏరియాలోని ఎక్స్ రే లగేజీ స్కానర్ వద్ద మర్చిపోయిన వాటిల్లో రూ.40 లక్షలకు పైగా నగదు, 89 ల్యాప్‌టాప్స్, 193 మొబైల్స్‌తో పాటు 9 మంగళసూత్రాలు, వెండి ఆభరణాలు, ఉంగరాలున్నాయి. అయితే, CISF సిబ్బంది ద్వారా వీటి యజమానులను గుర్తించినట్లు వెల్లడించారు.

News January 23, 2025

దశాబ్దాల తర్వాత బంగ్లాకు ISI చీఫ్.. టార్గెట్ భారత్!

image

ISI చీఫ్ LT GEN ఆసిమ్ మాలిక్ బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ చీఫ్ అక్కడికి రావడం గమనార్హం. మంగళవారం దుబాయ్ నుంచి ఢాకా చేరుకున్న ఆయన్ను బంగ్లా ఆర్మీ QMG LT GEN మహ్మద్ ఫైజుర్ రెహ్మాన్ రిసీవ్ చేసుకున్నారు. రెహ్మాన్‌కు పాకిస్థాన్, ఇస్లామిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. తూర్పు సరిహద్దు వద్ద భారత్‌ను ఇబ్బంది పెట్టడమే ఈ మీటింగ్ ఉద్దేశంగా తెలుస్తోంది.

News January 23, 2025

ఈ క్రికెటర్‌తో మాట్లాడాలంటే కుర్చీ వేసుకోవాల్సిందే..

image

SA20 లీగ్ సందర్భంగా సౌతాఫ్రికా పేసర్ మార్కో జాన్సన్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు కామెంటేటర్లు కుర్చీ వేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్కో హైట్ 6.9 అడుగులు. జట్టులో మిగతా సభ్యులంతా మార్కో ముందు చిన్నపిల్లల్లా కనిపిస్తారు. గతంలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా, మార్కో పక్కపక్కన ఉన్న ఫొటో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే.

News January 23, 2025

బేబీ బంప్‌తో టాలీవుడ్ హీరోయిన్ సెమీ న్యూడ్ ఫొటో

image

రెండోసారి తల్లి కాబోతున్న నటి అమీ జాక్సన్ ఇన్‌స్టాలో బేబీ బంప్ ఫొటోలు షేర్ చేశారు. పూల్ ముందు ఇన్నర్ వేర్ ఫొటోకు ‘దీన్నిప్పుడు స్కిన్నీ డిప్పింగ్ (నగ్నంగా ఈదడం) అనలేము’ అని కామెంట్ చేశారు. అయితే ఇలా కాకుండా మామూలుగా కూడా ప్రెగ్నెన్సీ అనుభూతులు పంచుకోవచ్చని విమర్శిస్తూ పలువురు కామెంట్ చేశారు.
NOTE: మా ఎడిటోరియల్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ తరహా ఫొటో ఇక్కడ పోస్ట్ చేయలేము. <>అమీ ప్రొఫైల్‌లో<<>> చూడవచ్చు.

News January 23, 2025

3 రన్స్‌కే రోహిత్ ఔట్

image

జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నిరాశపరిచారు. ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు 19 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేసి ఉమర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యారు. ఇటీవల BGTలో పేలవ ఫామ్ కనబర్చిన రోహిత్ రంజీ తొలి ఇన్నింగ్స్‌లోనూ తేలిపోవడంతో అతడి అభిమానులు హర్ట్ అవుతున్నారు. మరోవైపు యశస్వీ(4) కూడా నిరాశపరిచారు.

News January 23, 2025

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ

image

హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ను విస్తరించనున్నట్లు విప్రో సంస్థ ప్రకటించింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని గోపనపల్లిలో కొత్త ఐటీ సెంటర్‌ను నెలకొల్పుతామని దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా అదనంగా 5000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. HYDలో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి అని, క్యాంపస్ విస్తరణతో సాంకేతిక రంగం మరింత వృద్ధి చెందుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

News January 23, 2025

లోకేశ్‌కు చిరు విషెస్

image

ఏపీ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’ అని చిరు పేర్కొన్నారు.

News January 23, 2025

Stock Markets: ఐటీ షేర్ల దూకుడు

image

మోస్తరు నష్టాల్లో మొదలైన స్టాక్‌మార్కెట్లు ప్రస్తుతం రేంజుబౌండ్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,156 (-2), సెన్సెక్స్ 76,448 (48) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ, మీడియా, ఫార్మా, ఆటో షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. FMCG, ఫైనాన్స్, బ్యాంకు, మెటల్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. విప్రో, అల్ట్రాటెక్, ట్రెంట్, M&M, టెక్M టాప్ గెయినర్స్. HUL, యాక్సిస్ బ్యాంకు, నెస్లేఇండియా, ఎస్బీఐ, BPCL టాప్ లూజర్స్.

News January 23, 2025

బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ శర్మ

image

చాలాకాలం తర్వాత రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. J&Kతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ఆయన ముంబై తరఫున బరిలోకి దిగారు. కెప్టెన్ రహానే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో యశస్వీతో కలిసి రోహిత్ ఓపెనింగ్‌కు వచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫామ్ లేమితో ఇబ్బందిపడ్డ హిట్ మ్యాన్ ఈ ట్రోఫీలో ఏమేరకు రాణిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. కాగా రోహిత్ చివరిసారి 2015లో రంజీ మ్యాచ్ ఆడారు.