India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం నీటిమట్టం 849 అడుగులకు చేరింది. నిన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గేట్లను కృష్ణా జలాలు తాకాయి. మరో రెండు రోజుల్లో శ్రీశైలం డ్యాం నీటిమట్టం 854 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో 5 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందాయి. దీంతో గాలేరు-నగరి, తెలుగు గంగ, కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానెళ్లకు నీరు విడుదల చేసే అవకాశముంది.
AP: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్ తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 26న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం 29న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆర్డినెన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎలక్షన్స్ ముందు గత ప్రభుత్వం 4 నెలలకు ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, అది జులైతో ముగియనుంది. దీంతో మరో 3 నెలలకు కొత్త ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది.
టెలికాం నెట్‌వర్క్‌లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA)లపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 15% నుంచి 20%కి పెంచింది. PCBAలలో దాదాపు 80% విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఫలితంగా టెలికాం ఆపరేటర్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడంతో ఆ భారాన్ని కస్టమర్లపై మోపే అవకాశం ఉంది. 5G విస్తరణ వేగం కూడా మందగించొచ్చు. వైఫై రౌటర్ల ధరలు కూడా పెరగవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ నిర్మాణంపై తీర్మానం చేయనున్నట్లు సమాచారం. దీనితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించే అవకాశముంది. పోలవరం డయాఫ్రం వాల్‌కు సంబంధించి క్యాబినెట్ తీర్మానం కావాలని కేంద్రం కోరడంతో నేడు అత్యవసరంగా మంత్రివర్గ భేటీ నిర్వహిస్తున్నారు.
TG: తుమ్మడిహట్టిపై బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో స్పష్టం చేశారు. 3, 4 నెలల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అక్కడ ప్రాజెక్టు కడితే పుష్కలంగా నీళ్లు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో అత్యధిక భాగం వ్యవసాయ శాఖకే కేటాయించనున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీకి ₹30వేల కోట్లు, రైతు భరోసాకు ₹15వేల కోట్లతో కలిపి ఆ మొత్తం దాదాపు ₹50వేల కోట్లు ఉండొచ్చు. సంక్షేమ శాఖలకు ₹40వేల కోట్లు, సాగునీటిపారుదలకు ₹29వేల కోట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక విద్యుత్ శాఖ, వైద్య శాఖలకు చెరో ₹15వేల కోట్లు, గృహనిర్మాణ శాఖకు ₹8వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.
TG: FY25కిగాను రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం గం.9కి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదం పొందుతుంది. అనంతరం డిప్యూటీ CM, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. బడ్జెట్ వ్యయం ₹2.80లక్షల కోట్ల నుంచి ₹2.90లక్షల కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.
డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నామినేటైన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తన తొలి ప్రచారసభలో ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ట్రంప్ బిలియనీర్లపై ఆధారపడుతున్నారని, వారితో బేరసారాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. తన ప్రచారానికి విరాళాలు ఇచ్చిన వారికి చమురు కంపెనీలు ఇస్తానని ఆయన హామీ ఇస్తున్నట్లు ఆరోపించారు. తాము ప్రజాశక్తితో పనిచేస్తున్నామని, ప్రజా ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
ఇండెక్సేషన్ బెనిఫిట్ తొలగింపుతో స్థిరాస్తి అమ్మకాలకు నష్టమేమి లేదని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. ‘స్థిరాస్తి అమ్మకాలపై LTCG ట్యాక్స్‌ను 20% నుంచి 12.5%కు తగ్గించాం. విక్రేతలకు రోలోవర్ బెనిఫిట్ ఉంటుంది. అమ్మకంతో వచ్చిన నగదును మరో ప్రాపర్టీ కొనుగోలుకు వెచ్చిస్తే ₹కోటి వరకు ఎలాంటి LTCG ట్యాక్స్ ఉండదు. 2001కు ముందు కొన్న స్థిరాస్తులకు ఇండెక్సేషన్ బెనిఫిట్ కొనసాగుతుంది’ అని తెలిపారు.
రైలు ప్రమాదాల నివారణకు డిజైన్ చేసిన ‘కవచ్’ కోసం FY25లో ₹1,112.57 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘ఇప్పటివరకు కవచ్‌పై ₹1,216.77Cr ఖర్చు చేశాం. దక్షిణ మధ్య రైల్వేలో ‘కవచ్’కు సంబంధించిన RFID ట్యాగ్‌లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ అమరికలు 1,465 రూట్ Kmలో 144 ఇంజిన్లలో పూర్తయ్యాయి. మరో 6000 Km మేర కవచ్‌ను తెచ్చేందుకు DPR రూపొందింది’ అని పార్లమెంటులో బుధవారం తెలిపారు.
Sorry, no posts matched your criteria.