India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) CGLE-2024 దరఖాస్తు గడువు ఈ నెల 24 (రేపు) రాత్రి 11 గంటలతో ముగియనుంది. మొత్తం 17,727 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డివిజన్ అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, సబ్ ఇన్‌స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఉన్నాయి. వయసు పోస్టులను బట్టి 18 నుంచి 30 ఏళ్లు. <
2024-25 బడ్జెట్‌పై ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఎగ్జెంప్షన్స్, డిడక్షన్‌ల పరిమితులను పెంచుతారని భావిస్తున్నారు. ప్రస్తుతం సెక్షన్ 80 C మినహాయింపుల కింద లిమిట్ రూ.1.50 లక్షలుగా ఉంది. దీన్ని రూ.3 లక్షలకు పెంచుతారని అంచనా. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలు ఉండగా రూ.లక్షకు పెంచుతారని భావిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ ముంగిట స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఉదయం 9.25గంటల సమయంలో సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 80,557 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 14 పాయింట్ల లాభపడి 24,524 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.64 వద్ద ప్రారంభమైంది.
AP: రుణ రక్కసికి మరో ప్రాణం బలైంది. కృష్ణా జిల్లా మంటాడకు చెందిన పేటేటి స్రవంతి(28)కి రూ.5లక్షల రుణమిస్తామంటూ ఓ మెసేజ్ వచ్చింది. ఆ నంబర్‌కు కాల్ చేయగా ముందుగా డబ్బు కట్టాలని వారు సూచించారు. అప్పు చేసి మరీ రూ.లక్ష కట్టాక తాను మోసపోయానని ఆమె గుర్తించారు. ‘బావా తప్పు చేశాను’ అంటూ భర్తకు సెల్ఫీ వీడియో పంపించి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు(6, 4ఏళ్లు) పసితనంలోనే తల్లిలేనివారయ్యారు.
AP: ‘రెడ్‌బుక్ పేరుతో ఎంత కాలం ఈ రావణ దహనం?’ అంటూ నారా లోకేశ్‌ను విజయసాయిరెడ్డి Xలో ప్రశ్నించారు. ‘TDP వాళ్లు YCP వాళ్లను హతమారుస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా, హంతకులు కూడా YCP వాళ్లే అని అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారు. ఏ పార్టీ వాళ్లైనా హత్యలను ఎలా సమర్థిస్తారు? టీడీపీ హత్యారాజకీయాలతో ప్రజలే కాదు, పోలీస్ యంత్రాంగం కూడా బెంబేలెత్తిపోతోంది’ అని ట్వీట్ చేశారు.
అందరూ ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను మరి కాసేపట్లో NDA సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ సామాన్యులకు వరంగా ఉంటుందనే అంచనాలున్నాయి. పన్నుల్లో మినహాయింపు కల్పిస్తే ధరలు తగ్గడంతో పాటు ఉద్యోగులకు, వ్యాపారులకూ ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు TDS తగ్గి టేక్ హోమ్ శాలరీ పెరగొచ్చు. బంగారంపై ఇంపోర్ట్ డ్యూటీని తగ్గిస్తే బంగారు ఆభరణాల ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
టీమ్‌ఇండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేసే అవకాశముంది. దీనిపై ఆయనతో RR యాజమాన్యం సంప్రదింపులు జరిపినట్లు TOI పేర్కొంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలిపింది. ద్రవిడ్ గతంలో RRకు కెప్టెన్‌గా(2012, 2013), మెంటార్‌గా (2014, 2015) సేవలు అందించారు. ద్రవిడ్ కోచ్‌గా వస్తే టీమ్ డైరెక్టర్‌గా ఉన్న సంగక్కరను కొనసాగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఎన్డీయే సర్కారులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి నిధులు, పోలవరం, రైల్వే ప్రాజెక్టులు, విజయవాడ-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తుందని భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు నివేదికలు సమర్పించారు. మరి ఏపీకి కేంద్రం ఏమిస్తుందో కాసేపట్లో తేలనుంది.
జియో, Airtel రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంతో చాలా మంది BSNL వైపు చూస్తున్నారు. కానీ అందులో 4G లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికి BSNL శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో 4G సేవలు ప్రారంభం అవుతాయని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే 1,000 టవర్లు ఏర్పాటు చేశామని పేర్కొంది. 4G, 5G కోసం మొత్తం 1.12 లక్షల టవర్లు ఇన్‌స్టాల్ చేయడం తమ లక్ష్యమని, ఇప్పటివరకు 12,000 టవర్లను ఏర్పాటు చేశామని తెలిపింది.
జికా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పుణేలో 27కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అరుదైన మెదడు పొరల వాపు సమస్యను వైరస్ సోకిన ఒకరిలో గుర్తించారు. మనదేశంలో జికా ఇన్‌ఫెక్షన్‌తో ఈ సమస్య తలెత్తటం ఇదే తొలిసారి. ఇది సోకిన గర్భిణులకు పుట్టే శిశువుల్లో మెదడు ఎదుగుదల తీవ్రంగా దెబ్బతింటోంది. పిల్లలు చిన్న తలతో పుడుతున్నారు. ఇది దోమల ద్వారా వ్యాపిస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.