India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాద ఘటనతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని YCP మండిపడింది. ‘హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇది. కలెక్టర్, CCL ఆఫీసుల్లో, ఆన్‌లైన్‌లోనూ ఆ రికార్డులుంటాయి. YCP నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం, రషీద్ హత్య జరిగినప్పుడు DGPని ఇలాగే హెలికాప్టర్‌లో పంపి ఉంటే బాగుండేది’ అని ట్వీట్ చేసింది.
దేశంలో ఊబకాయం ఆందోళనకరంగా మారిందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అత్యధిక షుగర్, కొవ్వులతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారం తినడంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దేశంలో 54% అనారోగ్య సమస్యలకు ఈ ఆహారపు అలవాట్లే కారణమంది. అత్యధికంగా ఢిల్లీలో 41.3% మహిళలు, 38% పురుషులు, TNలో 37% పురుషులు, 40.4% మహిళలు, APలో 36.3% మహిళలు, 31.1% పురుషులను ఒబెసిటీ వెంటాడుతోందని తెలిపింది. దీనికి పరిష్కారం చూపాలని సూచించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లిలో భారీ వర్షాలు కురుస్తాయని YELLOW అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఎలాంటి అలర్ట్ ఇవ్వలేదు.
TG: మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కలెక్టర్లు, ఇతర శాఖల ఉన్నత అధికారులతో సీఎస్ శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి వరద పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించడమే తన లక్ష్యమని అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ అన్నారు. తన అభ్యర్థిత్వానికి బైడెన్ మద్దతు పలకడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. డెమోక్రాట్ల మద్దతు కూడగట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కమలా హారిస్ అభ్యర్థిత్వానికి ఆయన మద్దతు పలికారు.
TG: ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతి నెలా రూ.25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
TG: తెలంగాణ భవన్‌లో BRS ఎమ్మెల్యేలు, MLCలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. బడ్జెట్ <<13683632>>సమావేశాల్లో<<>> అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు, శాంతి భద్రతల నిర్వహణ వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్య, ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో చర్చించాలని BRS రేపటి సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరనుంది.
AP అసెంబ్లీలో జనసేన డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా మంత్రి నాదెండ్ల మనోహర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు. ఇక పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల MLA లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం MLA పులివర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌లను నియమించారు.
AP: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై అనుమానాలు ఉన్నాయని DGP తిరుమలరావు తెలిపారు. ‘ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్. ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశమే లేదు. ప్రమాదంపై SP, DSPలకు CI చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోంది. RDO కూడా కలెక్టర్‌కు చెప్పలేదు. కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. కీలక రికార్డులున్న విభాగంలో ప్రమాదం జరిగింది. మరింత లోతుగా విచారిస్తున్నాం’ అని తెలిపారు.
AP: రేపు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.