India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బిహార్‌కు చెందిన ముకేశ్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న BJP, RSSలపై పోరాడుతున్నాం’ అని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యానన్నాడు. దీంతో చేతిలో ఉన్న పాల డబ్బా కిందపడిందని.. 5 లీటర్ల పాలు నేలపాలయ్యాయని చెప్పాడు. రూ.250 నష్టం జరిగిందంటూ ఈ ఘటనకు కారణమైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు.

తెలంగాణలో జనవరి 28న మైనార్టీ స్కూళ్లకు సెలవు ఉండనుంది. ముస్లిం క్యాలెండర్ ప్రకారం ఆ రోజు ‘షబ్ ఎ మెరజ్’ కావడంతో ప్రభుత్వం ఇప్పటికే ఆప్షనల్ హాలిడే ప్రకటించింది. దీంతో మైనార్టీ విద్యాసంస్థలు ఈ సెలవును ఇవ్వనుండగా మిగతా స్కూళ్లు క్లాసుల నిర్వహణ లేదా హాలిడేపై సొంతంగా నిర్ణయం తీసుకోనున్నాయి.

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ సినిమా థర్డ్ సింగిల్‌పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ‘హైలెస్సో.. హైలెస్సా’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ సాంగ్‌ను మెలోడీ క్వీన్ శ్రేయా ఘోషల్, అజిజ్ నకాశ్ పాడగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. కాగా, వచ్చే నెల 7న ‘తండేల్’ విడుదల కానుంది.

AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

ఫేక్ బ్యాంక్ కాల్స్ వల్ల మోసపోతున్న వారిని రక్షించేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు లావాదేవీలు & మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెండు ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్‌లను ప్రవేశపెట్టింది. నంబర్ ‘1600’తో ప్రారంభమైతే బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన కాల్, ‘140’ సిరీస్‌తో వస్తే అది మార్కెటింగ్ కాల్ అని తెలిపింది. వీటి నుంచి కాల్స్/ మెసేజ్‌లు వస్తే బ్యాంకు పంపిందని అర్థం.

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడుతున్నారు. దీంతో MCA (ముంబై క్రికెట్ అసోసియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై-జమ్మూకశ్మీర్ మ్యాచ్ జరిగే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. హిట్‌మ్యాన్ ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారని, ఇందుకు తగినట్లుగా సీట్లు ఏర్పాటు చేయాలని భావించింది.

WHO నుంచి <<15210852>>తప్పుకుంటున్నట్లు<<>> ట్రంప్ ప్రకటించడంపై ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ స్పందించారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. కోట్లాది మంది ఆరోగ్యం కోసం WHO, USA కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా 1.4 బిలియన్ల జనాభా ఉన్న చైనా WHOకు 39 మిలియన్ డాలర్లు చెల్లిస్తుంటే తాము 500 మి.డా. చెల్లిస్తున్నామని ట్రంప్ అంతకుముందు చెప్పారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేస్తోంది. దీనిపై ఆయన భార్య తేజస్విని స్పందించారు. ‘సినిమా నిర్మాణాలకు సంబంధించే మా ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉన్న పలు రికార్డులు పరిశీలించారు. ఐటీ అధికారులకు బ్యాంకు వివరాలు ఇచ్చాం. బ్యాంకు లాకర్లను కూడా ఓపెన్ చేసి చూపించాం. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు.

AP: మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరూ స్పందించవద్దని జనసైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది. మీడియా ముందు కానీ, సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరూ మాట్లాడవద్దని సూచించింది. కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్ఠానం కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఎవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది.

TG: హైదరాబాద్ జలసౌధలో జరిగిన KRMB (కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) సమావేశం ముగిసింది. ఇందులో ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా, బడ్జెట్ కేటాయింపు, బోర్డు నిర్వహణ, టెలి మెట్రిక్ స్టేషన్ల ఏర్పాటుపై చర్చించారు. ఈ భేటీలో బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్‌తోపాటు TG నీటిపారుదలశాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్ కుమార్, AP ENC వెంకటేశ్వరరావు, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.