News July 21, 2024

మంచు విష్ణుకు గోల్డెన్ వీసా

image

సినీనటుడు మంచు విష్ణుకు UAE గోల్డెన్ వీసా అందించింది. కళలు, సాహిత్యం, విద్య, పరిశ్రమలు, కల్చర్ వంటి రంగాల్లో అధ్యయనం చేసేవారికి ఈ వీసాను యూఏఈ జారీ చేస్తుంది. దీని ద్వారా దుబాయ్‌లో ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా ఉండేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజనీకాంత్, దుల్కర్ సల్మాన్, మోహన్‌లాల్, చిరంజీవి, అల్లు అర్జున్, త్రిష, అమలాపాల్, మౌనీ రాయ్ తదితరులకు ఈ వీసా లభించింది.

News July 21, 2024

IOAకు BCCI భారీ ఆర్థిక సాయం

image

భారత ఒలింపిక్ అసోసియేషన్‌( IOA)కు బీసీసీఐ భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. IOAకు రూ.8.50 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. భారత అథ్లెట్లకు బీసీసీఐ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. దేశం గర్వపడేలా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని క్రీడాకారులను కోరారు.

News July 21, 2024

ఎక్కువగా తినేసి చనిపోయిన ఇన్‌ఫ్లుయెన్సర్!

image

ఈటింగ్ ఛాలెంజ్ ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాణాలు తీసింది. చైనాకు చెందిన పాన్ జియోటింగ్(24) లైవ్ టెలికాస్ట్‌లో ఫుడ్ తింటూ చనిపోయారు. ఈమె ఇలాంటి వీడియోలు చేయడంలో ప్రసిద్ధి. ప్రతిసారి 10 కిలోల కంటే ఎక్కువ ఆహారాన్నే తినేదట. ఇటీవల నిర్వహించిన ఛాలెంజ్‌లో 10గంటల కంటే ఎక్కువ సేపు తిన్న ఆమె కుప్పకూలారు. జీర్ణించుకోలేని స్థాయిలో ఆహారం తినడంతోనే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

News July 21, 2024

యూఎస్ వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న హిట్‌మ్యాన్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ యూఎస్ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతో కలిసి ఆయన అక్కడ పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను హిట్‌మ్యాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా వచ్చే నెల 2 నుంచి శ్రీలంకతో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆ సిరీస్‌లో ఆడేందుకు రోహిత్ త్వరలోనే లంకకు వెళ్లనున్నారు.

News July 21, 2024

రోహిత్ శర్మ బయోపిక్.. హీరోగా ఎవరు సూట్ అవుతారు?

image

ఇండియాకు ప్రపంచకప్ అందించిన రోహిత్ శర్మపై బయోపిక్ వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2011 వన్డే WCలో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్.. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తాక వెనుదిరిగి చూడలేదు. అలవోకగా సిక్సర్లు, డబుల్ సెంచరీలు బాదుతూ హిట్‌మ్యాన్ అనిపించుకున్నారు. రోహిత్ బయోపిక్‌లో హీరోగా జూ.ఎన్టీఆర్ లేదా శర్వానంద్ సూట్ అవుతారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News July 21, 2024

మూడేళ్ల నుంచి సింగిల్‌గానే ఉన్నా: సీనియర్ హీరోయిన్

image

తాను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్‌లో లేనని, మూడేళ్ల నుంచి సింగిల్‌గానే ఉన్నట్లు సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ చెప్పారు. గతంలో ఐదేళ్ల పాటు ఒకరితో ప్రేమలో ఉన్నానని గుర్తు చేశారు. ఈ వయసులో హార్ట్ బ్రేక్స్ తీసుకోవాలని లేదని అందుకే ప్రేమకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. లవ్, మ్యారేజీపై తనకు ఆసక్తి లేదన్నారు. పర్సనల్ కేర్‌తో పాటు స్నేహితులు, కుటుంబసభ్యులతో సమయాన్ని వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 21, 2024

నిఫా వైరస్.. లక్షణాలు ఇవే!

image

కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుంది. ‘ఫ్రూట్ బ్యాట్స్’ అనే గబ్బిలాలు వాలిన పండ్లను తీసుకోవడం ద్వారా వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తుంది. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నిఫా సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచుతారు. ఇది కొవిడ్ కంటే డేంజర్.

News July 21, 2024

గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, హత్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డప్ప కారు దహనం, వైసీపీ నేతలపై దాడుల గురించి గవర్నర్‌కు వివరించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News July 21, 2024

కళ్లు కనిపించడం లేదని నటి ఆవేదన

image

లెన్స్ ధరించడం వల్ల కార్నియా దెబ్బతిని తన కళ్లు కనిపించడం లేదని హిందీ టెలివిజన్ నటి జాస్మిన్ భాసిన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, మరో నాలుగైదు రోజుల్లో కోలుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కనీసం నిద్ర పోవాలన్నా కళ్ల నొప్పి వేధిస్తోందని వాపోయారు. కాంటాక్ట్ లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

News July 21, 2024

ఏపీలో లా అండ్ ఆర్డర్ ఉందా?: అంబటి

image

AP: ముచ్చుమర్రి బాలిక హత్యాచారం ఘటనలో మృతదేహాన్ని ఇంకా ఎందుకు కనిపెట్టలేకపోయారో హోం మంత్రి అనిత సమాధానం చెప్పాలని YCP నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ‘ఈ కేసులో ఓ దళిత వ్యక్తి లాకప్ డెత్ అయ్యారు. దీనిపై దళిత సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పుంగనూరులో MP మిథున్ రెడ్డిపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగింది. APలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? YCP నేతలపై దాడులకు తెగబడుతున్నారు’ అని ఫైర్ అయ్యారు.