India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చివరి దశకు చేరింది. రేపటి నుంచి జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తిరిగి ప్రారంభించనుంది. మాజీ CM కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్(మాజీ ఆర్థిక మంత్రి)ను విచారణకు పిలిచే అవకాశముంది. ఇవాళ ఈ నేతలకు సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు, రిటైర్డ్ ఇంజినీర్లతో పాటు ఇతర అధికారులను ప్రశ్నించింది.

ఖో ఖో WCలో భారత మహిళల జట్టు విజయంలో తెలుగు వ్యక్తి ఇస్లావత్ నరేశ్ పాత్ర ఉంది. TGలోని పెద్దపల్లి(D) ధర్మారంలోని బంజరపల్లికి చెందిన నరేశ్ జట్టుకు సహాయ కోచ్‌గా ఉన్నారు. 1995లో క్రీడాకారుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన 2015లో కోచ్‌గా మారారు. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రాగా అంచెలంచెలుగా జాతీయ జట్టుకు సహాయ కోచ్‌గా ఎదిగారు. స్కిల్ అనలైజర్‌గా ఆటగాళ్ల తప్పులు, బలహీనతలను సరిచేయడంలో ఆయనదే ముఖ్య పాత్ర.

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. రానున్న రెండ్రోజులపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలిపారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా సాయం అందిస్తామని వెల్లడించారు. భూమి లేని నిరుపేదలకు ఖాతాల్లో ఏటా రూ.12వేలు జమచేస్తామని పేర్కొన్నారు.

TG: రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన ఆదివాసుల పండగ నాగోబా జాతర ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరగనుంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లో జరిగే ఈ జాతరకు వేదపండితులు, దేవదాయశాఖ అధికారులు మంత్రి కొండా సురేఖను కలిసి ఆహ్వానం పలికారు. ఈ జాతరకు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆదివాసులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.

పెద్దన్నగా పేరొందిన అమెరికా అధ్యక్షుడి జీతం పలు దేశాధినేతల కంటే తక్కువే. యూఎస్ అధ్యక్షుడి గౌరవ వేతనం ఏడాదికి రూ.4 లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3.46 కోట్లు. సింగపూర్ ప్రధాని జీతం ఏడాదికి సుమారు రూ.13.85 కోట్లు, హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలరీ రూ.6 కోట్లు, స్విట్జర్లాండ్ అధ్యక్షుడికి రూ.4.9 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా వారికి అదనపు భత్యాలు అందుతాయి.

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో ముగిశాయి. ఇవాళ భక్తులను ఎలాంటి టోకెన్లు లేకుండా స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో టీటీడీ అనుమతించనుంది. నేడు ప్రోటోకాల్ మినహా సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం, ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ రద్దు చేసింది. తిరిగి ఈ ఏడాది డిసెంబర్‌లో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి.

నటి పవిత్ర వచ్చాక తన జీవితం కాస్త మెరుగుపడిందని సినీ నటుడు నరేశ్ చెప్పారు. ఇప్పుడు లైఫ్ టైటానిక్ ఒడ్డుకు చేరినట్లుగా ఉందని తనదైన శైలిలో చమత్కరించారు. అర్థం చేసుకునే మనుషులు జీవితంలో ఉంటే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగిస్తామన్నారు.

విభజన శక్తులతో పోరాడేందుకు ఇండియా కూటమిలో చేరాలని తమిళగ వెట్రి కజగం చీఫ్, సినీ నటుడు విజయ్‌ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ సెల్వపెరుంతగై కోరారు. ఇటీవల ఓ సభలో దేశంలో విభజన శక్తులు ఉన్నాయని విజయ్ అన్నారు. అలాంటి శక్తులను నిర్మూలించి, దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు తమతో చేరాలని కాంగ్రెస్ చీఫ్ సూచించారు. అయితే రాహుల్‌పై విజయ్ కొంత నమ్మకం ఉంచాలని TN బీజేపీ చీఫ్ అన్నామలై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై BJP ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్థిక శాఖలో లంచం లేకుండా పనిచేయడం లేదని విమర్శించారు. ఇళ్ల దగ్గరే నేతలు కమిషన్లు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అత్యంత అసమర్థ, అవినీతి, సమన్వయం లేని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదని మండిపడ్డారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు, మూసీ పక్కన ఇళ్లు కూల్చే ప్రయత్నం చేసి ఇప్పుడు జవహర్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్నారని దుయ్యబట్టారు.
Sorry, no posts matched your criteria.