News July 20, 2024

నా నిర్బంధం చట్ట విరుద్ధం: అమృత్‌పాల్

image

తన నిర్బంధం చట్ట విరుద్ధమని ఖలిస్థానీ నేత, MP అమృత్‌పాల్ సింగ్ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏడాదిన్నరగా తనను జైల్లో ఉంచడం అన్యాయమని పేర్కొన్నారు. కాగా గతేడాది అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై తన అనుచరులతో కలిసి అమృత్ పాల్ దాడి చేశారు. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసి అస్సాంలోని దిబ్రుగఢ్ జైలులో ఉంచారు. జైల్లో నుంచే ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఖాడూర్ సాహిబ్ సెగ్మెంట్ నుంచి MPగా గెలుపొందారు.

News July 20, 2024

25న తెలంగాణ క్యాబినెట్ భేటీ

image

TG: ఈ నెల 25న రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగే ఈ భేటీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జులై 25న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

News July 20, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/Quiz4.jsp?id=326&langid=1&token={TOKEN}

News July 20, 2024

హైస్కూల్ టైమింగ్స్‌లో మార్పు

image

తెలంగాణలో ఉన్నత పాఠశాలల పని వేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. హైస్కూల్ వేళలు ఉ.9.30 నుంచి సా.4.45కి బదులుగా ఉ.9గంటల నుంచి సాయంత్రం 4.15 వరకు కొనసాగుతాయంది. సోమవారం నుంచి ఈ టైమింగ్స్ అమలవుతాయన్న ప్రభుత్వం.. ఎప్పటి వరకు అనేదానిపై స్పష్టతనివ్వలేదు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో, హైదరాబాద్‌, సికింద్రాబాద్ నగరాల్లో ఇప్పుడున్న టైమింగ్సే యథావిధిగా కొనసాగుతాయంది.

News July 20, 2024

శాంతిభద్రతలపై చంద్రబాబు దృష్టి సారించాలి: రామకృష్ణ

image

ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ పనులు ప్రారంభించాలన్నారు. ‘చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎంగా ఉన్నా APలో శాంతిభద్రతలపై ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. పుంగనూరులో MP మిథున్ రెడ్డి ఉన్న ఇంటికి వెళ్లి దాడి చేయడం సరికాదు. CBN వీటిని సరిదిద్దాలి. పోలీసులు గతంలో చేసిన పనులనే మళ్లీ చేస్తున్నారు’ అని విమర్శించారు.

News July 20, 2024

ఎల్లుండి శ్రీలంకకు టీమ్ ఇండియా?

image

వన్డే, టీ20 సిరీస్ కోసం ఈ నెల 22న టీమ్ ఇండియా శ్రీలంక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు గౌతమ్ గంభీర్‌కు అధికారికంగా కోచ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కాటేను భారత కోచింగ్ సిబ్బందిలోకి BCCI తీసుకోనున్నట్లు టాక్. ఫీల్డింగ్ కోచ్‌గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్‌ను మాత్రం ఎంపిక చేయలేదని, టి.దిలీప్‌నే కొనసాగించనుందని వార్తలు వస్తున్నాయి.

News July 20, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.350 తగ్గి రూ.67,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.380 తగ్గి రూ.73,970కి చేరింది. వెండి ధర కేజీ రూ.1,750 తగ్గడంతో ప్రస్తుతం రూ.96,000 పలుకుతోంది.

News July 20, 2024

కృష్ణానదికి వరద

image

కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు 64వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 35వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 29వేల క్యూసెక్కులు వస్తుండగా, విద్యుత్ ఉత్పత్తి కోసం 3వేల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 6వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

News July 20, 2024

కర్ణాటకలో సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్!

image

సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లపై సెస్ విధించేందుకు కర్ణాటక ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇటీవల కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల(సంక్షేమం) బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇందులో టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు, సినీ రంగంలో ఇతర ఆదాయ వనరులపై 1-2 శాతం సెస్ విధించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని ఆర్టిస్టుల సంక్షేమం కోసం వినియోగించనుంది.

News July 20, 2024

ప్రిలిమ్స్ పాసైతే రూ.లక్ష.. అర్హతలు ఇవే

image

*అభ్యర్థులు జనరల్ (EWS)/బీసీ/ఎస్సీ/ఎస్టీలై ఉండాలి.
*తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి.
*యూపీఎస్సీ ప్రిలిమినరీలో పాస్ కావాలి.
*వార్షిక కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు మాత్రమే ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థల శాశ్వత ఉద్యోగులు అనర్హులు
*ఒకసారి మాత్రమే ఈ ప్రోత్సాహం అందుతుంది.
>> ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ అని పేరు పెట్టి ఆర్థిక సాయం అందించనుంది.