India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విజయనగరం, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు శనివారం సెలవు ఉంటుందని కలెక్టర్లు ప్రకటించారు.
UPకి చెందిన బసంత్‌శర్మ రైల్వే ఉద్యోగం రీత్యా సిమ్లాలో ఉంటున్నారు. నొయిడాలోని తన ఇంటికి 3నెలల కరెంట్ బిల్లు రూ.4కోట్లు వచ్చింది. APR 9-JUL 18 మధ్య మొత్తం రూ.4,02,31,842.331 వచ్చిందని, JUL 24లోపు చెల్లించాలని మెసేజ్ రావడంతో బసంత్ షాకయ్యారు. ఆ ఇల్లు అద్దెకు ఇచ్చామని అధికారులకు చెప్పి విచారించారు. అది బిల్లింగ్‌లో పొరపాటు వల్ల వచ్చిందని ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్పాక బసంత్ ఊపిరి పీల్చుకున్నారు.
సూర్యకుమార్ యాదవ్ 29 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అతడి తండ్రితో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ‘భారత జట్టు ఎంపిక ప్రకటన వచ్చిన ప్రతిసారి మా నాన్న పేపర్ చూసేవారు. నా పేరు లేకపోయేసరికి నిరాశ చెందేవారు. ఏం పర్లేదులే అని చెప్పేవాడిని’ అని సూర్య గతంలో చెప్పారు. 30 ఏళ్లకు అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన సూర్య 32 ఏళ్ల వయసులో వరల్డ్ నం.1 బ్యాటర్ అయ్యారు. తాజాగా కెప్టెన్ అయ్యారు.
TG: గ్రూప్2 పరీక్ష వాయిదా పడ్డ విషయం తెలిసిందే. 2023 AUGలో జరగాల్సిన పరీక్షలు 2024 JAN, ఆ తర్వాత AUGకి వాయిదా పడ్డాయి. కాగా తాజా ఖాళీల ప్రకారం పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలనేది ఓ డిమాండ్. DSC, గ్రూప్2 పరీక్షల మధ్య వ్యవధి తక్కువుండటంతో గ్రూప్2 వాయిదా వేయాలని మరో డిమాండ్. NOVలో గ్రూప్3, DECలో గ్రూప్2 పెడితే ఈ 2 పరీక్షల సిలబస్ దాదాపు ఒకటే కావడంతో ప్రిపరేషన్ ఈజీ అవుతుందనేది అభ్యర్థుల వాదన.
వెస్టిండీస్ ఓపెనర్ క్రెగ్ బ్రాత్‌వైట్‌ది విచిత్ర పరిస్థితి. ఇప్పటివరకు ఆయన 91 టెస్టులు ఆడారు. కానీ ఒక్క T20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో 50కుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడి ఒక్క T20 కూడా ఆడని ఏకైక ప్లేయర్‌గా బ్రాత్‌వైట్ చరిత్ర సృష్టించారు. 2011 నుంచి ఆయన క్రికెట్ ఆడుతున్నా డొమెస్టిక్‌లోగానీ, అంతర్జాతీయంగాగానీ పొట్టి ఫార్మాట్‌లో బరిలోకి దిగలేదు.
పూరీలోని రత్న భాండాగార్‌లో సర్పాలు, విష కీటకాలు, రహస్య సొరంగ మార్గాలు లాంటివి ఏమీ లేవని సూపర్‌వైజరీ కమిటీ ఛైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ తెలిపారు. ఆలయం లోపల సొరంగ మార్గాలు ఏమైనా ఉంటే ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ చేస్తే తెలుస్తుందన్నారు. సంపదనంతా భద్రపరిచి సీల్ చేయించామని చెప్పారు. సంపద వివరాలు ఎక్కడా బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున వాటి వివరాలు వెల్లడించలేమని తెలిపారు.
కర్ణాటక: సంతబెన్నూర్‌లో పెట్రోల్ పంప్ వద్ద ఓ డెడ్‌బాడీ(సంతోశ్) ఉందనే సమాచారంతో దేవనగర పోలీసులు కుక్కతో అక్కడికి వెళ్లారు. అక్కడ్నుంచి వాసన చూస్తూ వర్షంలో 8KMలు పరిగెత్తి కుక్క ఓ ఇంటికి వెళ్లింది. కేకలు వినిపించడంతో పోలీసులు ఇంట్లోకి వెళ్లి భర్త(రంగస్వామి) చేతుల్లో చావబోతున్న మహిళ(రూప)ను కాపాడారు. రూపతో అక్రమ సంబంధం వల్లే సంతోశ్‌ను హతమార్చిన రంగస్వామి ఆమెనూ చంపబోయినట్లు విచారణలో తేలింది.
TG: పేపర్ లీక్ కారణంగా 2023లో నిర్వహించిన చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (CDPO), ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (EO) పోస్టుల పరీక్షలను రద్దు చేస్తున్నట్లు TGPSC ప్రకటించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ, సిట్ నివేదికల ఆధారంగా 2023 జనవరి 3, 8 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలను క్యాన్సిల్ చేస్తున్నామని తెలిపింది. త్వరలో కొత్త పరీక్షల తేదీలను ప్రకటిస్తామని వెబ్ నోట్ విడుదల చేసింది.
మహిళల ఆసియా కప్ T20 టోర్నీలో భాగంగా గ్రూప్-A తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్మృతి మంధాన(45), షఫాలీ వర్మ(40) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. దీప్తి శర్మ 3, రేణుకా, పూజా, శ్రేయాంకా రెండేసి వికెట్లు పడగొట్టారు.
టీమ్‌ఇండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలిసారి స్పందించారు. ‘నాపై అభిమానులు చూపిస్తున్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు. దేశం కోసం ఆడటమనేది ఓ ప్రత్యేకమైన ఫీలింగ్. దాన్ని నేను మాటల్లో వర్ణించలేను. కెప్టెన్‌గా కొత్త పాత్ర నాలో ఉత్సాహం నింపడంతో పాటు బాధ్యతను మరింత పెంచింది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. గాడ్ ఈజ్ గ్రేట్’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.