India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జపాన్‌లో ఓ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు స్పైసీ పొటాటో చిప్స్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటిని భారత్‌లో దొరికే భూట్ జోలోకియా అనే మిరపకాయతో తయారు చేస్తారు. అస్సాం, నాగాలాండ్, మణిపుర్‌లో లభించే ఈ మిర్చికి హాటెస్ట్ చిల్లీగా గిన్నిస్ రికార్డ్ ఉంది. ఈ చిప్స్‌ని 18 ఏళ్లలోపు వారు తినకూడదనే హెచ్చరిక ఉన్నప్పటికీ విద్యార్థులు తినడంతో మంటను తట్టుకోలేపోయారు. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు.
కోలీవుడ్ హీరో విక్రమ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాను ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ ట్రైబల్ లీడర్‌గా కనిపించనున్నారు.
విండోస్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్‌కు కారణమైన క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి డీబగ్ ఫిక్స్ చేసి సమస్య పరిష్కరించినట్లు పేర్కొంది. కాగా ప్రపంచవ్యాప్తంగా సిస్టమ్‌లు షట్‌డౌన్/రీస్టార్ట్ అయ్యాయి. దీంతో పలు రంగాల్లో వివిధ రకాల సేవలకు అంతరాయం కలిగింది. మిలియన్ల కొద్దీ యూజర్లు తీవ్ర అవస్థలు పడ్డారు.
<<13657021>>ముస్లిం చట్టాలు<<>> బాల్య వివాహాలను ప్రోత్సహిస్తున్నాయన్న అస్సాం CM హిమంత వ్యాఖ్యలను లక్నోకు చెందిన ఇమామ్ మౌలానా కొట్టిపారేశారు. ‘ఏ ముస్లిం ఆర్గనైజేషన్ బాల్య వివాహాలను ప్రోత్సహించదు. ఆడవాళ్లకు 18, మగవాళ్లకు 21ఏళ్లు పెళ్లి వయసుగా చట్టమే నిర్ణయించింది. షరియా చట్టం, ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ జాతీయ స్థాయిలో అమలులో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం లేదు’ అని అన్నారు.
ప్రతిసారిలాగే ఈ సారి కూడా టీమ్ ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. శ్రీలంకతో టీ20 సిరీస్‌కు అవకాశమిచ్చిన సెలక్టర్లు వన్డేలకు మాత్రం మొండిచేయి చూపారు. భారత్ చివరిసారిగా దక్షిణాఫ్రికాతో ఆడిన వన్డేలో శాంసన్ సెంచరీ చేశారు. అయినా ఆయనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదు. దూబే లేదా పరాగ్‌లలో ఎవరో ఒకరి స్థానంలో సంజూకు చోటివ్వాల్సిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
TG: త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘ఓవర్ ల్యాపింగ్ లేకుండా ఎగ్జామ్స్ నిర్వహిస్తాం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ఇందులో ఉ.10 నుంచి సా.5 వరకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ ఇస్తాం. ఇప్పటికే నిపుణులను ఎంపిక చేశాం’ అని భట్టి వివరించారు.
TGPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. DECలో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని కోరారు. అంతకుముందు సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో చర్చించిన భట్టి.. పరీక్ష వాయిదాపై సానుకూలంగా స్పందించారు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. త్వరలో వాయిదాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయం పూరీ సమీపంలో తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కళింగపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నంలో మొదటి నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ వినుకొండ చేరుకున్నారు. ఇటీవల హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తున్నారు. జగన్ రాక సందర్భంగా వినుకొండలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
AP: మాజీ సీఎం జగన్‌కు భద్రత తగ్గించారనే <<13659529>>ప్రచారాన్ని<<>> ప్రభుత్వం తప్పుబట్టింది. ఆయనకు జడ్ ప్లస్ కేటగిరీ స్థాయిలో భద్రత ఉన్నట్లు పోలీసుశాఖ వెల్లడించింది. జగన్‌కు కేటాయించిన వాహనం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని తెలిపింది. ఆయన వెంట వచ్చిన వాహనాలను నిలిపివేశామనే ప్రచారాన్ని కొట్టిపారేసింది. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని, జగన్ పరామర్శ కార్యక్రమానికి ఇబ్బందులు లేకుండా భద్రతా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.