News January 19, 2025

ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

image

TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.

News January 19, 2025

సైఫ్‌పై దాడిని అంగీకరించిన నిందితుడు

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది తానేనని <<15192921>>థానేలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి<<>> అంగీకరించాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడిని రెస్టారెంట్లో పనిచేసే మహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్‌గా గుర్తించారు. చత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి నిందితుడు కాదని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వివరాలను ఉ.9గంటలకు డీజీపీ ఆఫీసులో మీడియాకు వెల్లడిస్తామన్నారు.

News January 19, 2025

కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని ట్విస్ట్

image

కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ట్విస్ట్ ఇచ్చారు. విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు. తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడట్లేదని పేర్కొన్నారు. ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు. అవసరమైతే అమెరికా అండతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని హెచ్చరించారు.

News January 19, 2025

నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం నేటితో ముగియనుంది. పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించగా 6.82 లక్షల మంది భక్తులకు టీటీడీ టోకెన్లను జారీ చేసింది. మరోవైపు రేపు దర్శనం చేసుకునే వారికి ఎలాంటి టోకెన్లు ఇవ్వబోమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. సర్వదర్శనానికి సంబంధించి నేరుగా క్యూలైన్లలోకి అనుమతిస్తామని తెలిపింది. ప్రోటోకాల్ మినహా వీఐపీ దర్శనాలను రద్దు చేసింది.

News January 19, 2025

మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడంటే?

image

TG: సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే క్యాబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలలోపే ఇది జరుగుతుందని తెలిపారు. తాము చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో వెనుకబడ్డామని హైకమాండ్ మందలించినట్లు చెప్పారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి కేటాయింపులు చేస్తామని పేర్కొన్నారు.

News January 19, 2025

సైఫ్‌పై దాడి.. థానేలో నిందితుడి అరెస్ట్!

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన నిందితుడిని థానేలో ముంబై పోలీసులు అరెస్ట్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా అతడిని ఓ రెస్టారెంట్ సమీపంలో గుర్తించినట్లు తెలిపింది. సుమారు 100 మంది పోలీసులు ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వే స్టేషన్‌లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News January 19, 2025

‘కన్నప్ప’ స్టోరీ ఐడియా ఆయనదే: మంచు విష్ణు

image

‘కన్నప్ప’ సినిమా గురించి ఏడెనిమిదేళ్లుగా ప్లానింగ్‌లో ఉన్నట్లు హీరో మంచు విష్ణు చెప్పారు. బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు కుదిరిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ వంటి స్టార్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

News January 19, 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో నా ఫేవరెట్ టీమ్ పాక్: గవాస్కర్

image

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఫేవరెట్ టీమ్ పాకిస్తాన్ అని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చెప్పారు. స్వదేశంలో పాక్‌ను ఓడించడం అంత సులువు కాదని తెలిపారు. స్వదేశంలో ఆడటం ఆ జట్టుకు కలిసొస్తుందన్నారు. గత వరల్డ్‌కప్ ఫైనల్లో అతిథ్య భారత జట్టు ఓడినా టోర్నీ మొత్తం అదిరిపోయే ప్రదర్శన చేసిందని గుర్తు చేశారు. CTకి పాకిస్తాన్, యూఏఈ అతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

News January 19, 2025

నేటి నుంచి కొమురవెల్లి జాతర

image

TG: నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర మొదలవనుంది. 2 నెలల పాటు జరిగే ఈ జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం వరకు ఈ జాతర జరగనుంది. ఇవాళ తొలి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు బోనాలు, పట్నాలతో స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు.

News January 19, 2025

బిహార్‌లో కూటమిగా పోటీ: రాహుల్ గాంధీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. INDIA కూటమి ఐక్యతతో బీజేపీ, ఆరెస్సెస్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. అంతకుముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లోక్‌సభ ఎన్నికల వరకే కూటమి పరిమితమని పేర్కొనగా తాజాగా రాహుల్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.