India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రోబోలు యంత్రాలే. అయితేనేం..? వాటికి మాత్రం నవనవలాడే చర్మం, జీవకళ ఎందుకు ఉండొద్దు? ఈ ఆలోచనలతోనే జపాన్ సైంటిస్టులు సజీవ చర్మ కణజాలాన్ని రోబోలకు అతికించే విధానాన్ని రూపొందించారు. అందుకోసం మనిషి కణాలతో ముఖాన్ని, ముఖ కవళికల్ని సృష్టించారు. ఈ చర్మం అతికిస్తే రోబో నవ్వు సహా హావభావాలన్నీ అచ్చం మనిషిలానే ఉంటాయని తెలిపారు. మున్ముందు రక్తప్రసరణ, నాడీవ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో తనకి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య ఎంతో సపోర్ట్ ఇచ్చారని టీమ్ఇండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గుర్తుచేసుకున్నారు. ‘ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. కేవలం బంతిని చూసి బాదేసేయ్’ అని గ్రౌండ్‌లోకి వెళ్తుండగా హార్దిక్ చెప్పినట్లు ఆయన తెలిపారు. ‘ఏం పర్లేదు నేనున్నా. నువ్వు ఆడగలవు అనుకుంటే కొట్టేసేయ్’అని క్రీజులో ఉన్నపుడు కోహ్లీ తనలో ధైర్యం నింపినట్లు చెప్పారు. అక్షర్ 47 రన్స్ చేశారు.
AP: పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు. వారిని భార్య తిట్టనివ్వడం లేదు. దీంతో విసుగొచ్చిన ఆ తండ్రి, ఫ్యాన్‌కు చీర వేలాడదీసి మెడకు బిగించుకున్నారు. అల్లరి ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. పొరపాటున ఆ చీర మెడకు బిగుసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. వైజాగ్‌లోని కొత్తపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు చందన్(33) రైల్వే ఉద్యోగి అని, ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
TG: తనను హతమారుస్తామని SMSలు, ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముస్లింలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వేషం పెంచుకుందని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యూపీలో తనపై కాల్పులు జరిపిన దుండగులను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను అణచివేసే యత్నం చేస్తున్నారన్నారు.
కొత్తగా 20వేలమందికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. వరుసగా 6 త్రైమాసికాల్లో ఇన్ఫీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం భారీగా నియామకాల్ని చేపడతామని సంస్థ పేర్కొంది. తాజా పట్టభద్రుల కోసం ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికం చివరి నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య 3,15,332గా ఉంది.
TG: రుణమాఫీ అయిన రైతులకు మళ్లీ లోన్లు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. ఇప్పటికే లోన్ రెన్యూవల్ చేసుకున్న అన్నదాతల అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని సూచించారు. అందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)కు సంబంధించి డీసీసీబీలకు విడుదల చేసే మొత్తాన్ని ఒకట్రెండు రోజుల్లో ఆయా రైతుల ఖాతాల్లో వేయాలన్నారు.
తండ్రీకూతుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్టయిన యూట్యూబర్ <<13609135>>ప్రణీత్<<>> హన్మంతు గంజాయి తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌లో గంజాయి సేవించిన ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే అతనిపై ఐటీ, పోక్సో యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 79, 294 కింద కేసు నమోదు కాగా, తాజాగా నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-1985 కింద పలు సెక్షన్లను జోడించారు.
మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ప్రభాస్‌ను ఆయన నివాసంలో విష్ణు కలిశారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇటీవలె ‘కల్కి’ మూవీతో ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్నారు. కాగా కన్నప్ప మూవీ డిసెంబర్‌లో రానుంది.
TG: రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు SRSP ప్రాజెక్టులోకి 21 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 1,065 అడుగులుగా ఉంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 20వేలు, ఔట్ ఫ్లో 22,877 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 4.951 టీఎంసీలుగా ఉంది. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరగడంతో నీటి మట్టం 24 అడుగులకు చేరింది.
ఉమ్మడి తూ.గో జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో సుమారు 7వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమళ్లు నీటమునిగాయి. అటు కోనసీమ జిల్లాలోని రాజోలు, ముమ్మిడివరం, బాపట్ల జిల్లాలోని చీరాల, పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. పలు గ్రామాల మధ్య వాగులు పొంగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Sorry, no posts matched your criteria.