News April 13, 2024

26 ఏళ్లకే ఇండిపెండెంట్ MLAగా గెలిచాడు

image

రాజస్థాన్‌కు చెందిన రవీంద్ర సింగ్ భాటీ 26 ఏళ్లకే MLAగా గెలిచారు. షియో సెగ్మెంట్ నుంచి బలమైన BJP, కాంగ్రెస్ అభ్యర్థులను ఎదుర్కొని 4 వేల ఓట్ల తేడాతో నెగ్గారు. ప్రస్తుతం బార్మర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర MP అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. తాను చదివిన వర్సిటీలో కూడా ఆయన స్వతంత్రంగా పోటీచేసి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రవీంద్ర తన పదునైన ప్రసంగాలతో ప్రజాదరణ పొందుతున్నారు.

News April 13, 2024

ఎన్నికల్లో డబ్బిస్తే తీసుకోండి.. కానీ: జగన్

image

AP: నారా లోకేశ్ మాదిరి మంగళగిరి వైసీపీ అభ్యర్థి లావణ్య వద్ద డబ్బులు లేవని సీఎం జగన్ తెలిపారు. మంగళగిరిలో చేనేతలతో ముఖాముఖిలో ‘లోకేశ్ ఓటుకు రూ.6వేలు పంచుతాడు. డబ్బిస్తే తీసుకోండి.. వద్దనొద్దు. కానీ జూన్, జులైలో అమ్మఒడి, చేయూత, నేతన్న నేస్తం ఎవరు ఇస్తారో వారికే ఆలోచించి ఓటు వేయండి. ఎవరు ఉంటే మన పిల్లలకు నాణ్యమైన విద్య, ఉచితంగా వైద్యం అందుతుందో వారికే ఓటు వేయండి’ అని జగన్ కోరారు.

News April 13, 2024

పంత్‌కు జరిమానా విధించాల్సిందే: మాజీ ప్లేయర్

image

DC కెప్టెన్ రిషభ్ పంత్‌పై మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ అసహనం వ్యక్తం చేశారు. లక్నోతో మ్యాచులో అంపైర్లతో వాగ్వాదానికి దిగడం సరైంది కాదన్నారు. ఇషాంత్ బౌలింగ్‌లో బంతిని ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ప్రకటించడంతో పంత్ రివ్యూ కోరినట్లుగా సైగలు చేశారు. రివ్యూలో వైడ్ అని తేలగా.. తాను సమీక్ష కోరలేదని పంత్ వాదించారు. దీనిపై 4 నిమిషాల చర్చ అవసరం లేదని, ఇలాంటి ప్లేయర్లకు జరిమానా విధించాలని గిల్‌క్రిస్ట్ అన్నారు.

News April 13, 2024

ఓటమి గెలుపునకు పునాది

image

AP: ఇంటర్‌లో ఫెయిలైన పలువురు విద్యార్థులు మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడమే దీనికి పరిష్కార మార్గమనుకుని వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. అయితే ఒక పరీక్ష తప్పితే జీవితం మొత్తం ఓడినట్లు కాదనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఓటమినే గెలుపునకు పునాదిగా చేసుకుని ఉన్నతంగా ఎదగవచ్చని సూచిస్తున్నారు.

News April 13, 2024

ఇంటర్‌లో ఫెయిల్.. మరో విద్యార్థి ఆత్మహత్య

image

AP: ఇంటర్ ఫలితాలు <<13039614>>మరో<<>> ఇంట్లో విషాదాన్ని నింపాయి. నిన్న విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫెయిలవ్వడంతో పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన ఈర్ల మహేందర్ మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పరీక్షలే జీవితం కాదని.. వాటిలో ఫెయిలైనంత మాత్రాన జీవితాన్ని బలి చేసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు.

News April 13, 2024

చిన్న అడుగులతో పెద్ద మార్పు

image

చిన్న అడుగులే పెద్ద మార్పునకు దారితీస్తాయని పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా తెలిపారు. మీ జీవితాన్ని క్రమంగా మార్చుకోవడానికి ఇవి పాటించండి అంటూ ఆయన పలు సూచనలు చేశారు.
★ రోజుకు 10 నిమిషాలైనా వ్యాయామం చేయండి
★ ఒక పేజీ అయినా చదవండి
★ కనీసం 30 సెకన్లు ధ్యానం చేయండి
★ భోజనంలో ఒక్క ఆరోగ్యకరమైన పదార్థాన్నైనా చేర్చండి
★ రోజుకోసారి ఫోన్‌ చూసే సమయాన్ని తగ్గించండి
★ రోజూ 10 నిమిషాలు ముందుగా నిద్రలేవండి

News April 13, 2024

రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన?

image

TG: రేపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రానున్నారు. మూడు పెండింగ్ ఎంపీ స్థానాలను ఆయన ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నట్లు సమాచారం. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్, దీపాదాస్ మున్షితో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

News April 13, 2024

చరిత్ర సృష్టించిన ఢిల్లీ

image

ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై 160పరుగులకు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. నిన్నటి మ్యాచులో లక్నో నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు లక్నోపై పంజాబ్ ఛేదించిన 160 పరుగులు మాత్రమే అత్యధికం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్(159) ఉంది.

News April 13, 2024

కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ: కిషన్ రెడ్డి

image

TG: కాంగ్రెస్ అంటే వెన్నుపోటు పార్టీ అని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘గత పదేళ్లలో KCR కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుంది. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. రుణమాఫీ చేయలేదు. రైతుబంధు వేయలేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది’ అని ఆయన మండిపడ్డారు.

News April 13, 2024

తండ్రైన టాలీవుడ్ హీరో

image

హీరో మంచు మనోజ్ తండ్రి అయ్యారు. ఆయన భార్య భూమా మౌనిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంచు లక్ష్మి వెల్లడించారు. ‘మనోజ్, మౌనిక ఆడబిడ్డకు జన్మనివ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. తన అన్న ధైరవ్ ఆనందానికి అవధుల్లేవు. చిన్నారిని మేము ప్రేమగా ‘MM పులి’ అని పిలుస్తాం. ఆ కుటుంబానికి శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అని మంచు లక్ష్మి తెలిపారు.