India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.

BGTలో టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఆస్ట్రేలియా బౌలర్ బోలాండే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ‘కమిన్స్ అద్భుతంగా రాణించారని అందరూ అంటున్నారు. కానీ అతడు లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది పడ్డారు. బోలాండ్ టీంలోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టం. అతడు లేకుంటే భారత్ గెలిచేది’ అని చెప్పారు. కాగా హేజిల్‌వుడ్‌కు గాయం కావడంతో బోలాండ్ టీంలోకి వచ్చి 3 టెస్టుల్లో 21 వికెట్లు తీశారు.

AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.

సైఫ్ 1970లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించారు. పటౌడీ భారత క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. సైఫ్ 1991లో నటి అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. సారా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. 2012లో సైఫ్ కరీనా కపూర్‌ను పెళ్లాడారు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు. సైఫ్ ఆస్తి సుమారు రూ.1,200 కోట్లు ఉంటుంది.

ప్రైవేటు వెహికల్స్, లోకల్ ఛానల్స్‌లో అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. ఇటీవల కొత్త సినిమాలను పర్మిషన్ లేకుండా ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నష్టం వాటిల్లుతుందన్నారు.

ఏపీ మాజీ సీఎం జగన్ తన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లండన్‌లో డిగ్రీ పూర్తిచేసిన తన కూతురు వర్షారెడ్డికి అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ డియర్. ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజీ నుంచి మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మమ్మల్ని గర్వపడేలా చేశావు. నీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని రాసుకొచ్చారు. తన భార్య భారతి, కూతుళ్లు హర్షారెడ్డి, వర్షారెడ్డితో దిగిన ఈ ఫొటో వైరలవుతోంది.

TG: హైదరాబాద్ సమీపంలోని కోహెడలో ప్రపంచ స్థాయి మెగా వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. రూ.2వేల కోట్లతో 400 ఎకరాల్లో దీనిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌తో పాటు ఇతర వ్యవసాయ మార్కెట్లనూ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.

TG: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆరో తరగతిలో (2025-26) ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 23 స్కూళ్లలో 1,380 సీట్లను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 16లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
వెబ్‌సైట్: <

గీత కులాలకు మద్యం షాపులను కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా జాబితాలు సిద్ధమవగా వారం రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబరులో కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది. 2016లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వేని కులాల జనాభాకు ప్రామాణికంగా చేసి జిల్లాల వారీగా షాపులు కేటాయించనున్నారు. అత్యధికంగా చిత్తూరుకు షాపులు కేటాయించే అవకాశముంది.

యూపీకి చెందిన యోగా సాధకులు స్వామి శివానంద 100 ఏళ్లుగా ప్రతి కుంభమేళాకు హాజరవుతున్నారని ఆయన శిష్యులు చెబుతున్నారు. ఆధార్ ప్రకారం ఆయన వయసు 129 ఏళ్లు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 16వద్ద ఆయన క్యాంపు ఏర్పాటు చేశారు. రోజూ ఉదయం యోగా చేస్తుండగా ఆయన కోసం భక్తులు క్యూ కడుతున్నారు. ఆయన ఉప్పు, నూనె లేకుండా ఉడికించిన ఆహారం తీసుకుంటారని తెలిపారు. రెండేళ్ల క్రితం ఆయనను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది.
Sorry, no posts matched your criteria.