News January 16, 2025

ట్రంప్ ప్రమాణస్వీకారానికి భారీ ఏర్పాట్లు

image

US అధ్యక్షుడిగా ట్రంప్ ఈ నెల 20న వాషింగ్టన్ డీసీ‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని వీధుల్లో 48KM మేర 7 అడుగుల ఫెన్సింగ్‌ను నిర్మిస్తున్నారు. 25వేల మంది పోలీసులతోపాటు 7,800 మంది సైనికులను మోహరించనున్నారు. వైట్ హౌస్ చుట్టూ 2KM పరిధిలో పూర్తిగా లాక్‌డౌన్ విధించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.

News January 16, 2025

GOOD NEWS: BC నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్

image

TGలోని అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో వచ్చే నెల 15 నుంచి వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. RRB, SSC, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్లకు 100 రోజులపాటు శిక్షణ ఇస్తామని తెలిపింది. గ్రామాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 9 వరకు <>దరఖాస్తు<<>> చేసుకోవాలని సూచించింది. ఇంటర్, డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

News January 16, 2025

ముంబై సేఫ్ కాదన్న సెలబ్రిటీలు.. ఖండించిన సీఎం

image

సైఫ్ అలీఖాన్‌పై కత్తిదాడి ఘటనతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది. సల్మాన్ ఇంటి ముందు కాల్పులు, రాజకీయ నేత సిద్దిఖీ హత్య వంటి వరుస ఘటనలు జరుగుతుండటంతో ముంబై సేఫ్ కాదంటూ పలువురు సెలబ్రిటీలు SMలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వాదనలను CM ఫడణవీస్ కొట్టిపారేశారు. ఒకటి, రెండు సంఘటనలను చూపుతూ ముంబై ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

News January 16, 2025

కేటీఆర్ విచారణ.. ఈడీ ఆఫీస్ వద్ద హైడ్రామా

image

TG: ఈడీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. కేటీఆర్ విచారణ ముగిసిందని తెలిసి బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అక్కడే ఉంటామని పలువురు కార్యకర్తలు తెగేసి చెప్పడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కేటీఆర్ బయటికి వస్తారా? లేదా? అని ఉత్కంఠ నెలకొంది.

News January 16, 2025

ముగిసిన కేటీఆర్ విచారణ

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

News January 16, 2025

87 మంది పిల్లలకు తండ్రి.. NEXT టార్గెట్ ప్రతి దేశంలో ఓ బిడ్డ

image

USకు చెందిన కైల్ గోర్డీ ప్రపంచ ప్రఖ్యాత స్పెర్మ్ డోనర్. bepregnantnow వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 87 మంది పిల్లలకు తండ్రయ్యారు. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 100కు చేరనుంది. 2026 నాటికి ప్రతి దేశంలో ఓ పిల్లాడికి తండ్రవ్వడమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడం సంతోషంగా ఉందంటున్నారు.

News January 16, 2025

2047 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.58.14 లక్షలు

image

AP: ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.68 లక్షలుగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఈ మొత్తం రూ.58.14 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తాము విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌కు దేశంలోనే తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. వికసిత్ భారత్‌కు కూడా ఈస్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు.

News January 16, 2025

ఈ ఏడాది 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు

image

దేశవ్యాప్తంగా 2024లో 88.6Cr ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాదిలో 90Crకు చేరుకుంటుందని ఓ రిపోర్టు వెల్లడించింది. మొత్తం వినియోగదారుల్లో 55%(48.8Cr) గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) తెలిపింది. 98% మంది IND భాషల్లోనే నెట్‌ను యూజ్ చేశారంది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కంటెంట్ విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజాధరణ లభిస్తోందని పేర్కొంది.

News January 16, 2025

చరిత్ర సృష్టించిన ప్రతిక

image

IND-W జట్టు ఓపెనర్ ప్రతికా రావల్ వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆడిన తొలి 6 ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్స్(444) సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ప్రతిక తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG)-434, నథాకన్(థాయ్‌లాండ్)-322, ఎనిడ్ బేక్‌వెల్(ENG)-316, నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)-307 ఉన్నారు. కాగా ప్రతిక సైకాలజీలో డిగ్రీ చేశారు. తండ్రి ప్రదీప్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్.

News January 16, 2025

సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN

image

AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.