News January 16, 2025

హిండెన్‌బర్గ్‌ను ఇప్పుడే ఎందుకు మూసేసినట్టు!

image

US షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్‌ షట్‌డౌన్ టైమింగ్‌పై చాలామందికి డౌట్ వస్తోంది. JAN 20న ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రితమే హౌస్ జుడీషియరీ కమిటీలోని రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడొకరు అదానీ, అతడి కంపెనీలపై కమ్యూనికేషన్, దర్యాప్తు పత్రాలు, ఆధారాలన్నీ పరిరక్షించాలని DOJను కోరారు. ఇక హిండెన్‌బర్గ్‌కు డీప్‌స్టేట్, డెమోక్రాట్స్, జార్జ్ సొరోస్, చైనా ఇంటెలిజెన్స్ సహకారంపై ఆరోపణలు ఉన్నాయి.

News January 16, 2025

రూ.1,00,00,000 ప్రశ్న.. జవాబు చెప్పగలరా?

image

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌కు సంబంధించి రూ.కోటి ప్రశ్న వేశారు. 1932లో లార్డ్స్‌లో భారత్ ఆడిన తన తొలి టెస్టులో మొదటి బంతి ఎదుర్కొన్న బ్యాటర్ ఎవరు? అని క్వశ్చన్ అడిగారు. A.జనార్దన్ నవ్లే B.సోరాబ్జీ కోలాహ్ C.లాల్ సింగ్ D.ఫిరోజ్ పలియా అని ఆప్షన్స్ ఇచ్చారు. మరి మీరు సరైన సమాధానం ఏంటో చెప్పగలరా? తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్: A.

News January 16, 2025

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉ.11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా హామీల అమలుపై మంత్రులు చర్చించనున్నారు. అలాగే పలు కంపెనీలకు భూముల కేటాయింపునకు ఆమోద ముద్ర వేసే అవకాశమున్నట్లు సమాచారం.

News January 16, 2025

గిరిజన రైతులకు గుడ్ న్యూస్

image

TG: ‘ఇందిరమ్మ జలప్రభ స్కీమ్’లో భాగంగా గిరిజన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు ఇవ్వనుంది. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద 4 ఎకరాల్లోపు భూములు సాగు చేస్తున్న 2.30లక్షల మందికి బోరు వేసేందుకు, మోటార్‌కు అయ్యే ఖర్చును అందించనుంది. ఒక్కో రైతు యూనిట్ కాస్ట్ ₹6Lగా నిర్ణయించింది. ఈ స్కీమ్‌ దశల వారీగా అమలు కానుండగా బడ్జెట్‌లో నిధులు కేటాయించనుంది. కేంద్రం నుంచి 40% నిధులు రానున్నాయి.

News January 16, 2025

BREAKING: సైఫ్ అలీఖాన్‌పై దాడి

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగింది. ముంబైలోని సైఫ్ నివాసంలోకి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఆయన పనిమనిషితో వాగ్వాదానికి దిగాడు. సైఫ్ జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా దుండగుడు కత్తితో అటాక్ చేసి, పరారయ్యాడు. దీంతో ఈ నటుడికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

News January 16, 2025

Stock Markets: భారీ గ్యాప్‌అప్ ఓపెనింగ్‌కు ఛాన్స్!

image

స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు. ఆసియా, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటమే ఇందుకు కారణం. గిఫ్ట్‌నిఫ్టీ ఏకంగా 146 పాయింట్ల లాభంతో చలిస్తుండటం గమనార్హం. ఆసియా సూచీలన్నీ గ్రీన్‌లో కళకళలాడుతున్నాయి. నిన్న US, EU స్టాక్స్ అదరగొట్టాయి. US ఇన్‌ఫ్లేషన్ తగ్గిందన్న వార్తలు పాజిటివ్ సెంటిమెంటు నింపుతున్నాయి. డాలర్, ట్రెజరీ, బాండ్ యీల్డుల విలువలు కాస్త కూల్‌ఆఫ్ అయ్యాయి.

News January 16, 2025

సెలవులు పొడిగించాలని వినతి

image

సంక్రాంతి సెలవుల తర్వాత తెలంగాణలో కాలేజీలు శుక్రవారం నుంచి, స్కూళ్లు శనివారం నుంచి పున:ప్రారంభం కానున్నాయి. అయితే తమ పిల్లలను ఆ రోజుల్లో పంపించబోమని, సోమవారం పంపుతామని కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు. శనివారం కూడా హాలిడే ఇవ్వాలని కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. మరి మీరెప్పుడు స్కూల్/కాలేజీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News January 16, 2025

అదానీని తిప్పలు పెట్టిన హిండెన్‌బర్గ్ షట్‌డౌన్

image

అదానీ గ్రూప్, సెబీ చీఫ్ మాధబిపై ఆరోపణలతో రిపోర్టులిచ్చిన హిండెన్‌బర్గ్ మూతపడనుంది. కంపెనీని శాశ్వతంగా షట్‌డౌన్ చేస్తున్నట్టు యజమాని నేట్ అండర్సన్ ప్రకటించారు. షార్ట్ సెల్లింగ్ చేశాక ఆ కంపెనీలపై నివేదికలిచ్చి ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచి, తర్వాత తక్కువ ధరకు షేర్లను కొని లాభపడటమే దాని పని. రీసెర్చ్ ఐడియాలన్నీ అయిపోయాయని, రెస్ట్ తీసుకుంటానంటున్న నేట్ సరిగ్గా ట్రంప్ రాకముందే షట్‌డౌన్ చేయడం గమనార్హం.

News January 16, 2025

అదరగొడుతున్న ప్రతికా రావల్

image

టీమ్ ఇండియా ఉమెన్స్ టీమ్ ఓపెనర్ ప్రతికా రావల్ ఐర్లాండ్‌ సిరీస్‌లో అదరగొట్టారు. ఆడిన మూడు మ్యాచుల్లో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 310 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచారు. గత ఏడాది డిసెంబర్‌లో WIతో జరిగిన వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఈ యంగ్ ప్లేయర్ తొలి మ్యాచులోనే 40 పరుగులు చేశారు. ఓవరాల్‌గా ఆరు మ్యాచుల్లో 74 సగటుతో 444 పరుగులు చేశారు. ఇందులో ఓ సెంచరీ, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

News January 16, 2025

PHOTOS: మహాకుంభమేళా.. రాత్రి వేళ ఇలా

image

పగలంతా భక్తులతో నిండిపోతున్న ప్రయాగ్ రాజ్ రాత్రిపూట విద్యుత్ కాంతుల్లో విరాజిల్లుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రంగు రంగుల బల్బుల వెలుగుల్లో త్రివేణీ సంగమం భువిపై వెలసిన స్వర్గంలా ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కాగా మహాకుంభమేళాకు మూడు రోజుల్లో 6 కోట్ల మందికి పైగా హాజరయ్యారని సమాచారం.