News July 16, 2024

నేడు సీఎం రేవంత్ కీలక సమావేశం

image

TG: అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సీఎం రేవంత్ నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఉ.9:30కు ప్రారంభమయ్యే ఈ మీటింగ్‌లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వనమహోత్సవం, విద్య, శాంతిభద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, సీఎస్, డీజీపీ, అన్ని శాఖల కార్యదర్శలు ఈ భేటీలో పాల్గొననున్నారు.

News July 16, 2024

నెల్సన్ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్ సినిమా?

image

తమిళ డైరెక్టర్ నెల్సన్‌తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇటీవల HYDలో స్టోరీ డిస్కషన్స్ జరగగా, నెల్సన్ చెప్పిన స్టోరీ బన్నీకి నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని డైరెక్టర్‌కు ఐకాన్ స్టార్ సూచించారట. ఈ మూవీపై ఈ ఏడాది చివర్లో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. నెల్సన్ గత ఏడాది ‘జైలర్’ సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

News July 16, 2024

నేడు ఏపీ కేబినెట్ భేటీ

image

ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ విధివిధానాలు, తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీ, ఓటాన్ బడ్జెట్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాను కలిసి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది.

News July 16, 2024

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ప్రకటించిన ట్రంప్

image

US అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఎంపికయ్యారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో RNC ప్రతినిధులు ఓటు వేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతరం తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ట్రంప్ ప్రకటించారు. ఒహియో రాష్ట్రానికి చెందిన జేడీ వాన్స్ ఈ పదవికి సరిగ్గా సరిపోతారని X వేదికగా తెలిపారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత అతడిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

News July 16, 2024

రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికంపై మంత్రి ఏమన్నారంటే?

image

TG: 2018లో రుణమాఫీకి గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలనే తామూ అమలు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ‘రుణమాఫీకి రేషన్ కార్డు రూల్ కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికే. కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తాం. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఏకకాలంలో రూ.2లక్షలు మాఫీ చేస్తున్నాం. అయినా ప్రతిపక్షాలు బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని మంత్రి మండిపడ్డారు.

News July 16, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జులై 16, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:30 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:50 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
అసర్: సాయంత్రం 4:56 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:54 గంటలకు
ఇష: రాత్రి 8.14 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News July 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 16, 2024

జులై 16: చరిత్రలో ఈరోజు

image

1924: ఫ్రీడమ్ ఫైటర్, మాజీ ఎంపీ తేళ్ల లక్ష్మీకాంతమ్మ జననం
1945: మొదటి ప్లుటోనియం అణుబాంబును పరీక్షించిన US
1968: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధనరాజ్ పిళ్లై జననం
1972: భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా IPS అధికారిణిగా కిరణ్ బేడీ నియామకం
1979: ఇరాక్ అధ్యక్షుడిగా సద్దాం హుస్సేన్ ప్రమాణం
1983: హీరోయిన్ కత్రీనా కైఫ్ జననం
2015: సినీ గాయకుడు వి.రామకృష్ణ మరణం
* ప్రపంచ పాముల దినోత్సవం

News July 16, 2024

రహస్య పత్రాల కేసులో ట్రంప్‌కు ఊరట

image

రహస్య పత్రాల తరలింపునకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన ఓ కేసును ఫ్లోరిడా కోర్టు కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారన్న ట్రంప్ లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. 2021లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందిన కీలక పత్రాలను ట్రంప్ తన ఎస్టేట్‌కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

News July 16, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.