India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు, ముఖ్య నాయకులతో పార్టీ అధినేత జగన్ కీలక సమావేశం నిర్వహించారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకుల పనితీరుపై మానిటరింగ్ ఉంటుందని, కష్టపడిన వారికి ప్రమోషన్లు ఇస్తామని చెప్పారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండాలని సూచించారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైసీపీని తయారుచేయాలన్నారు.
ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన నిఖిత పోర్వాల్ సొంతం చేసుకున్నారు. ముంబై వేదికగా 60వ ఎడిషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. త్వరలో జరిగే మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. రన్నరప్‌లుగా రేఖా పాండే(దాద్రా నగర్ హవేలీ), ఆయుశీ దోలకియా(గుజరాత్) నిలిచారు.
UGC NET జూన్-2024 ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు NTA వెల్లడించింది. ugcnet.nta.ac.inలో అప్లికేషన్ నంబర్, DOB ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి ఈ పరీక్షను ఏటా జూన్, డిసెంబర్‌లో నిర్వహిస్తారు. జూన్ 18న జరిగిన పరీక్ష లీకేజీ కారణంగా రద్దవడంతో AUG 21-SEP4 వరకు మళ్లీ నిర్వహించారు.
సిటిజన్‌షిప్ యాక్ట్ సెక్షన్ 6Aకు చట్టబద్ధత ఉందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4-1 తేడాతో తీర్పునిచ్చింది. దీనిని మార్చే అధికారం పార్లమెంటుకే ఉందని స్పష్టం చేసింది. బంగ్లా నుంచి అస్సాం వచ్చిన వలసదారుల సమస్యకు రాజకీయ పరిష్కారమే సెక్షన్ 6A అని CJI చంద్రచూడ్ అన్నారు. 1985లో ప్రవేశపెట్టిన ఈ చట్టంతో 1971, MAR 24 ముందునాటి వలసదారులకు భారత పౌరసత్వం ఇస్తారు. తర్వాత వచ్చినవాళ్లు వెళ్లిపోవాల్సి ఉంటుంది.
AP: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు నిన్న వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉ.10.30 గంటల నుంచి సా.4 గంటల మధ్యలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మ.2 గం.కు విచారణకు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మంగళగిరి గ్రామీణ PSలో పోలీసులు సజ్జలను విచారించనున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని AAP మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో పోటీచేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఢిల్లీలో బలపడటం పైనే ఫోకస్ పెట్టిందని సమాచారం. ఆ 2 రాష్ట్రాల్లో యాంటీ BJP ఓట్లు చీలకూడదని, ఇండియా కూటమిని బలోపేతం చేయాలని భావిస్తోందట. మహారాష్ట్ర AAP యూనిట్ పోటీకి ఇష్టపడుతున్నా అధిష్ఠానం అనుమతి ఇవ్వకపోవచ్చని తెలిసింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ, MP సందీప్ పాఠక్ ఈ మేరకు సంకేతాలు పంపించారు.
కెనడాతో వివాదంపై TMC MP, రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య సాగరికా ఘోష్ ట్వీట్లు చర్చనీయంగా మారాయి. ‘మోదీ ప్రభుత్వ క్రిమినల్ యాక్టివిటీపై కెనడా PM ట్రూడో పబ్లిక్‌గా అభియోగాలు ఎందుకు మోపుతున్నారో నాన్ బయలాజికల్ PM మోదీ పార్లమెంటుకు చెప్పాలి’ అని ఆమె మొదట ట్వీట్ చేశారు. అప్పట్నుంచి ప్రధాని టార్గెట్‌గా ట్వీట్లు చేస్తుండటంతో ‘మీ నుంచి ఇంతకు మించి ఆశించడం వేస్ట్’ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.>comment
హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి కాబోతున్నారు. ఆమె నటించిన ‘సిస్టర్ మిడ్‌నైట్’ మూవీని BFI లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తున్న సందర్భంగా రాధిక బేబీ బంప్‌తో కనిపించారు. ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. దీంతో ఆమెకు అభిమానులు, తోటి నటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ENGకు చెందిన మ్యుజీషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను రాధిక 2012లో వివాహం చేసుకున్నారు. ఈమె తెలుగులో రక్తచరిత్ర, లెజెండ్, లయన్ చిత్రాల్లో నటించారు.
NZతో తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. లంచ్ బ్రేక్ సమయానికి 34 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్సులో నలుగురు ప్లేయర్లు (కోహ్లీ, సర్ఫరాజ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా) డకౌట్ అయ్యారు. ప్రస్తుతం పంత్ (15*) క్రీజులో ఉన్నారు. విలియం 3, హెన్రీ 2, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
ప్రభాస్ నటించిన సలార్-1 మూవీ హిందీ వెర్షన్ మరో అరుదైన ఘనత సాధించింది. ఉత్తరాదిన టీవీ ప్రీమియర్స్‌లో 30 మిలియన్ల వ్యూస్ సాధించింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక వ్యూస్ పొందిన టాప్-3 చిత్రాల జాబితాలో చేరింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘స్టార్ గోల్డ్’ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే 2023 నుంచి అత్యధిక రేటింగ్ పొందిన డబ్బింగ్ మూవీగా రికార్డు సృష్టించినట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.