India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ ఉ.11 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కొద్దిరోజులుగా తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఓ వర్గం చేస్తున్న కుట్రను బయటపెడతానని ఆయన ట్వీట్ చేశారు. కాగా కొద్దిరోజులుగా VSRపై సోషల్ మీడియాలో తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది.
వర్షం, వరదల కారణంగా HYD వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని టీ బీజేపీ ట్వీట్ చేసింది. గత పాలనలో జరిగిన లోపాల నుంచి నేర్చుకుని, సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించింది. ‘ఇదేనా KTR.. నీటి బుడగల మీద నువ్వు కట్టిన విశ్వనగరం? ఇదేనా రేవంత్.. ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతున్న ప్రజలకి నువ్విచ్చే భరోసా?’ అంటూ రోడ్లపై వరద పారుతున్న వీడియోను Xలో పోస్ట్ చేసింది.
వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగే సిరీస్ కోసం BCCI ఇండియా-ఏ మహిళల జట్టును ప్రకటించింది. ఇందులో ఏపీకి చెందిన షబ్నమ్ షకీల్, HYDకు చెందిన సొప్పదండి యశశ్రీకి చోటు దక్కింది.
జట్టు: మిన్ను మణి (C), శ్వేతా సెహ్రావత్ (VC), ప్రియా పునియా, శుభా సతీష్, తేజల్ హసబ్నిస్, కిరణ్ నవ్‌గిరే, సజన, ఉమా చెత్రీ, శిప్రా గిరి, రాఘవి, ఇషాక్, మన్నత్ కశ్యప్, తనూజా, ప్రియా మిశ్రా, మేఘన, సయాలీ సత్ఘరే, షబ్నమ్, యశశ్రీ.
నార్త్ అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో ఇండియన్ సినిమాగా ‘కల్కి 2898 AD’ నిలిచింది. అక్కడ ఈ మూవీ 17 రోజుల్లోనే 17.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. షారుఖ్‌ఖాన్ పఠాన్($17.49M) కలెక్షన్స్‌ను అధిగమించింది. టాప్ ప్లేస్‌లో బాహుబలి-2 ($20.7M) కొనసాగుతోంది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఇప్పటివరకు రూ.1000కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సంగతి తెలిసిందే.
TG: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ KCR దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం జుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనిని రద్దు చేయాలని KCR హైకోర్టుకు వెళ్లగా, ఆయన పిటిషన్‌ను కోర్టు <<13542740>>కొట్టివేసింది<<>>. దీంతో ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
టీమ్ఇండియాలో ఓపెనర్ స్థానం కోసం పోటీ ఉండటం మంచిదేనని గిల్ అభిప్రాయపడ్డారు. అతనితో పాటు ZIMతో T20 సిరీస్‌లో ఆడిన అభిషేక్, జైస్వాల్, రుతురాజ్ కూడా ఓపెనింగ్ స్పాట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో SLతో సిరీస్‌లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనేది సెలక్టర్లు నిర్ణయిస్తారని గిల్ వ్యాఖ్యానించారు. ZIM సిరీస్‌లో గిల్ 170, జైస్వాల్ 141, రుతురాజ్ 123, అభిషేక్ 124 రన్స్ చేశారు. వీరిలో గిల్ SR(125) తక్కువగా ఉంది.
చప్పట్లు కొట్టడం వల్ల మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కండరాల్లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంటున్నారు. మెడ, వెన్ను, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని, ఒత్తిడితో పాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రభావం తగ్గుతుందని చెబుతున్నారు. నడుమును నిటారుగా ఉంచి, శరీరాన్ని పైకి లాగి చప్పట్లు కొడితే ఫలితం ఉంటుందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’లో KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ పునః ప్రారంభం కానున్నట్లు సమాచారం. పవర్ స్టార్ 20-25 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తవుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో కొంతభాగాన్ని క్రిష్ చిత్రీకరించగా, మిగిలిన సన్నివేశాల్ని జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయనున్నారు.
యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నీ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఆ జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. స్పెయిన్‌కు ఇది నాలుగో యూరో టైటిల్. ఆ జట్టులో విలియమ్ 48వ నిమిషంలో, ఓయర్జాబల్ 86వ నిమిషంలో గోల్ చేశారు. ఇంగ్లండ్ టీమ్‌లో పామర్ 73వ నిమిషంలో గోల్ సాధించారు.
24 గంటల్లో అత్యధిక మొక్కలు నాటిన టీమ్‌గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈనెల 13, 14 తేదీల్లో ఇండోర్‌లో 11 లక్షలకు పైగా మొక్కలు నాటి ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ X వేదికగా వెల్లడించారు. గిన్నిస్ రికార్డ్స్ ధ్రువపత్రం ఫొటోలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు అస్సాం అటవీశాఖ పేరిట ఉండేది. గత ఏడాది ఆ రాష్ట్రం 9లక్షలకుపైగా మొక్కల్ని నాటింది.
Sorry, no posts matched your criteria.