News July 13, 2024

కువైట్‌లో తెలుగోడి కష్టాలు.. Way2News కథనం చూసి స్పందించిన లోకేశ్

image

AP: కువైట్‌లో అష్టకష్టాలు పడుతున్న ఓ తెలుగు వ్యక్తి ఆవేదనను <<13623419>>’VIRAL: కువైట్‌లో కష్టాలు.. కాపాడాలని వ్యక్తి వీడియో’<<>> శీర్షికతో Way2News ప్రచురించిన కథనం ప్రభుత్వాన్ని కదిలించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరలై మంత్రి లోకేశ్ వరకూ వెళ్లింది. వెంటనే ఆయన స్పందించి, అతడిని భారత్ తీసుకురావాలని భారత విదేశాంగ శాఖను కోరారు. తన కష్టంపై స్పందించిన వే2న్యూస్‌తో పాటు లోకేశ్‌కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.

News July 13, 2024

BREAKING: పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌ లీగ్‌ ఫైనల్లో టీమ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఆ జట్టు ఓవర్లన్నీ ఆడి 156/6కే పరిమితమైంది. షోయబ్ మాలిక్ (41) రాణించారు. కమ్రాన్ అక్మల్ (24), మక్సూద్ (21) ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. వినయ్ కుమార్, పవన్ నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ తీశారు.

News July 13, 2024

ఇన్‌స్టాలో భార్య పోస్ట్.. డ్రగ్ డీలర్‌ను పట్టించింది!

image

అంతర్జాతీయ డ్రగ్ డీలర్‌ను పట్టుకునేందుకు పోలీసులు టెక్నాలజీని వాడారు. రెండేళ్లుగా పరారీలో ఉన్న 50ఏళ్ల బ్రెజిలియన్ డ్రగ్ లార్డ్ రోనాల్డ్ రోలాండ్‌‌ను ఇన్‌స్టా పోస్ట్‌లోని లొకేషన్ ఆధారంగా పట్టుకున్నారు. తన భార్యతో కలిసి పారిస్, దుబాయ్, మాల్దీవుల్లో అతడు పర్యటించారు. అయితే వారున్న ప్రదేశాన్ని అతని భార్య ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అతణ్ని బ్రెజిల్‌లోని గ్వరూజ బీచ్ సిటీలో ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు.

News July 13, 2024

BIG ALERT.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

image

AP: కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రేపు, ఎల్లుండి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. రేపు మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయంది. అత్యవసరమైతే 1070, 112, 18004250101 నంబర్లకు ప్రజలు ఫోన్ చేయాలని సూచించింది.

News July 13, 2024

ఓడరేవుల ఆధునికీకరణపై ప్రభుత్వం ఫోకస్

image

AP: విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను రూ.27వేల కోట్లతో ఆధునికీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని భావిస్తోంది. ఇదే అంశంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. పోర్టులను అనుసంధానిస్తూ రోడ్లు, వివిధ ప్రాజెక్టులు, లాజిస్టిక్ కారిడార్‌లను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని అధికారులకు సూచించారు.

News July 13, 2024

రాజ్‌తరుణ్ ఆచూకీ కనిపెట్టాలని కోరా: లావణ్య

image

TG: హీరో రాజ్‌తరుణ్‌పై నమోదైన కేసులో భాగంగా ఫిర్యాదు చేసిన లావణ్య స్టేట్‌మెంట్‌ను HYD నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. 4 గంటల పాటు వివిధ అంశాలపై ఆమె నుంచి సమాచారం సేకరించారు. సోమవారం మరోసారి విచారణకు హాజరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా రాజ్‌తరుణ్ ఆచూకీ తెలపాలని పోలీసులను కోరినట్లు లావణ్య వెల్లడించారు.

News July 13, 2024

బిగ్గెస్ట్ విన్.. చరిత్ర సృష్టించిన భారత్

image

నాలుగో టీ20లో జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. షార్ట్ ఫార్మాట్‌లో వికెట్ కోల్పోకుండా భారత్ ఛేదించిన అత్యధిక లక్ష్యం(153) ఇదే కావడం విశేషం. బంతుల మిగులు(28) పరంగానూ భారత్‌కు ఇదే పెద్ద విజయం. గతంలో పాక్ 200(vsఇంగ్లండ్), కివీస్ 169(vsపాక్), ఇంగ్లండ్ 169(vsఇండియా) పరుగుల లక్ష్యాలను వికెట్ చేజార్చుకోకుండా ఛేదించాయి.

News July 13, 2024

సీఎం చంద్రబాబుది రాక్షసానందం: కాకాణి

image

AP: వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతూ సీఎం చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నారని వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ సీఎం జగన్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో చంద్రబాబు దుష్ట సంప్రదాయం అనుసరిస్తున్నారు. మరోవైపు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసాలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

News July 13, 2024

90 శాతం రాయితీతో పశువుల షెడ్ల నిర్మాణం: అచ్చెన్నాయుడు

image

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా పశుపోషకులకు రాయితీపై పశువుల షెడ్లు నిర్మిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గేదెలు, ఆవుల షెడ్లకు 90 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు, గొర్రెలు, మేకల షెడ్లకు 70 శాతం రాయితీపై గరిష్ఠంగా రూ.2.30 లక్షలు ఇస్తామని వెల్లడించారు. కోళ్ల పెంపకందారులకు 70 శాతం రాయితీపై రూ.1.32 లక్షలు అందజేస్తామన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామని చెప్పారు.

News July 13, 2024

గిల్ ‘సెల్ఫిష్’ అంటూ నెటిజన్ల ఫైర్

image

జింబాబ్వేతో 4వ T20లో జైస్వాల్ సెంచరీని గిల్ అడ్డుకున్నాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IND విజయానికి 25రన్స్ కావాల్సిన సమయంలో జైస్వాల్ 83 రన్స్‌ వద్ద ఉన్నారు. కానీ గిల్ అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా 2సిక్సర్లు బాది హాఫ్ సెంచరీ చేసుకున్నారు. దీంతో గిల్ ‘సెల్ఫిష్’ అంటూ Xలో హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే దేశానికి ఆడేటప్పుడు వ్యక్తిగత స్కోర్ చూడటమేంటని గిల్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.