News January 13, 2025

PIC OF THE DAY: భక్తితో పాటు దేశభక్తి

image

144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి త్రివర్ణ పతాకం చేతబూని రెపరెపలాడించాడు. భక్తి, దేశభక్తి అద్భుతమంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళా దేశానికి గర్వకారణం, గుర్తింపు అని యూపీ అధికారులు ట్వీట్ చేశారు.

News January 13, 2025

కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు

image

TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు.

News January 13, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.

News January 13, 2025

తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి దారుణం!

image

AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.

News January 13, 2025

TTDలో సమన్వయ లోపం లేదు: ఛైర్మన్, ఈవో

image

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భక్తులకు TTD ఛైర్మన్ BR నాయుడు సూచించారు. ఏర్పాట్లలో లోపాలున్నాయని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. TTD ఛైర్మన్, EOకు పడటం లేదని, బోర్డులో సమన్వయ లోపం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని EO శ్యామలరావు ఖండించారు. తిరుపతిలోని ఓ స్కూల్ వద్ద జరిగిన ఘటనను తిరుమలలో జరిగినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

News January 13, 2025

జోరుగా కోడి పందేలు

image

AP: రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. బరులు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పందేలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బరి వద్ద కనీసం రూ.20వేల-రూ.30 వేల వరకు పందెం నడుస్తోంది. మొత్తంగా రూ.వందల కోట్లు చేతులు మారుతున్నాయి. మరికొన్ని చోట్ల ఎడ్ల పోటీలు జరుపుతున్నారు. ఈ పందేలు, పోటీలు చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తరలివస్తున్నారు.

News January 13, 2025

‘డాకు మహారాజ్’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

image

నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా తొలి రోజు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. బాలకృష్ణకు ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని పేర్కొంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ, హిందీ భాషల్లో ఈనెల 17న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మీరు ఈ సినిమా చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.

News January 13, 2025

రోహిత్ గొప్ప కెప్టెన్: యువరాజ్

image

రోహిత్ శర్మ ఎప్పటికీ గొప్ప కెప్టెనే అని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నారు. ‘రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా వన్డే ప్రపంచకప్ FINALకు వెళ్లింది. టీ20 ప్రపంచకప్ గెలిచింది. ఫామ్ లేమి కారణంగా మ్యాచ్ నుంచి తనకు తానుగా తప్పుకున్న సారథిని నేనిప్పటి వరకు చూడలేదు. తన తొలి ప్రాధాన్యత జట్టేనని రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే అతడి గొప్పతనం’ అని కొనియాడారు.

News January 13, 2025

కసికసిగా కరుణ్ నాయర్.. Smiling DC

image

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అన్నట్టుగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నారు కరుణ్ నాయర్. కర్ణాటక నుంచి విదర్భకు వెళ్లాక కసికసిగా ఆడుతున్నారు. ఫిట్నెస్, బ్యాటింగ్ టెక్నిక్ మెరుగుపర్చుకున్న అతడు తాజాగా లిస్ట్A క్రికెట్లో వరుసగా ఐదో సెంచరీ బాదేశారు. SMAT, రంజీల్లోనూ మురిపించారు. IPLలో తననెవరూ చిన్నచూపు చూడొద్దన్న కసితో ఉన్నాడతను. వేలంలో రెండో దఫాలో రూ.50Lకు సొంతం చేసుకున్న ఢిల్లీకిక పండగే!

News January 13, 2025

గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలి: KCR

image

ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న తెలంగాణ వ్యవసాయం, BRS హయాంలో పండుగలా మారిందని మాజీ సీఎం KCR పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగాలని కోరారు. తమ పదేళ్ల పాలనలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి దాదాపు ₹4.5లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా, రాజీపడకుండా గత పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని సూచించారు.