India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం మేరకు పోలీసులు, ఆర్మీ కలిసి శ్రీనగర్ జిల్లాలోని జబర్వాన్ ఫారెస్ట్ ఏరియాలో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ ఆరంభించాయి. నేటి ఉదయం ముష్కరులు కనిపించడంతో కాల్పులు జరిగాయి. మరోవైపు బారాముల్లాలోనూ వరుసగా రెండో రోజు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ దాడిలో ఒక ఉగ్రవాది మరణించాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో మంచిర్యాల గిరిజన పాఠశాలలో ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌లో కాలం చెల్లిన మందులు ఉంచారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇంతకంటే నిర్లక్ష్యం ఉంటుందా? అని Xలో నిలదీశారు. ‘గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఇంత చిన్నచూపా? కలెక్టర్, వైద్యాధికారి ఏం చేస్తున్నట్లు? అధికార పార్టీ నేతలకు పట్టించుకునే తీరిక లేదా? ప్రభుత్వం ఇంకెప్పుడు మొద్దు నిద్ర వీడుతుంది?’ అని నిలదీశారు.
MS ధోనీకి ఇష్టం ఉన్నన్ని రోజులు తమ జట్టులో ఆడతారని CSK CEO కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఈ విషయంలో ఆయనకు అడ్డుచెప్పబోమని ఆయన స్పష్టం చేశారు. ‘ధోనీకి CSK అంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. అంకితభావం, పట్టుదలతో ఆట ఆడతారు. ధోనీ ఎల్లప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకుంటారు. అందుకే ఆయన ఆడాలనుకున్నంత కాలం మేం తలుపులు తెరిచే ఉంచుతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా CSK ధోనీని రూ.4 కోట్లతో రిటైన్ చేసుకుంది.
అక్టోబర్ 2 నుంచి 31 వరకు కేంద్రం చేపట్టిన ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం 4.Oకు మంచి స్పందన లభించింది. దేశవ్యాప్తంగా 5.97 లక్షల ప్రభుత్వ కార్యాలయాల్లోని చెత్తను తొలగించడం ద్వారా రూ.650 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్తగా 190 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. 2021-24 మధ్య చెత్త అమ్మకం ద్వారా రూ.2,364 కోట్ల ఆదాయం లభించింది.
తల్లి పాలకు మించిన పౌష్టికాహారం ఏదీలేదు. కానీ చాలా మంది పిల్లలకు ఈ పాలు అందడం లేదు. వారికోసం USకు చెందిన అలీస్ ఓగ్లెట్రీ(36) పెద్ద మనసు చాటుకున్నారు. 2023 జులై నాటికి తన బ్రెస్ట్ మిల్క్‌ను 2,645L దానం చేసి గిన్నిస్ రికార్డును సాధించారు. గతంలోనూ 1,569L పాలను అందించారు. తాను 3,50,000 మంది పిల్లలకు సాయం చేసినట్లు ఆమె సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. సరోగేట్ మదర్‌గానూ సేవ చేశారు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా బయల్దేరారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఆయన వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కోహ్లీతోపాటు రోహిత్ శర్మ కూడా ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి బీజీటీ ప్రారంభం కానుంది.
బిహార్‌లోని బరౌనీకి చెందిన ఓ రైల్వే ఉద్యోగి <<14569710>>కప్లింగ్<<>> చేస్తూ ఇంజిన్-బోగీ మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు చలించిపోయి రైల్వేపై మండిపడుతున్నారు. ఆటోమేటిక్ కప్లింగ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా రైల్వే శాఖ తమ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఫైర్ అవుతున్నారు.
TG: సిద్దిపేటలో విషాదం చోటుచేసుకుంది. తేలు సత్యం(50) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి చింతల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. తండ్రితో పాటు అభంశుభం తెలియని చిన్నారులు అశ్విన్, త్రివర్ణ విగతజీవులుగా కనిపించడం కలిచివేసింది.
US ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. చివరగా ఆరిజోనా కూడా ట్రంప్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి 11 ఎలక్టోరల్ ఓట్స్ కలుపుకుని మొత్తంగా ఆయనకు 312 ఓట్లు వచ్చాయి. స్వింగ్ స్టేట్స్ అయిన పెన్సిల్వేనియా, మిచిగాన్, నెవాడా, జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ను ట్రంప్ క్లీన్‌స్వీప్ చేశారు. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ట్రంప్‌కు 50.5%, కమలకు 47.9% ఓట్లు వచ్చాయి.
పంజాబ్‌లోని జలంధర్‌లో పోలీస్ DAV పబ్లిక్ స్కూల్‌కి వెళితే ఆ స్టూడెంట్స్‌ను చూశాక ఎవరైనా కన్ఫ్యూజ్ కావాల్సిందే. స్కూల్లో ఎక్కడ చూసినా కవలలే కనిపిస్తే కన్ఫ్యూజ్ కాకుండా ఎలా ఉంటారు మరి! ఇక్కడ 60 జతలు అంటే మొత్తం 120 మంది విద్యార్థులు కవలలే. ఇందులో ట్విన్స్(ఇద్దరు) మాత్రమే కాదు ట్రిప్లెట్స్(ముగ్గురు కవలలు) కూడా ఉన్నారు. కాగా కవల పిల్లలు పుట్టడం ప్రకృతిలో ఒక అద్భుతమని అక్కడి టీచర్లంటున్నారు.
Sorry, no posts matched your criteria.