India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన మరో తెలుగు విద్యార్థి దుండగుడి కాల్పుల్లో బలయ్యాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్ (27) ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ విస్కాన్సిన్ మిల్వాకీలో నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటికి సమీపంలోని బీచ్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రవీణ్ మరణించాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీతో సమావేశం అవుతారు. ఆ తర్వాత ఆయన ఓ వివాహ వేడుకకు హాజరై విశాఖకు పయనం కానున్నారు.

ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి అదనంగా 5 క్యాజువల్ సెలవులు మంజూరు చేసింది. తమకు క్యాజువల్ లీవ్స్ తక్కువగా ఉన్నాయని, పెంచాలని ఆయా ఉద్యోగులు చేసిన విజ్ఞప్తితో ప్రభుత్వం ఈ సెలవులు మంజూరు చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయనుంది.

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పు అని, గతంలో కేసీఆర్ పకడ్బందీగా సర్వే చేశారని MLC తీన్మార్ మల్లన్న చేసిన <<15658580>>వ్యాఖ్యలపై<<>> మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారు. కులగణనపై అభ్యంతరాలు ఉంటే మండలిలో మాట్లాడాలి. బీఆర్ఎస్ సర్కార్ చేయలేనిది మా ప్రభుత్వం చేసింది. మమ్మల్ని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా?’ అని ఫైరయ్యారు.

అమెరికా ఏ యుద్ధాన్ని కోరుకుంటే ఆ యుద్ధాన్నిస్తామని చైనా రాయబార కార్యాలయం తాజాగా తేల్చిచెప్పింది. ‘ఫెంటానిల్ డ్రగ్ అనేది సుంకాలు పెంచేందుకు అమెరికా చూపిస్తున్న ఓ కారణం మాత్రమే. వాణిజ్యమైనా, మరే రూపంలోనైనా అమెరికా కోరుకునేది యుద్ధమే అయితే అది ఇచ్చేందుకు, చివరి వరకూ పోరాడేందుకు మేం సిద్ధం’ అని స్పష్టం చేసింది.

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. 19 రోజులకు రూ.471 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. ఎల్లుండి తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఈ వారాంతానికి రూ.500 కోట్ల మార్క్‌ను చేరుకునే అవకాశం ఉంది. మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో విక్కీ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

సత్యవర్ధన్ అపహరణ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి అనుమతించాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును పోలీసులు కోరారు. ఆయన్ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని, కేసు విషయమై పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 10రోజుల కస్టడీకి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య సెకండ్ సెమీ ఫైనల్ జరుగుతోంది. లాహోర్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిన్న జరిగిన తొలి సెమీస్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గెలుపొంది ఫైనల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెలిసిందే.

పల్లెల్లో ఉన్న ప్రేమలు పట్టణాల్లో ఉండవంటుంటారు. కానీ, అది తప్పని ఢిల్లీ ఘటనలో నిరూపితమైంది. శుభం అనే వ్యక్తి సొంతూరికి వెళ్లేందుకు ‘ఢిల్లీ కాంట్’ రైల్వే స్టేషన్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే, మాటల్లో పడి వేరే స్టేషన్‌కు వెళ్లగా మరో ఆటోలో ఉన్న వృద్ధురాలు & ఆటో డ్రైవర్ అతనికి సాయం చేశారు. ఎక్కువ డబ్బులిచ్చినా తీసుకోకుండా సమయానికి తీసుకెళ్లి హెల్ప్ చేశారని అతను చేసిన ట్వీట్ వైరలవుతోంది.

అమెరికాను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఓవైపు ట్రంప్ టారిఫ్స్ వల్ల ప్రొడక్షన్‌పై దెబ్బపడేలా ఉంది. మరోవైపు కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చిలో తీసివేతలు ఉంటాయని 100కు పైగా సంస్థలు ఉద్యోగులకు WARN నోటీసులు ఇచ్చాయి. ఒక్కో కంపెనీ 50 నుంచి 500 మందికి పైగా తీసేస్తాయని సమాచారం. టెక్ ఇండస్ట్రీలోనే కోత ఎక్కువగా ఉండనుంది. దీంతో ఆందోళన నెలకొంది.
Sorry, no posts matched your criteria.