India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: TDP MP రామ్మోహన్ నాయడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ సమీకృత టెర్మినల్‌ను త్వరగా పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడింది. విశాఖ సమీపంలోని భోగాపురం, నెల్లూరు(D) దగదర్తిలో ఎయిర్‌పోర్టులు నిర్మించాలని గతంలో చంద్రబాబు నిర్ణయించినా అధికారం కోల్పోవడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు వాటి ఏర్పాటుకు అవకాశం లభించింది.
TG: సరస్వతీ పుత్రుడు అకాల మరణం చెందాడు. ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 470కి 466 మార్కులు సాధించిన శ్రీవత్సవ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో మరణించాడు. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సుతారి శ్రీవత్సవ్ (18) ఈ నెల 7న అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో పేరెంట్స్ ఆస్పత్రిలో చేర్చారు. బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ వల్ల క్రమంగా గుండె, బ్రెయిన్, కిడ్నీలు పని చేయడం మందగించి నిన్న ప్రాణాలు వదిలాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి మరో ట్రైలర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల వారానికి ముందు ఈ ట్రైలర్ రానున్నట్లు సమాచారం. దీని నిడివి 2.30 నిమిషాలు ఉన్నట్లు టాక్. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.
AP: తనకు పౌరవిమానయాన శాఖ కేటాయింపుపై శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. ‘విమానయాన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబుకు నా కృతజ్ఞతలు. నా వంతుగా కృషి చేసి దేశంలో పౌర విమానయానం అభివృద్ధి చెందేలా చూస్తాను’ అని ట్వీట్ చేశారు. మోదీ, చంద్రబాబు ఫొటోలు, తండ్రి ఎర్రన్నాయుడు విగ్రహం ఉన్న ఫొటోను KRN షేర్ చేశారు.
TG: కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విధివిధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే అర్హులందరికీ కార్డులు మంజూరు చేస్తామన్నారు. 3 నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు.
ఉద్యోగుల క్లెయిమ్‌లు తిరస్కరణకు గురికాకుండా ఈపీఎఫ్‌వో మరో వెసులుబాటు కల్పించింది. చందాదారుడి బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఈకేవైసీ పూర్తయితే క్లెయిమ్ సమయంలో చెక్, పాస్‌బుక్ కాపీలు జత చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈమేరకు క్లెయిమ్ దరఖాస్తు సమయంలో నోట్ కనిపిస్తుందని తెలిపింది. దీంతో ఈపీఎఫ్ క్లెయిమ్‌లు సత్వరం పరిష్కారం అవుతాయని సంస్థ భావిస్తోంది.
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇంకా గెలుపు ఖాతానే తెరవలేదు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. సూపర్-8 చేరాలంటే ఇవాళ రా.8 గం.కు కెనడాతో జరిగే మ్యాచ్‌లో PAK భారీ విజయం సాధించాలి. 16న ఐర్లాండ్‌పైనా భారీ తేడాతో గెలవాలి. అదేసమయంలో USA తన తదుపరి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోవాలి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఉంటాయి. నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ప్రస్తుతం USA +0.626, పాక్ -0.150 రన్‌రేట్ కలిగి ఉన్నాయి.
మొబైల్ అమ్మకాల్లో నోకియాను నంబర్-1గా నిలబెట్టిన ‘NOKIA 3210’ మోడల్ మళ్లీ వచ్చేసింది. HMD గ్లోబల్ సంస్థ ‘నోకియా’ బ్రాండ్‌పై ఇండియన్ మార్కెట్లో దీన్ని లాంఛ్ చేసింది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2MP కెమెరా, 64 MB RAM, USB TYPE-C పోర్ట్ ఉంటాయి. యూట్యూబ్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఇచ్చారు. ఎంతో ఫేమస్ అయిన స్నేక్ గేమ్ కూడా ఆడుకోవచ్చు. డ్యుయల్ సిమ్ 4G voLTE సపోర్ట్‌తో ఈ ఫోన్ వస్తోంది. ధర రూ.3,999.
తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు తీరును APSRTC అధికారులు పరిశీలించి ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. TGలో అనుసరిస్తున్న విధానమే APకి సరిపోతుందని భావిస్తున్నారట. కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధికి ఇస్తారా? లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అనేది NDA ప్రభుత్వం నిర్ణయించనుంది. ఈ పథకం అమలుతో RTCకి నెలకు రూ.200 కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా.
AP: చంద్రబాబు మంత్రివర్గంలో గుంటూరు జిల్లాకు ఎక్కువ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం 3 నుంచి 4 మంత్రి పదవులు ఈ జిల్లాకు దక్కనున్నట్లు సమాచారం. అలాగే BCలకు 8, SCలకు 2, STలకు 1, మైనారిటీలకు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన వాటిని కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య సామాజికవర్గాలకు కేటాయించనున్నారు. ఇందులో జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.