India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు అదరగొడుతున్నాయి. క్రితం వారం నుంచి జోరు ప్రదర్శిస్తున్నాయి. నేడు అదానీ విల్మార్ మినహా అన్ని షేర్లూ పుంజుకున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 3.1, టోటల్ గ్యాస్ 2.5, ఎనర్జీ 1.8, ఏసీసీ 1.2, అదానీ పవర్, పోర్ట్స్, అంబుజా, NDTV, సంఘి, గ్రీన్ ఎనర్జీ షేర్లు ఒక శాతం మేర ఎగిశాయి. రేటింగ్ కంపెనీలు బయింగ్ కాల్స్ ఇస్తుండటం, వ్యాపార విస్తరణ, లాభదాయకత వంటివి మదుపరులను ఆకర్షిస్తున్నాయి.

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పౌజ్ కేటగిరీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుంచే పెన్షన్ ఇవ్వనుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు గుర్తించిన 5,402 మందికి రేపు పెన్షన్ అందించనుంది. అలాగే వివిధ కారణాలతో 2 లేదా 3 నెలలు పెన్షన్ తీసుకోని 50వేల మందికీ రేపు మొత్తం పెన్షన్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో వైఫల్యం సీనియర్ టీమ్ ఇండియా ప్లేయర్ల పాలిట శాపంగా మారుతోంది. కీలక మ్యాచుల్లో రోహిత్, కోహ్లీ ఆడకపోవడంపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. బాక్సింగ్ డే టెస్టులోనూ రోహిత్, కోహ్లీ మరోసారి నిరాశపరిచారు. ఇక వీరు టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి ఇతర ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో HAPPY RETIREMENT అని ట్రెండ్ చేస్తున్నారు.

TG: BRS అధినేత KCRకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫోన్ చేశారు. ఇవాళ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఫోన్ చేసి విషయం తెలియజేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు KCRకు సమాచారం ఇచ్చారు. సభకు రావాలని ఆయన్ను కోరారు.

రాజస్థాన్ కోఠ్‌పుత్లీలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలిక చేతన 8 రోజులుగా మృత్యువుతో పోరాటం చేస్తోంది. ఆ పసిబిడ్డను బయటకు తీసుకొచ్చేందుకు NDRF, SDRF, పోలీసులు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పైపుతో బోరుబావిలోకి ఆక్సిజన్ పంపుతున్నారు. ఆమెను చేరుకునే ప్రయత్నాల్లో ఓ పెద్ద బండరాయి అడ్డుతగలగా, దాన్ని తొలగించి ఇవాళ చిన్నారిని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది.

ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నట్లు RBI వెల్లడించింది. 2023-24లో 25శాతం ఉద్యోగులు తగ్గడం వల్ల బ్యాంకుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2023-24లో బ్యాంకింగ్ వ్యవస్థ పరిణామాలు, ప్రగతిపై రూపొందించిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది.

స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 78,500 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 23,760 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, జొమాటో, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐటీసీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇన్ఫీ, మారుతీ, ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్, నెస్లే ఇండియా నష్టాల్లో కొనసాగుతున్నాయి.

TG: రుణమాఫీ పూర్తైన రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. పలువురు రైతులకు రుణాలు అందకపోవడంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. రానున్న సంవత్సరంలో DCCBలు మంచి పనితీరు కనబరచాలని ఆకాంక్షించారు. గతంలో పలు DCCBల్లో తప్పులు జరిగాయని, అవి జరగకుండా చూసుకోవాలన్నారు. టెస్కాబ్-2025 క్యాలెండర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా రుణమాఫీ, బ్యాంకుల పనితీరుపై సమీక్షించారు.

అన్నా యూనివర్సిటీలో <<14983140>>విద్యార్థినిపై అత్యాచార<<>> ఘటనపై TVK పార్టీ చీఫ్, హీరో విజయ్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు, శాంతిభద్రతల వైఫల్యం చూస్తూ చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై DMKకు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. సురక్షితమైన తమిళనాడును సృష్టించడమే దీనికి పరిష్కారమన్నారు. DMK వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు.

TG: సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు. తొక్కిసలాట కేసులో అరెస్టైన AA నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నారు. మరోవైపు JAN 10న రిమాండ్ పొడగింపుపై విచారణ జరగనుంది.
Sorry, no posts matched your criteria.