News March 29, 2024

ఉద్యోగులపై దాడి చేసేందుకే ACB: నాదెండ్ల

image

కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకే ACBని ఉపయోగించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8 లక్షలకుపైగా ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు? మంత్రులు, నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని CM తనకు తానే ప్రకటించుకుంటారు. గత ఐదేళ్లలో అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులే ఎలా చెబుతారు’ అని ఆయన విరుచుకుపడ్డారు.

News March 29, 2024

బీఆర్ఎస్‌లోని చెత్త అంతా పోయింది: ఎమ్మెల్యే పోచారం

image

TG: బీఆర్ఎస్ పార్టీలోని చెత్త అంతా పోయిందని ఆ పార్టీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ‘ప్రస్తుతం పార్టీలో గట్టి వాళ్లే మిగిలారు. పదవులు, వ్యాపారాల కోసం వచ్చినవారే పార్టీ మారారు. నాయకులను కొంటారేమో గానీ.. కార్యకర్తలను మాత్రం కొనలేరు. మోసకారుల లిస్ట్ రాస్తే తొలి పేరు బీబీ పాటిల్‌దే ఉంటుంది. ఎంపీ ఎన్నికల తర్వాత బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.

News March 29, 2024

USA క్రికెట్ జట్టులో హైదరాబాద్ అమ్మాయి

image

అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన ఇమ్మడి సాన్వికి చోటు దక్కింది. యూఏఈలో జరగనున్న ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున ఆమె అరంగేట్రం చేశారు. ఆమె రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. సాన్వి కుటుంబం సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండీకి చెందినది.

News March 29, 2024

అప్పుడు హెచ్చులకు పోయింది.. ఇప్పుడు తోకముడిచింది – 1/2

image

హెచ్చులకుపోయి భారత్‌తో సంబంధాలు చెడగొట్టుకున్న పాకిస్థాన్ ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలని భావిస్తోందట. దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడటం వంటి చర్యలతో పాక్ వక్ర బుద్ధిని చాటుకుంటున్నా కాస్తోకూస్తో ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగేది. దీంతో పాక్ లబ్ధి పొందేది. కానీ 2019లో జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ మొండి పట్టే ఆ దేశానికి చేటు చేసింది.

News March 29, 2024

అప్పుడు హెచ్చులకు పోయింది.. ఇప్పుడు తోకముడిచింది – 2/2

image

ట్రేడ్ నిలిచిపోవడంపై అసంతృప్తితో ఉన్న వ్యాపార వర్గాలు సత్సంబంధాలు నెలకొల్పాలని పాక్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నాయట. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ఇటీవల పేర్కొన్నారు. భారత్‌లో ఎన్నికల తర్వాత దీనిపై ముందుకెళ్లాలని పాక్ భావిస్తోందట. పూర్తిస్థాయిలో ట్రేడ్‌ జరిగితే పాక్ ఎగుమతులు గరిష్ఠంగా 80% పెరగొచ్చని 2018లో ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

News March 29, 2024

ఎన్నికల తర్వాత BRS కనుమరుగు: ఉత్తమ్

image

TG: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ఎంపీ ఎన్నికల్లో మేం 13 నుంచి 14 స్థానాల్లో గెలుస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్ పని అయిపోయింది ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ కష్టమే’ అని ఆయన పేర్కొన్నారు.

News March 29, 2024

అమ్మాయిని నగ్నంగా ఊరేగించిన ఫొటోకు అవార్డు

image

గతేడాది అక్టోబర్‌లో హమాస్ ఉగ్రవాదులు ఓ జర్మనీ అమ్మాయిని నగ్నంగా కారులో ఊరేగించిన ఫొటో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆ ఫొటోను ‘పిక్చర్ ఆఫ్ ది ఇయర్ ఇంటర్నేషనల్ అవార్డు’కు ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. దీంతో అవార్డు ప్రకటించిన ‘డొనాల్డ్ W రేనాల్డ్స్ జర్నలిజం ఇన్‌స్టిట్యూట్’పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మానవత్వం మరిచి, అలాంటి ఫొటోను అవార్డుకు ఎంపిక చేస్తారా? అని మండిపడుతున్నారు.

News March 29, 2024

RCBvsKKR: 2019 సీన్ రిపీటవుతుందా?

image

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే RCBvsKKR మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన RCB ఒకటి ఓడిపోయి మరొకటి గెలిచింది. KKRకి ఇది రెండో మ్యాచ్ కాగా మొదటిది గెలుపొందింది. అయితే, ఈ మ్యాచ్‌లో KKR ప్లేయర్ రస్సెల్ మరోసారి విధ్వంసం సృష్టిస్తారా? అనేదానిపై నెట్టింట చర్చ జరుగుతోంది. 2019లో ఇదే స్టేడియంలో RCB గెలిచే మ్యాచ్‌లో రస్సెల్ 13 బంతుల్లో 48 రన్స్ చేసి KKRను గెలిపించారు.

News March 29, 2024

బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్.. స్పందించిన ఈసీ!

image

మరికొన్ని రోజుల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని వార్తాపత్రికల్లో దీనిపై కథనాలు రావడంతో ఓటర్లలో గందరగోళం ఏర్పడింది. ఈక్రమంలో దీనిపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ వార్తలు ఫేక్ అని, ఇలాంటి నిరాధారమైన వాటిని నమ్మొద్దని పేర్కొంది. అలాంటి ఆదేశాలివ్వలేదని ఈసీ వెల్లడించింది.

News March 29, 2024

రికార్డు బద్దలు కొట్టారు: SRH

image

IPL చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ ఘనతపై SRH ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, హెడ్, మార్క్రమ్ ఫొటోలతో 277 అని ఉన్న పోస్టర్‌ను SRH షేర్ చేసింది. ‘పర్వతం ఎక్కేశారు. రికార్డు బద్దలు కొట్టారు. చరిత్ర సృష్టించారు’ అని ట్వీట్ చేసింది. ఇదివరకు ఈ రికార్డు RCB పేరుపై ఉండేది.